ఒంగోలు : అసమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రం అల్లకల్లోలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవుల కోసమే రాష్ట్రాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. వైఎజ్ జగన్ను జైలులో పెట్టి రాష్ట్రాన్ని విడగొడితే ప్రజలు ఊరుకోరని జూపూడి అన్నారు. కొండేపి మండలం కె.ఉప్పలపాడులో వైఎస్ఆర్ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు.