
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. నీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారంటూ ధ్వజమెత్తారు. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించకుండా అడ్డుకున్న హీన చరిత్ర బీటెక్ రవిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అప్రజాస్వామ్యంగా గెలిచిన వీటిని ఎన్నికలు అంటారా..? అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు.
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీటెక్ రవిని పులివెందుల ప్రజలు ఓడించిన చరిత్ర మరిచిపోయావా? వైఎస్ వివేకా హత్యను రాజకీయంగా వాడుకోకపోతే బీటెక్ రవికి ఆ పార్టీలో మనుగడ కూడా లేదు. మీ సొంత గ్రామంలో ఇప్పటివరకు ఏ ఎలక్షన్‌లోనూ గెలవని చరిత్ర నీది. రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాము’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment