dhibba
-
అందుకేనా..?
స్కూలు కోసం పాపారావు స్థలం సేకరణ అదే సర్వే నంబర్లోని సత్యవతి స్థల సేకరణపై కోర్టు స్టే మరోచోట పాఠశాల నిర్మాణం స్కూలు కోసం సేకరించిన స్థలంలో వాంబే ఇళ్ల నిర్మాణం పొరపాటున సత్యవతి స్థలంలో కూడా కట్టిన వైనం దీనిపై కోర్టును ఆశ్రయించిన సత్యవతి కుమారుడు విచారణ జరిగితే ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అందుకే ఆక్రమణలపై నోరు మెదపని యంత్రాంగం సాక్షి, రాజమహేంద్రవరం : ఎవరైనా ఓ ప్రైవేటు వ్యక్తి 20 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ప్రభుత్వ యంత్రాంగం కోర్టును ఆశ్రయించి, పోలీసుల సహాయంతో ఖాళీ చేయిస్తుంది. అలాంటిది రాజమహేంద్రవరం నగరం ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన సుమారు మూడెకరాల స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి తనదంటూ ఆక్రమించి, అమ్మేసేందుకు చకచకా పావులు కదుపుతుంటే అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్ 730/2సి2 స్థలంలోని పేదలను ఖాళీ చేయించి కంచె వేయడం ప్రారంభించి శనివారంతో మూడు నెలలవుతోంది. ఇప్పటికీ కూడా అధికారులు దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. విచారణ చేసి ఆ స్థలంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. విలేకర్లు ప్రస్తావిస్తే విచారణ చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారు. తమ పరిధిలోకి రాదంటూ రెవెన్యూ, నగర పాలక సంస్థ అధికారులు చెబుతూ గడిపేస్తున్నారు. అసలు ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తత వెనుక మతలబేమిటన్న కోణంలో ‘సాక్షి’ చేసిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్లు 724/డి, 725/3ఎ, 725/3బి, 730/2సి2, 731/2లలో 5.87 ఎకరాలకు 1985లో అవార్డు ప్రకటించారు. కోర్టు స్టేలు, సేకరణ ఉపసంహరణల తర్వాత చివరికి రెవెన్యూ యంత్రాంగం ప్రకటించిన అవార్డు 3.80 ఎకరాలకు వర్తించింది. వీరభద్రపురం మున్సిపల్ హైసూ్కల్ కోసం ఈ భూమి సేకరణకు యత్నించగా ఈ ప్రక్రియ దాదాపు 2001 వరకు నడిచింది. దీంతో హైసూ్కల్ నిర్మాణం ప్రస్తుతం ఉన్న స్థలం ఎదురుగా (కంబాల చెరువు నుంచి పేపర్ మిల్లు రోడ్డు వైపు) నిర్మించారు. కోర్టు వివాదాల అనంతరం ఆ స్థలంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అప్పటికే పాఠశాల నిర్మించడంతో ఆ స్థలంలో పేదలకు వాంబే ఇళ్లు నిర్మించాలని 2003లో నిర్ణయించి, అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఎ నుంచి ఐ వరకు 9 బ్లాకులు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 2003లో ఎ బ్లాక్ నిర్మించి పేదలకు ఇచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు క్రమేపీ హెచ్ బ్లాక్ వరకు నిర్మించి, ఎంపిక చేసిన పేదలకు కేటాయించాయి. స్థలం లేకపోవడమో మరే ఇతర కారణమో కానీ ఐ బ్లాక్ నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభించలేదు. అయితే ఆ బ్లాక్‌లో ఎవరెవరికి ఇళ్లివ్వాలనేది ముందుగానే ఎంపిక చేశారు. వారిలో కొంతమంది ఆదెమ్మదిబ్బలో తెలుగు తమ్ముడు ఖాళీ చేయించిన పేదలు ఉన్నారు. ఎ నుంచి ఐ వరకు వాంబే బ్లాకుల నిర్మాణ ప్లా¯ŒSను హోలీ ఏంజెల్స్ స్కూల్ భవనం వెనుక గోడపై స్పష్టంగా పెయింటింగ్ చేశారు. వాంబే ఇళ్ల నిర్మాణంలో ఏం జరిగింది? పేపర్లపై యంత్రాంగం వేసిన ప్లా¯ŒS అమలు క్షేత్రస్థాయిలో విరుద్ధంగా జరిగింది. సత్యవోలు పాపారావు స్థలాన్ని ప్రభుత్వం సేకరించి అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే హైకోర్టు స్టే విధించడంతో సత్యవోలు సత్యవతి స్థలానికి అవార్డు వర్తించని విషయం పాఠకులకు తెలిసిందే. అయితే సత్యవోలు పాపారావు స్థలంతోపాటు సత్యవోలు సత్యవతి స్థలంలో కూడా పొరపాటున వాంబే ఇళ్లు కట్టేశారు. తన స్థలంలో ప్రభుత్వం వాంబే గృహాలు కట్టిందంటూ 2011లో సత్యవోలు సత్యవతి రెండో కుమారుడు దినకర ప్రసాద్ రాజమండ్రి కోర్టును ఆశ్రయించే వరకు ఈ విషయం అధికారులు కూడా గుర్తించలేదు. తన స్థలంలో ప్రభుత్వం వాంబే ఇళ్లు కట్టిందంటూ కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్, ప్రతివాదులుగా పేర్కొంటూ దినకర ప్రసాద్ రాజమండ్రి కోర్టులో ఓఎస్ నంబర్ 62/2011 దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికీ నగరపాలక సంస్థ యంత్రాంగం కోర్టు వాయిదాలకు హాజరవుతోంది. తమకు ఇబ్బంది వస్తుందనేనా? సేకరించిన కొంత స్థలంతోపాటు పొరపాటున ప్రైవేటు వ్యక్తికి చెందిన మరికొంత స్థలంలో వాంబే ఇళ్లు కట్టడంతో యంత్రాంగం తప్పు చేసినట్లయింది. తెలియక చేసినా ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కింది స్థాయి అధికారులు తాత్సారం చేసినట్లు సమాచారం. చేసిన తప్పు ఒప్పుకుంటే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న జంకుతోనే అధికార యంత్రాం గం అసలు విషయాన్ని తొక్కిపెడుతుందన్న విషయం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే సత్యవోలు పాపారావు రెండో కుమారుడు శేషగిరిరావు ఆ స్థలం తనదని పేర్కొం టూ కోలమూరు టీడీపీ నేత, ఆ గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడితో, అక్కడ పేదలను ఖాళీ చేయించి ఏకంగా బోర్డులే పెట్టేశారని తెలుస్తోంది. -
కబ్జా చేసి.. చదును చేస్తూ..
రూ.100 కోట్ల ప్రభుత్వ స్థలం ప్రైవేటుపాలు ఆక్రమించి చదును చేస్తున్న జన్మభూమి కమిటీ సభ్యుడు మిగిలిన ముగ్గురు పేదల గుడిసెలు ఖాళీ బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడకు వెళ్లిన ‘సాక్షి’ సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలోని అదెమ్మదిబ్బ ప్రాంతంలో సర్వే నంబర్ 730/2సీ2లో ఉన్న (3.54 ఎకరాలు) రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నేత, జన్మభూమి కమిటీ సభ్యుడు యథేచ్ఛగా కబ్జా చేశారు. అక్కడ గుడిసెలు, రేకు షెడ్లు వేసుకుని నివసిస్తున్న 110 మంది పేదలను నయానో భయానో ఖాళీ చేయించారు. మూడు నెలలుగా ఈ తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు అంతంత మాత్రంగానే స్పందించ డం గమనార్హం. ఆ స్థలం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ 1985లో సేకరించి నగరపాలక సంస్థ పాఠశాల నిర్మాణానికి అప్పగించారని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా కథనాలను ప్రచురించినా రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం, స్థలంపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. తాజాగా స్థలం కొన్నానంటూ చెబుతున్న రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆ గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఏ దిక్కూలేక మూడు నెలలుగా ప్రతిఘటించి అక్కడే ఉంటున్న ముగ్గురు పేద కుటుంబాలను సోమవారం ఖాళీ చేయించే ప్రక్రియ ప్రారంభించారు. చుట్టూ కంచె, మధ్యలో రేకుల షెడ్డు ఉన్నా కంచె వేయడంతో అక్కడ ఉన్న వృద్ధుడిని ఖాళీ చేయించారు. అతను తన సామాగ్రిని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ వృద్ధుడి ఇంటిని కూలీలు నేలమట్టం చేశారు. మిగిలిన రెండు పూరిగుడిసెలవారిని తమ సామాగ్రి బయట పెట్టుకోవాలని బెదిరిస్తున్నారు. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పకోవాలో అర్ధంగాక వారు ‘సాక్షి’కి ఫోన్ చేశారు. నా స్థలంలోకి ఎందుకు వచ్చావ్ ? బాధితుల ఫిర్యాదు మేరకు ఆదెమ్మదిబ్బ ప్రాంతానికి ‘సాక్షి’ వెళ్లి చూడగా రేకుల షెడ్డు తొలగిస్తూ, ఆ ప్రాంతాన్ని పొక్లెయిన్‌తో చదును చేస్తున్నారు. రేకుల షెడ్డు వృద్ధుడు చెప్పిన మేరకు అతడి నివాసాన్ని పరిశీలించేందుకు అక్కడకి వెళ్లగా ‘ ఈ స్థలం నేను కొన్నాను. లోపలికి ఎందుకు వచ్చావ్? ఎవరు ఇక్కడకు రమ్మన్నారు?’ అంటూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇక్కడకు వచ్చానని, మీరు ఈ స్థలం కొనుగోలు చేస్తే పత్రాలు చూపించాలని అడగ్గా, స్థలం పత్రాలు కావాలంటే అర్బన్ఎమ్మార్వోను అడగాలని చెప్పుకొచ్చారు. -
ఔను.. ఆ స్థలం ప్రభుత్వానిదే..
‘ఆదెమ్మదిబ్బ’పై తేలుతున్న వాస్తవాలు నగరపాలక సంస్థ పాఠశాల కోసం సేకరించిన స్థలమిది 1985లోనే అవార్డు ప్రకటన ఐదు సర్వే నంబర్లలో 5.87 ఎకరాల సేకరణ అందులోనే సర్వే నంబర్ 730/2సీ2లో సత్యవోలు పాపారావుకు చెందిన 1.81 ఎకరాల స్థలం సేకరణలో లేని ఆయన మరదలు సత్యవతి స్థలం అదే విషయం చెబితే బుకాయించిన సత్యవోలు పాపారావు రెండో కుమారుడు శేషగిరిరావు ‘సాక్షి’ వద్ద పక్కా ఆధారాలు సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగు తమ్ముడి కబ్జా పర్వం బట్టబయలైంది. ‘సాక్షి’ మొదటినుంచీ చెబుతున్నదే నిజమైంది. ఆదెమ్మదిబ్బ స్థలంలోని సర్వే నంబర్ 730/2సీ2లోని సత్యవోలు పాపారావు, ఆయన నలుగురు కుమారుల స్థలం ఎకరా 81 సెంట్లను ప్రభుత్వం సేకరించి, అందుకు అవార్డు (నగదు) కూడా చెల్లించింది. వీరితోపాటు మరో ఐదు సర్వే నంబర్లలో మొత్తం 5 ఎకరాల 87 సెంట్ల భూమి సేకరించారు. కొన్ని సర్వే నంబర్లలోని భూమిని సేకరణ నుంచి మినహాయించగా, సర్వే నంబర్ 730/2సీ2లోని సత్యవోలు పాపారావు తమ్ముడు లింగమూర్తి, సత్యవతి దంపతుల వాటాపై న్యాయస్థానం స్టే (యథాతథ స్థితి) విధించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ అభ్యర్థన మేరకు సేకరణ రాజమహేంద్రవరం వీరభద్రపురంలో మున్సిపల్ హైస్కూల్ నిర్మాణం కోసం అప్పటి మున్సిపల్ కమిషనర్ అభ్యర్థన (9.11.1978) మేరకు అప్పటి సబ్ కలెక్టర్ స్థల సేకరణ కోసం 20.07.1979న డ్రాఫ్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేశారు. ఇందులో సర్వే నంబర్లు 724/1డీలో 25 సెంట్లు, 725/3ఎలో ఎకరా 81 సెంట్లు, 725/3ఇలో ఒక సెంటు, 730/2సీ2లో 3 ఎకరాల 69 సెంట్లు, 731/2లో 11 సెంట్లు వెరసి మొత్తం 5 ఎకరాల 87 సెంట్ల స్థల సేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేశారు. దీనిపై 28.05.1980న డ్రాఫ్ట్ డిక్లరేష¯ŒS జారీ చేసి 12.06.1981న పీవీ ఆమోదించారు. ఆయా స్థలాల యజమానులకు 30.07.1985న అవార్డు (నంబర్ 6/85) ప్రకటించారు. అవార్డు ఇచ్చిన సర్వే నంబర్ల స్థలం, యజమానులు వీరే.. ఐదు సర్వే నంబర్లలోని మొత్తం 5 ఎకరాల 87 సెంట్లకు అప్పటి కలెక్టర్ ప్రదీప్‌చంద్ర 30.07.1985న అవార్డు (నంబర్ 6/85) ప్రకటించగా.. తరువాత ప్రభుత్వం కొంత స్థల సేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. మరికొందరు న్యాయస్థానానికి వెళ్లి తమ స్థల సేకరణపై స్టే తెచ్చుకున్నారు. వీరందరూ పోగా మిగిలినవారికి అవార్డు అందజేశారు. అవార్డు అందుకున్నవారిలో ఈపు అప్పలస్వామి (సర్వే నంబర్ 724/1డీలో 25 సెంట్లు), కందుల సత్యానందం, కందుల మదన మోహనరావు, కందుల రాజేంద్రప్రసాద్ (సర్వే నంబర్ 725/3ఎ1లో ఎకరా 63 సెంట్లు), కందుల సంజీవరావు (సర్వే నంబర్ 730/2సీ2పీలో ఒక సెంటు), సత్యవోలు పాపారావు అతని కుమారులు (సర్వే నంబర్ 730/2సీ2పీలో ఎకరా 81 సెంట్లు), వాడరేవు వెంకప్పరావు (సర్వే నంబర్ 731/2లో 9 సెంట్లు) ఉన్నారు. వీరి మొత్తం స్థలం 3 ఎకరాల 80 సెంట్లకు అవార్డు అందజేశారు. అవార్డు వర్తించని, కోర్టు స్టే ఇచ్చిన స్థలాలు, యజమానుల వివరాలు సర్వే నంబర్ 725/3ఎ2లో 7,800 చదరపు అడుగులకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డు వర్తించలేదు. అలాగే సర్వే నంబర్ 730/2సీ2పీలో సత్యవోలు సత్యవతి(పాపారావు తమ్ముడు లింగమూర్తి సతీమణి)కి చెందిన ఎకరా 88 సెంట్ల స్థలానికి కూడా అవార్డు వర్తించలేదు. వీరు తమ స్థల సేకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. ఇంకా సర్వే నంబర్ 725/3ఏ2, సర్వే నంబర్ 731/2పీలోని 1,083 చదరపు అడుగుల స్థలాన్ని సేకరణ ప్రతిపాదన నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నాలుగు సర్వే నంబర్లపై కోర్టులో దాదాపు ఆరు కేసులు నడిచాయి. సత్యవోలు పాపారావు అండ్ కుమారుల అవార్డు రూ.2,30,260 సర్వే నంబర్ 730/2సీ2లోని సత్యవోలు పాపారావు, అతని కుమారులు భూసేకరణ అధికారికి ఎలాంటి వినతిపత్రం ఇవ్వలేదు. దీంతో, ప్రభుత్వం సత్యవోలు పాపారావు, అతని కుమారులకు సర్వే నంబర్ 730/2సీ2లో ఎకరా 81 సెంట్ల (ఎకరా 35,436 చదరపు అడుగులు)కు సంబంధించి ç31.07.1985న రూ.2,30,260 అవార్డుగా వారి పేరిట రాజమహేంద్రవరం సబార్డినేట్ జడ్జి వద్ద జమ చేసింది. బుకాయించిన సత్యవోలు శేషగిరిరావు కోలమూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆదెమ్మదిబ్బ స్థలాన్ని కొనుగోలు చేశానంటూ.. అక్కడ నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించి కంచె వేస్తూండడంపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. ఇందులో భాగంగా ‘కొన్నదీ లేదు.. అమ్మిందీ లేదు’ శీర్షికన కథనం ప్రచురించడంతో.. సత్యవోలు పాపారావు రెండో తనయుడినంటూ శేషగిరిరావు అనే వ్యక్తి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ స్థలం తమదేనని, పిన్నమరెడ్డి ఈశ్వరుడుకి అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే ‘సాక్షి’ తనవద్ద ఉన్న అవార్డు కాపీలను చూపించగా తాము తీసుకోలేదని, ఆ సమయంలో ప్రభుత్వంవద్ద డబ్బు లేదని, తాము సేకరణకు ఇవ్వలేదని ఇలా పలురకాల సమాధానాలు చెప్పారు. ఆ స్థలం నగరపాలక సంస్థదే.. వీరభద్రపురం నగరపాలక సంస్థ హైస్కూల్ కోసం ప్రభుత్వం స్థలం సేకరించింది. దీనిపై పైన పేర్కొన్న కొందరు కోర్టులను ఆశ్రయించడంతో ఆ కేసులు దాదాపు 2001 సంవత్సరం వరకూ సాగాయి. దీంతో వీరభద్రపురం నగరపాలక సంస్థ హైస్కూల్ నిర్మాణం ఆ స్థలంలో జరగలేదు. కంబాలచెరువు నుంచి పేపర్ మిల్లు వెళ్లే రోడ్డులో ఆదెమ్మదిబ్బ స్థలం ప్రాంతం ఎదురుగా రోడ్డుకు అవతలి వైపు వీరభద్రపురంలో నగరపాలక సంస్థ ఈ హైస్కూల్ నిర్మాణం చేపట్టింది. మిగిలిన కొంత ప్రాంతంలో పేదల కోసం వాంబే గృహాలు కట్టించి ఇచ్చారు. స్థలంపై విచారణ చేయిస్తా.. ఆ స్థలంపై నేను ఆరా తీశాను. విచారణ చేయిస్తాను. ప్రభుత్వం సేకరించి అవార్డు ప్రకటించిందంటే అది కార్పొరేష¯ŒS స్థలమే. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణ¯ŒSను అడిగి వివరాలు తీసుకుంటాను. – హెచ్.అరుణ్‌కుమార్, కలెక్టర్ -
ఇదిగో ఆఫర్
ఆశచూపిస్తున్న ఆదెమ్మదిబ్బ అక్రమణదారులు ఇక్కడ 50 ఏళ్లుగా ఉంటున్న బ్రాహ్మణులు స్థలం ఖాళీ చేయాలని పది కుటుంబాలకు ఆదేశాలు ఆందోళనకు సిద్ధమవుతుండడంతో బేరసారాలు కోరిన చోట 50 గజాలు ఉచితంగా ఇస్తామని ఆశ రూ.వంద కోట్ల విలువైన ఆదెమ్మదిబ్బ స్థలాన్ని దక్కించుకునేందుకు స్థలం కొన్నట్టుగా చెబుతున్న ఆసాములు.. అక్కడి పేదలను ఖాళీ చేయించేందుకు సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ఖాళీ చేయాలన్న హెచ్చరికలు, నగదు పంపిణీ, గజం స్థలం రూ.13,500కే విక్రయిస్తామని చెబుతున్న ఆక్రమణదారులు.. తాజాగా మరో బంఫర్ ఆఫర్ ప్రకటించారు. అక్కడ నివసిస్తున్న పది కుటుంబాల పేద బ్రాహ్మణులు ఇళ్లు ఖాళీ చేస్తే కోరుకున్న చోట 50 గజాలు ఇస్తామని ప్రకటించారు. - సాక్షి, రాజమహేంద్రవరం ఆదెమ్మదిబ్బ స్థలంలో 36 వార్డు పరిధిలో 50 ఏళ్లకు పైగా 10 బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్నాయి. పేదలైన వీరు వంట పని, ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పైసాపైసా కూడబెట్టి గుడిసెల స్థానంలో పెంకుటిళ్లు, రేకుల షెడ్లు నిర్మించుకుని ఉంటున్నారు. తాజాగా వీరికి కూడా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. తాము ఈ స్థలంలో 50 ఏళ్లుగా ఉంటున్నామని బ్రాహ్మణ మహిళలు తేల్చిచెప్పారు. స్థలం కొనుగోలు చేసినట్టయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని నిలదీశారు. అంతేకాకుండా సత్యవోలు పాపారావు తమకు బాగా తెలుసని, వారి కుమారుడు అమ్మితే అతన్ని తీసుకురావాలని, లేదంటే ఎక్కడున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో స్థలం కొన్నామని చెబుతున్న ఆసాములు సందిగ్ధంలో పడ్డారు. మొదటికే మోసం వస్తుందేమోన్న భయంతో వారితో బేరసారాలు నడుపుతున్నారు. గజం రూ.13,500 లెక్కన విక్రయిస్తామని, అవసరమైన వారు తీసుకోవచ్చని చెబుతున్నారు. వారి ఆఫర్‌ను తిరస్కరించిన మహిళలు తాము ఈ స్థలంలో 50 ఏళ్లుగా ఉంటున్నామని, ఖాళీ చేసే ప్రసక్తే లేదని తెల్చి చెప్పడంతో ఆసాములు వెనుదిరిగారు. మధ్యవర్తిగా స్థానిక ప్రజా ప్రతినిధి! ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో బ్రాహ్మణ మహిళలు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధి ఆసాముల తరఫున రంగంలోకి దిగారు. సీనియర్ ప్రజాప్రతినిధి అయిన ఈ పెద్ద మనిషి ‘మా వారైన మీకు అన్యాయం జరగదు’ అని హామీ ఇస్తున్నారు. ఈ స్థలం వారు కొన్నారంటూ, ఇప్పటికే అందరూ ఖాళీ చేసిన విషయం మీకు తెలిసిందే కదా అంటూ బ్రాహ్మణ మహిళలకు చెబుతున్నారు. అందరూ ఖాళీ చేసిన తర్వాత ‘మనం’ ఆందోళన చేసినా ప్రయోజనం ఉండదని వారిని శాంతింపజేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేస్తే ఈ స్థలంలో వెనుక వైపు ఇప్పుడు ఎంత స్థలంలో ఉంటున్నారో అంత స్థలం గజం రూ.13,500 లెక్కన ఇప్పిస్తానని చెబుతున్నారు. అంత డబ్బు పెట్టి కొనుక్కునే స్తోమత ఉంటే, 50 ఏళ్లుగా ఇక్కడే చెట్ల మధ్య, పాముల మధ్య నివసించే అగత్యం తమకెందుకంటూ మహిళలు నిలదీయడంతో ఆ ప్రజాప్రతినిధి వెళ్లిపోయారు. మరుసటి రోజున వచ్చి ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థలం మేరకు ఒక్కొక్కరికి 50 గజాల చొప్పన 38వ డివిజన్ పరిధిలో వాంబే గృహాల వైపు ఉచితంగా ఇస్తామని ప్రతిపాదించారు. ఎక్కడో ఇస్తే కుదరదని, తాము ఉంటున్నవైపు ఇవ్వాలని మహిళలు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే వీరు ఆందోళనకు సిద్ధమవుతారని గ్రహించిన ఆ ప్రజాప్రతినిధి వారు కోరిన మేరకు 50 గజాల స్థలం ఇచ్చేందుకు ఆసామలు తరఫున ఒప్పుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రిజిస్ట్రేషన్ చేస్తేనే ఖాళీ చేస్తాం హామీ ఇచ్చిన అనంతరం ఆ ప్రజాప్రతినిధి ఇళ్లు ఖాళీ చేయాలని కోరగా, ఇళ్లు ఖాళీ చేసిన తర్వాత ఇవ్వకపోతే తమ పరిస్థితేంటని ఆ మహిళలు ప్రశ్నించినట్టు తెలిసింది. 50 గజాల చొప్పున తమ పది మందికి రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు ఖాళీ చేస్తామని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి మాట్లాడి చెబుతానంటూ వెళ్లిపోయినట్టు తెలిసింది. ప్రస్తుతం బ్రాహ్మణ కుటుంబాలతో బేరసారాలు నడుస్తున్న నేపథ్యంలో వారి ఇళ్లజోలికి వెళ్లకుండా మిగతా పనిని కానిస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న ఇళ్లను, పేపర్‌మిల్లు రోడ్డు వైపున ఉన్న రేకుల షెడ్లను కూలగొడుతున్నారు.