ఏపీపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు: జూపూడి | YSRCP Leader Jupudi Prabhakar Rao Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు: జూపూడి

Published Thu, Jun 3 2021 2:35 PM | Last Updated on Thu, Jun 3 2021 4:26 PM

YSRCP Leader Jupudi Prabhakar Rao Comments On Chandrababu - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాజ్యాంగానికి అత్యున్నత గౌరవం లభించిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు.

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాజ్యాంగానికి అత్యున్నత గౌరవం లభించిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పాలసీని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడంలేదన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని జూపూడి అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు తన పాలనలో దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కడ జరిగాయో చంద్రబాబు చెప్పాలి. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజం. ప్రభుత్వంపై కుట్రలు చేయటమే చంద్రబాబు పనిగా కనిపిస్తోంది. రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు. దొంగలు మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతున్నారని’’ జూపూడి ధ్వజమెత్తారు.

చదవండి: దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్‌ శ్రీకారం
సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చు: బొత్స


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement