కేసీఆర్ దళిత ద్రోహి: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ దళిత ద్రోహి అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో చెప్పిన మాట తప్పిన మొదటి సీఎం కేసీఆర్ అని పొన్నాల అన్నారు.
తెలంగాణకు తొలి సీఎం దళితుడేనని, దళితులకు మూడెకరా ల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్... అధికారం దక్కాక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సైతం అమలు చేయకుండా మోసం చేస్తు న్నారన్నారు. నోట్ల రద్దుతో దేశాన్ని మోదీ అధోగతి పాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 19 నుంచి నియోజకవర్గ స్థాయిలో జన ఆవేదన సమ్మేళనాలను నిర్వహిస్తు న్నామని పొన్నాల తెలిపారు.