: మండలిలో సెక్రటరీ నోట్ చదివితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించిందని పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. బిల్లును మండలిలో పంచకుండా తమ నిరసనను తెలిపామన్నారు. వివిధ పార్టీలకు చెందిన ఇతర మిత్రులు కూడా తమకు సహకరించారని ఆయన చెప్పారు. శ్రీనివాసులు నాయుడు, నన్నపనేని రాజకుమారి కూడా మద్దతు చెప్పారన్నారు.