ఇదిగో ఆఫర్‌ | offer aademma dhibba people | Sakshi
Sakshi News home page

ఇదిగో ఆఫర్‌

Published Wed, Dec 21 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

ఇదిగో ఆఫర్‌

ఇదిగో ఆఫర్‌

ఆదెమ్మదిబ్బ స్థలంలో 36 వార్డు పరిధిలో 50 ఏళ్లకు పైగా 10 బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్నాయి. పేదలైన వీరు వంట పని, ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పైసాపైసా కూడబెట్టి గుడిసెల స్థానంలో పెంకుటిళ్లు, రేకుల షెడ్లు నిర్మించుకుని ఉంటున్నారు. తాజాగా వీరికి కూడా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. తాము ఈ స్థలంలో 50 ఏళ్లుగా ఉంటున్నామని బ్రాహ్మణ మహిళలు తేల్చిచె

ఆశచూపిస్తున్న ఆదెమ్మదిబ్బ అక్రమణదారులు
ఇక్కడ 50 ఏళ్లుగా ఉంటున్న బ్రాహ్మణులు
స్థలం ఖాళీ చేయాలని పది కుటుంబాలకు ఆదేశాలు
ఆందోళనకు సిద్ధమవుతుండడంతో బేరసారాలు
కోరిన చోట 50 గజాలు ఉచితంగా ఇస్తామని ఆశ
 
రూ.వంద కోట్ల విలువైన ఆదెమ్మదిబ్బ స్థలాన్ని దక్కించుకునేందుకు స్థలం కొన్నట్టుగా చెబుతున్న ఆసాములు.. అక్కడి పేదలను ఖాళీ చేయించేందుకు సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ఖాళీ చేయాలన్న హెచ్చరికలు, నగదు పంపిణీ, గజం స్థలం రూ.13,500కే విక్రయిస్తామని చెబుతున్న ఆక్రమణదారులు.. తాజాగా మరో బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించారు. అక్కడ నివసిస్తున్న పది కుటుంబాల పేద బ్రాహ్మణులు ఇళ్లు ఖాళీ చేస్తే కోరుకున్న చోట 50 గజాలు ఇస్తామని ప్రకటించారు.
- సాక్షి, రాజమహేంద్రవరం
ఆదెమ్మదిబ్బ స్థలంలో 36 వార్డు పరిధిలో 50 ఏళ్లకు పైగా 10 బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తున్నాయి. పేదలైన వీరు వంట పని, ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పైసాపైసా కూడబెట్టి గుడిసెల స్థానంలో పెంకుటిళ్లు, రేకుల షెడ్లు నిర్మించుకుని ఉంటున్నారు. తాజాగా వీరికి కూడా ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. తాము ఈ స్థలంలో 50 ఏళ్లుగా ఉంటున్నామని బ్రాహ్మణ మహిళలు తేల్చిచెప్పారు. స్థలం కొనుగోలు చేసినట్టయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని నిలదీశారు. అంతేకాకుండా సత్యవోలు పాపారావు తమకు బాగా తెలుసని, వారి కుమారుడు అమ్మితే అతన్ని తీసుకురావాలని, లేదంటే ఎక్కడున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో స్థలం కొన్నామని చెబుతున్న ఆసాములు సందిగ్ధంలో పడ్డారు. మొదటికే మోసం వస్తుందేమోన్న భయంతో వారితో బేరసారాలు నడుపుతున్నారు. గజం రూ.13,500 లెక్కన విక్రయిస్తామని, అవసరమైన వారు తీసుకోవచ్చని చెబుతున్నారు. వారి ఆఫర్‌ను తిరస్కరించిన మహిళలు తాము ఈ స్థలంలో 50 ఏళ్లుగా ఉంటున్నామని, ఖాళీ చేసే ప్రసక్తే లేదని తెల్చి చెప్పడంతో ఆసాములు వెనుదిరిగారు.
మధ్యవర్తిగా స్థానిక ప్రజా ప్రతినిధి!
ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో బ్రాహ్మణ మహిళలు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధి ఆసాముల తరఫున రంగంలోకి దిగారు. సీనియర్‌ ప్రజాప్రతినిధి అయిన ఈ పెద్ద మనిషి ‘మా వారైన మీకు అన్యాయం జరగదు’ అని హామీ ఇస్తున్నారు. ఈ స్థలం వారు కొన్నారంటూ, ఇప్పటికే అందరూ ఖాళీ చేసిన విషయం మీకు తెలిసిందే కదా అంటూ బ్రాహ్మణ మహిళలకు చెబుతున్నారు. అందరూ ఖాళీ చేసిన తర్వాత ‘మనం’ ఆందోళన చేసినా ప్రయోజనం ఉండదని వారిని శాంతింపజేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేస్తే ఈ స్థలంలో వెనుక వైపు ఇప్పుడు ఎంత స్థలంలో ఉంటున్నారో అంత స్థలం గజం రూ.13,500 లెక్కన ఇప్పిస్తానని చెబుతున్నారు. అంత డబ్బు పెట్టి కొనుక్కునే స్తోమత ఉంటే, 50 ఏళ్లుగా ఇక్కడే చెట్ల మధ్య, పాముల మధ్య నివసించే అగత్యం తమకెందుకంటూ మహిళలు నిలదీయడంతో ఆ ప్రజాప్రతినిధి వెళ్లిపోయారు. మరుసటి రోజున వచ్చి ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థలం మేరకు ఒక్కొక్కరికి 50 గజాల చొప్పన 38వ డివిజన్‌ పరిధిలో వాంబే గృహాల వైపు ఉచితంగా ఇస్తామని ప్రతిపాదించారు. ఎక్కడో ఇస్తే కుదరదని, తాము ఉంటున్నవైపు ఇవ్వాలని మహిళలు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే వీరు ఆందోళనకు సిద్ధమవుతారని గ్రహించిన ఆ ప్రజాప్రతినిధి వారు కోరిన మేరకు 50 గజాల స్థలం ఇచ్చేందుకు ఆసామలు తరఫున ఒప్పుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
రిజిస్ట్రేషన్‌ చేస్తేనే ఖాళీ చేస్తాం
హామీ ఇచ్చిన అనంతరం ఆ ప్రజాప్రతినిధి ఇళ్లు ఖాళీ చేయాలని కోరగా, ఇళ్లు ఖాళీ చేసిన తర్వాత ఇవ్వకపోతే తమ పరిస్థితేంటని ఆ మహిళలు ప్రశ్నించినట్టు తెలిసింది. 50 గజాల చొప్పున తమ పది మందికి రిజిస్ట్రేషన్‌ చేస్తే అప్పుడు ఖాళీ చేస్తామని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి మాట్లాడి చెబుతానంటూ వెళ్లిపోయినట్టు తెలిసింది. ప్రస్తుతం బ్రాహ్మణ కుటుంబాలతో బేరసారాలు నడుస్తున్న నేపథ్యంలో వారి ఇళ్లజోలికి వెళ్లకుండా మిగతా పనిని కానిస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న ఇళ్లను, పేపర్‌మిల్లు రోడ్డు వైపున ఉన్న రేకుల షెడ్లను కూలగొడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement