'జైరాం రమేష్ కాకమ్మ కబుర్లు' | Jairam Ramesh talking value less words: Jupudi Prabhakar | Sakshi
Sakshi News home page

'జైరాం రమేష్ కాకమ్మ కబుర్లు'

Published Tue, Mar 4 2014 2:46 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

జూపూడి ప్రభాకర రావు

జూపూడి ప్రభాకర రావు

హైదరాబాద్: కేంద్ర మంత్రి జైరాం రమేష్‌  కాకమ్మ కబుర్లు చెబుతున్నారని  వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ బిల్లులో లేని అంశాలపై జైరాం రమేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ఢిల్లీలో ఉన్న పార్లమెంట్, సుప్రీం కోర్టులను కూడా ఇతర ప్రాంతాలకు మారుస్తారా? అని ప్రశ్నించారు.

ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లో జైరాం రమేష్ ఎలా తిరుగుతారని అడిగారు. అతనిపై  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏ అధికారం ఉన్నదని సీమాంధ్ర గురించి మాట్లాడుతున్నారని ఆయన జైరాంని ప్రశ్నించారు. సీమాంధ్రకు అన్యాయం జరిగిందని భావిస్తే మీరు కేంద్రమంత్రిగా ఉండి ముందు ఎందుకు ఖండించలేదని అడిగారు.  దివంగత మహానేత డాక్టర్ వైఎస్ దయాదాక్ష్యిణ్యాలతో రాష్ట్రం నుంచి మీరు ఎంపీ అయ్యారన్న సంగతి గుర్తులేదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో విసిరేస్తారన్నారు.  కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలు రైతు బజార్‌లో పెట్టి ఫ్రీగా ఇచ్చినా తీసుకోవడానికి ఎవరూ సిద్దంగాలేని జూపూడి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement