స్కూలు కోసం పాపారావు స్థలం సేకరణ
అదే సర్వే నంబర్‌లోని సత్యవతి స్థల సేకరణపై కోర్టు స్టే
మరోచోట పాఠశాల నిర్మాణం
స్కూలు కోసం సేకరించిన స్థలంలో వాంబే ఇళ్ల నిర్మాణం
పొరపాటున సత్యవతి స్థలంలో కూడా కట్టిన వైనం
దీనిపై కోర్టును ఆశ్రయించిన సత్యవతి కుమారుడు
విచారణ జరిగితే ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం
అందుకే ఆక్రమణలపై నోరు మెదపని యంత్రాంగం
సాక్షి, రాజమహేంద్రవరం : ఎవరైనా ఓ ప్రైవేటు వ్యక్తి 20 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ప్రభుత్వ యంత్రాంగం కోర్టును ఆశ్రయించి, పోలీసుల సహాయంతో ఖాళీ చేయిస్తుంది. అలాంటిది రాజమహేంద్రవరం నగరం ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన సుమారు మూడెకరాల స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి తనదంటూ ఆక్రమించి, అమ్మేసేందుకు చకచకా పావులు కదుపుతుంటే అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్ 730/2సి2 స్థలంలోని పేదలను ఖాళీ చేయించి కంచె వేయడం ప్రారంభించి శనివారంతో మూడు నెలలవుతోంది. ఇప్పటికీ కూడా అధికారులు దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. విచారణ చేసి ఆ స్థలంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. విలేకర్లు ప్రస్తావిస్తే విచారణ చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారు. తమ పరిధిలోకి రాదంటూ రెవెన్యూ, నగర పాలక సంస్థ అధికారులు చెబుతూ గడిపేస్తున్నారు. అసలు ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తత వెనుక మతలబేమిటన్న కోణంలో ‘సాక్షి’ చేసిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్లు 724/డి, 725/3ఎ, 725/3బి, 730/2సి2, 731/2లలో 5.87 ఎకరాలకు 1985లో అవార్డు ప్రకటించారు. కోర్టు స్టేలు, సేకరణ ఉపసంహరణల తర్వాత చివరికి రెవెన్యూ యంత్రాంగం ప్రకటించిన అవార్డు 3.80 ఎకరాలకు వర్తించింది. వీరభద్రపురం మున్సిపల్ హైసూ్కల్ కోసం ఈ భూమి సేకరణకు యత్నించగా ఈ ప్రక్రియ దాదాపు 2001 వరకు నడిచింది. దీంతో హైసూ్కల్ నిర్మాణం ప్రస్తుతం ఉన్న స్థలం ఎదురుగా (కంబాల చెరువు నుంచి పేపర్ మిల్లు రోడ్డు వైపు) నిర్మించారు. కోర్టు వివాదాల అనంతరం ఆ స్థలంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అప్పటికే పాఠశాల నిర్మించడంతో ఆ స్థలంలో పేదలకు వాంబే ఇళ్లు నిర్మించాలని 2003లో నిర్ణయించి, అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఎ నుంచి ఐ వరకు 9 బ్లాకులు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 2003లో ఎ బ్లాక్ నిర్మించి పేదలకు ఇచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు క్రమేపీ హెచ్ బ్లాక్ వరకు నిర్మించి, ఎంపిక చేసిన పేదలకు కేటాయించాయి. స్థలం లేకపోవడమో మరే ఇతర కారణమో కానీ ఐ బ్లాక్ నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభించలేదు. అయితే ఆ బ్లాక్‌లో ఎవరెవరికి ఇళ్లివ్వాలనేది ముందుగానే ఎంపిక చేశారు. వారిలో కొంతమంది ఆదెమ్మదిబ్బలో తెలుగు తమ్ముడు ఖాళీ చేయించిన పేదలు ఉన్నారు. ఎ నుంచి ఐ వరకు వాంబే బ్లాకుల నిర్మాణ ప్లా¯ŒSను హోలీ ఏంజెల్స్ స్కూల్ భవనం వెనుక గోడపై స్పష్టంగా పెయింటింగ్ చేశారు.
వాంబే ఇళ్ల నిర్మాణంలో ఏం జరిగింది?
పేపర్లపై యంత్రాంగం వేసిన ప్లా¯ŒS అమలు క్షేత్రస్థాయిలో విరుద్ధంగా జరిగింది. సత్యవోలు పాపారావు స్థలాన్ని ప్రభుత్వం సేకరించి అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే హైకోర్టు స్టే విధించడంతో సత్యవోలు సత్యవతి స్థలానికి అవార్డు వర్తించని విషయం పాఠకులకు తెలిసిందే. అయితే సత్యవోలు పాపారావు స్థలంతోపాటు సత్యవోలు సత్యవతి స్థలంలో కూడా పొరపాటున వాంబే ఇళ్లు కట్టేశారు. తన స్థలంలో ప్రభుత్వం వాంబే గృహాలు కట్టిందంటూ 2011లో సత్యవోలు సత్యవతి రెండో కుమారుడు దినకర ప్రసాద్ రాజమండ్రి కోర్టును ఆశ్రయించే వరకు ఈ విషయం అధికారులు కూడా గుర్తించలేదు. తన స్థలంలో ప్రభుత్వం వాంబే ఇళ్లు కట్టిందంటూ కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్, ప్రతివాదులుగా పేర్కొంటూ దినకర ప్రసాద్ రాజమండ్రి కోర్టులో ఓఎస్ నంబర్ 62/2011 దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికీ నగరపాలక సంస్థ యంత్రాంగం కోర్టు వాయిదాలకు హాజరవుతోంది.
తమకు ఇబ్బంది వస్తుందనేనా?
సేకరించిన కొంత స్థలంతోపాటు పొరపాటున ప్రైవేటు వ్యక్తికి చెందిన మరికొంత స్థలంలో వాంబే ఇళ్లు కట్టడంతో యంత్రాంగం తప్పు చేసినట్లయింది. తెలియక చేసినా ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కింది స్థాయి అధికారులు తాత్సారం చేసినట్లు సమాచారం. చేసిన తప్పు ఒప్పుకుంటే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న జంకుతోనే అధికార యంత్రాం గం అసలు విషయాన్ని తొక్కిపెడుతుందన్న విషయం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే సత్యవోలు పాపారావు రెండో కుమారుడు శేషగిరిరావు ఆ స్థలం తనదని పేర్కొం టూ కోలమూరు టీడీపీ నేత, ఆ గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడితో, అక్కడ పేదలను ఖాళీ చేయించి ఏకంగా బోర్డులే పెట్టేశారని తెలుస్తోంది.