బొట్టు చెదరకున్నా భరోసా | konkodhuru village pension issue | Sakshi
Sakshi News home page

బొట్టు చెదరకున్నా భరోసా

Published Mon, Mar 6 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

బొట్టు చెదరకున్నా భరోసా

బొట్టు చెదరకున్నా భరోసా

అవినీతిపై ‘సాక్షి’ సేకరించిన సాక్ష్యాధారాలిలా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలోని కొంకుదురు గ్రామం అవకతవకలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అక్కడ అర్హులను గాలికొదిలేసి. జన్మభూమి కమిటీ ముసుగులో అనర్హులకు, అనుచరగణానికి పింఛన్లు కట్టబెట్టారు. వాస్తవాలన్నీ తెలిసినా ఉద్యోగులు పెదవి విప్పలేని పరిస్థితి. అడిగే నాథుడు లేడనే ధైర్యంతో నియోజకవర్గంలో ఒక ముఖ్యనేత మేనమామ కొంకుదు

పుణ్యస్త్రీలకూ వితంతు పింఛన్లు
కొంకుదురులో టీడీపీ కుతంత్రం
ముఖ్యనేత మామ కనుసన్నల్లో జన్మభూమి కమిటీ బరితెగింపు
అనర్హులకు యథేచ్ఛగా మంజూరు
అస్మదీయులు కారని అర్హులకు అన్యాయం
పిఠాపురం తరహాలో మరో కుంభకోణం
 
పచ్చచొక్కా వేసుకుంటే చాలు అక్కడ జరగని పని అంటూ ఉండదు. భూమ్మీద నిక్షేపంగా బతికున్న వారికి కూడా చనిపోయినట్టు రికార్డులు పుట్టించి, వారి భార్యలకు వితంతువులుగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లు ఎడాపెడా మంజూరు చేయగలరు. అక్కడ ముఖ్యనేత మామ చేసేదే శాసనం, చెప్పిందే చట్టం. పిఠాపురంలో తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా పింఛన్‌లు మేసేస్తున్న బాగోతం కొలిక్కి రాకుండానే అనపర్తి నియోజకవర్గం కొంకుదురులో వెలుగు చూసిన ఆ తరహా కుంభకోణం ఇది.
 
అవినీతిపై ‘సాక్షి’ సేకరించిన సాక్ష్యాధారాలిలా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలోని కొంకుదురు గ్రామం అవకతవకలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అక్కడ అర్హులను గాలికొదిలేసి. జన్మభూమి కమిటీ ముసుగులో అనర్హులకు, అనుచరగణానికి పింఛన్లు కట్టబెట్టారు. వాస్తవాలన్నీ తెలిసినా ఉద్యోగులు పెదవి విప్పలేని పరిస్థితి. అడిగే నాథుడు లేడనే ధైర్యంతో నియోజకవర్గంలో ఒక ముఖ్యనేత మేనమామ కొంకుదురు పంచాయతీపై పెత్తనం చెలాయిస్తూ అడ్డగోలుగా పింఛన్‌లు అనర్హులకు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
అతడి అండ చూసుకుని తమ్ముళ్లు బరితెగించేశారు. అర్హులకు అన్యాయం చేసి, అనర్హులకు పింఛన్ల భరోసా కల్పించారు. కొంకుదురులో   సత్తి పద్మావతి భర్త వెంకటరామారెడ్డి నిక్షేపంలా వ్యవసాయం  చేస్తున్నాడు. కానీ పింఛన్‌ కోసం చనిపోయినట్టుగా చూపించి భార్యకు వితంతు పింఛన్‌ పంపిణీ చేస్తున్నారు. గుడిమెట్ల పుష్పావతి భర్త రామారెడ్డి కొంకుదురు పరిసర ప్రాంతాల్లో తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. కానీ పుష్పావతికి వితంతు పింఛన్‌ అందుతోంది. గనిశెట్టి నాగమణి భర్త వెంకట్రావు చుట్టలు చుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమణికి కూడా వితంతు పింఛన్‌ మంజూరు చేశారు. గ్రామ జనాభా 6,987. పురుషులు 3,449 మంది, మహిళలు 3,538 మంది. సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 852 మంది. అత్యధికంగా 326 మంది వితంతు పింఛన్లు పొందుతున్నారు. 300 మంది వృద్ధులు, 104 మంది వికలాంగులు, 13 మంది చేనేత కార్మికులు, 7గురు కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతుండగా 102 మంది అభయహస్తం పింఛన్‌లు పొందుతున్నారు. ఇవన్నీ తెలుగుతమ్ముళ్ల ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీలు ఎంపిక చేసినవేనంటున్నారు.  వయసు తక్కువైనా జన్మభూమి కమిటీలోని తెలుగుతమ్ముళ్లకు నచ్చిన వారైతే ఒకే ఇంటిలో ఇద్దరికి పింఛన్‌లు ఇచ్చేశారు. ఒక ఇంటిలో ఆధార్‌ నంబర్‌ 240009279916, పింఛన్‌ ఐడీ నంబరు 702682తో పడాల గంగిరెడ్డికి, ఆధార్‌ నంబర్‌ 307946113548 , ఐడీ నంబర్‌ 192547తో అతని భార్య పడాల లక్షి్మకి ఇద్దరికీ వృద్ధాప్య పింఛన్‌లు మంజూరు చేశారు.
అన్ని అర్హతలున్నా అక్కడి జన్మభూమి కమిటీ చాలా మంది నిర్భాగ్యులను పింఛన్లకు దూరం చేసింది. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాం నుంచి పింఛన్‌లు తీసుకుంటున్న అర్హులను జాబితా నుంచి తొలగించేశారు. టీడీపీకి కాక  వైఎస్సార్‌ సీపీకి ఓటేశారని కొందరిని, ఆ పార్టీ ప్రచారానికి వెళ్లారని మరికొందరిని, ఆటోలో తీసుకువెళ్లారని ఇంకొందరిని...ఇలా పింఛన్లను తొలగించేసి నిర్భాగ్యులను రోడ్డునపడేశారు. వికలాంగురాలైన చిట్టూరి సత్యవతి వైఎస్‌ హయాంలో  పింఛన్‌ పొందేది. ఇటీవల జన్మభూమి గ్రామసభలో తెలుగుతమ్ముళ్లు ఆమె పింఛన్‌ను రద్దుచేసేశారు. వికలాంగుల సర్టిఫికెట్‌ ఉందని  వేడుకున్నా కనికరం చూపలేదు. వయసు మీదపడి అడుగు ముందుకు పడని వారిపై కూడా వారు దయ చూపలేదు. తమకు పింఛన్‌లు లేకుండా చేసిన టీడీపీ వారికి తమ ఉసురు తగుతుందని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.  
పెత్తనమంతా జన్మభూమి కమిటీదే...
అధికారులు పేరుకే తప్ప పెత్తనం అంతా జన్మభూమి కమిటీదే. జన్మభూమి కమిటీలో టీడీపీకి చెందిన స్థానిక సర్పంచ్‌ చంద్రమళ్ల చిన్నారావు, వైస్‌ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, రంది రామకుమారి, కుక్కల సుమతితో పాటు మరో ఇద్దరు సామాజికవేత్తలున్నారు. వారిచ్చేదే తుది జాబితాగా ఎంపిక జరిగిందనే విమర్శలున్నాయి. ఒక్క కొంకుదురులోనే అనర్హులకు ఇన్ని పింఛన్‌లు ఇచ్చారంటే నియోజకవర్గమంతా పరిశీలిస్తే లెక్కా పత్రం ఉండదేమోనంటున్నారు. పింఛన్‌ల బాగోతంపై స్థానికులు, అర్హత ఉండీ పింఛన్‌ రాని వారు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement