టాలీవుడ్‌లో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అర్థనా బిను. 2016లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా నటించింది. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది ఈ మలయాళీ బ్యూటీ. ఆ సినిమా తర్వాత ఇంతవరకు తను ఏ తెలుగు మూవీలో నటించలేదు. కానీ తమిళ్,మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
(ఇదీ చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక)
తాజాగా హీరోయిన్ 'అర్థనా బిను' తన తండ్రి విజయకుమార్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తల్లి విడాకులు తీసుకోవడంతో తండ్రికి దూరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి, నటుడు విజయకుమార్ అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్ చేసింది. తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గందరగోళం చేస్తుంటాడని ఆరోపించింది. తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపింది.
'ఈ రోజు, అతను మా ఇంటి కాంపౌండ్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటికే మేము ఇంటిలోపల నుంచి తలుపు లాక్ చేయడంతో కిటికీ ద్వారా బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలుతో పాటు అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా సినిమాల్లో నటించడం ఆపేయ్ లేదా తను చెప్పిన సినిమాల్లో మాత్రమే నటించాలని షరతులు పెడుతున్నాడు. నాతో ఉండే నటల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరకు మా అమ్మ పనిచేసే ప్రదేశంతో పాటు సోదరి చదువుకునే విద్యా సంస్థ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించినందుకు అతనిపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇప్పుడు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు.' అని తెలిపింది.
(ఇదీ చదవండి: స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్)
తనను సినిమాలు చేయకుండా, నటించకుండా ఆపాలని తండ్రి విజయకుమార్ తనపై కూడా కేసు పెట్టాడని అర్థనా పేర్కొంది. 'నేను నా ఇష్టానికి మాత్రమే సినిమాల్లో నటిస్తున్నాను. మూవీలో నటించడం నా అభిరుచి, నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉంటాను. సినిమాల్లో నటించకుండా ఆపాలని నాపై కేసు పెట్టాడు. నేను షైలాక్‌లో నటించినప్పుడు కూడా, అతను లీగల్‌గా కేసు పెట్టాడు. ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా సొంత ఇష్టానుసారం సినిమాలో నటించానని అధికారిక చట్టపరమైన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. అని వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment