
సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీపై టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విలువలు లేని జాతీయ పార్టీ అని విమర్శించారు. ప్రధాని మోదీ నియంత పోకడలకు పోతున్నారన్నారు. బీజేపీ చేసిన మోసంపై వందసార్లు ప్రశిస్తామని.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక బీజేపీ నేతలు తోకలు ముడిచి పారిపోతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ రోజు పైకెళ్తున్నామనుకుంటే సరిపోదు, ఆరోహణ క్రమం తరువాత అవరోహణ క్రమం ఉంటుందని, అందుకే బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని వ్యాఖ్యానించారు. హిట్లర్‌లా పాలించాలంటే కుదరదని, పాకిస్థాన్‌లో ముషారఫ్‌కు ఏమైందో మోదీ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం అంటూ వచ్చి నియంతలా వ్యవహరిస్తున్న మోదీకి అదేగతి పడుతుందన్నారు. రేపు కర్నాటక ఎన్నికల్లో బీజేపీ నేతలు ఉత్తర కుమారులు కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో 18 నియోజక వర్గాలను ప్రభావితం చేయగల స్థితిలో తెలుగు ప్రజలు ఉన్నారని జూపూడి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment