
సాక్షి, విశాఖపట్నం: పరిస్థితి చేజారి పోతే మనిషిలో కొత్త శక్తి బయటకు వస్తుంది అది ఆడ కావచ్చు మగ కావచ్చు... నిస్సహాయులు కావచ్చు. ఈ క్రమంలోనే తప్పతాగి తిక్క వేషాలు వేసిన ఓ అకతాయికి తిక్క కుదిర్చిందో ఓ మహిళ. విశాఖ నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో రౌడీల ఆగడాలు నిత్యం కనిపిస్తుంటాయి. పేదరికం తో పాటు నగర శివారు ప్రాంతం కావడంతో ఆకతాయిలు రౌడీ మూకలు అమాయకులను బెదిరిస్తున్నారు. అలా ఆరిలోవ లో క్రాంతి నగర్ లో ఓ మహిళ దుకాణం వద్దకు రామకృష్ణ అనే యువకుడు వెళ్లాడు.
అక్కడకి వెళ్లి ఆమెపై దుర్భాష లాడి రౌడీయిజం చెలాయించాడు. ఆ మహిళపై పై చేయు చేసుకున్నాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ యువకుడిపై తిరగబడింది.. చేతికి చిక్కిన రౌడిని నాలుగు దెబ్బలు తగిలించింది. ఈ సీన్ మొత్తం అక్కడే ఉన్నవాళ్లు మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు విశాఖలో వైరల్అవుతోంది. పోలీసులు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. కాగా ఇటీవల విశాఖ నగర శివారులో ఇలాంటి అల్లరిమూకల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో రౌడీ బుద్ధి చెప్పిన మహిళ తెగువను ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment