2024 జనవరి 8 నుంచి కెనడాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈఏడాది పంజాబ్‌కు చెందిన 36 వేల మంది విద్యార్థులు కెనడాలోని వివిధ విద్యాలయాల్లో అడ్మిషన్ తీసుకున్నారు. వీరిలో 70 శాతం మంది విద్యార్థులకు వీసాలు వచ్చాయి. విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే కెనడా- భారత్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం కెనడాలో 2,09,930 మంది భారత విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతుండగా, 80,270 మంది విశ్వవిద్యాలయాలలో చదువుతున్నారు. కెనడాలోని వివిధ కళాశాలలను డిప్లొమా కోర్సులను అందిస్తాయి. విశ్వవిద్యాలయాలు బ్యాచిలర్, మాస్టర్స్ డాక్టోరల్ డిగ్రీలను అందిస్తాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డు స్టాండింగ్ కమిటీ నుండి వచ్చిన డేటా ప్రకారం కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి 22.3 బిలియన్ కెనడియన్ డాలర్లకు మించిన అధిక మొత్తాన్ని అందిస్తున్నారు.
తీవ్రతరమవుతున్న దౌత్య సంక్షోభం కెనడా విద్యావ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది ఉన్నత విద్య కోసం వలస వచ్చే భారతీయ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయనుంది. వీసా వ్యవహారాల నిపుణుడు సుకాంత్ తెలిపిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులు కెనడియన్ విద్యార్థుల కంటే రెండింతల మొత్తాన్ని ఆ దేశ విద్యా వ్యవస్థకు అందిస్తున్నారు. అంటారియో ప్రభుత్వం అందించే నిధుల కంటే ఇవి అధికంగానే ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో చెల్లుబాటు అయ్యే స్టడీ వీసాతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది.
వచ్చే ఏడాది జనవరిలో తరగతులకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లనున్న సర్బ్‌జిత్ కౌర్ మాట్లాడుతూ తమకు జనవరి నుండి క్లాసులు ప్రారంభం కానున్నాయని, కెనడాలోని వాంకోవర్‌లో అడ్మిషన్ పూర్తయిందని, టిక్కెట్ కూడా బుక్ అయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కెనడా- భారత్ మధ్య క్షీణించిన సంబంధాలు కారణంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
భారతదేశం- కెనడాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా కెనడాలో తమ పిల్లల చదువుపై తీవ్ర ప్రభావంచూపుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖల్సా వోక్స్ నివేదిక ప్రకారం పంజాబ్ నుండి ప్రతి సంవత్సరం 68,000 కోట్ల రూపాయలు అక్కడి విద్యా వ్యవస్థకు చేరుతాయని తెలిపారు. గత సంవత్సరం రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) కింద కెనడా నుంచి మొత్తం 226,450 వీసాలు ఆమోదం పొందాయి. త్వరలో కెనడాకు వెళుతున్నవారిలో దాదాపు 1.36 లక్షల మంది విద్యార్థులు పంజాబ్‌కు చెందినవారే కావడం గమనార్హం. వీరు రెండు నుంచి మూడేళ్ల వ్యవధి కలిగిన వివిధ కోర్సులను అభ్యసించనున్నారు.
ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు?
Comments
Please login to add a commentAdd a comment