పన్ను ‘పోటు’పై నిరసన జ్వాల | ysrcp dharna tax issue | Sakshi
Sakshi News home page

పన్ను ‘పోటు’పై నిరసన జ్వాల

Published Mon, Mar 13 2017 11:49 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

పన్ను ‘పోటు’పై నిరసన జ్వాల - Sakshi

పన్ను ‘పోటు’పై నిరసన జ్వాల

- వైఎస్సార్‌సీపీ పిలుపునకు అనూహ్య స్పందన
- జనం స్వచ్ఛంద మద్ధతు
సాక్షిప్రతినిధి, కాకినాడ : అశాస్త్రీయంగా పెంచిన ఇంటి పన్నులపై జనం నిరసన గళం వినిపించారు. జిల్లా అంతటా ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలంటూ నినదించారు. మండల పరిషత్, తహసీల్థార్‌ కార్యాలయాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోకు దిగారు. కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్‌సీపీ నేతలను బలవంతంగా జీపుల్లో ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. రూ.200 ఉన్న ఇంటి పన్నును ఒకేసారి ఏకపక్షంగా చంద్రబాబు సర్కార్‌ రూ.1500 పెంచేయడంతో జనం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రధాన ప్రతిపక్షం  వైఎస్సార్‌సీపీ తన వంతు బాధ్యతగా ప్రజల గొంతుకను వినిపించింది. పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు కురసాల కన్నబాబు ఇటీవల అయినవిల్లిలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఇచ్చిన పిలుపునందుకు పార్టీ శ్రేణులు జిల్లా అంతటా ఆందోళన పథం పట్టాయి. జిల్లా కేంద్రం కాకినాడ సహా కోనసీమతో పాటు మెట్ట, ఏజెన్సీ ప్రాంత మండలాల్లో కూడా గిరిజనులు అనూహ్యసంగా స్పందించారు.
  • పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్, కరప మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెంచిన పన్నులు కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదని కన్నబాబు ధ్వజమెత్తారు. అనంతరం ఎంపీడీవో సీహెచ్‌కె విశ్వనాథ రెడ్డికి సిటీ కో ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్, నగర కన్వీనర్‌ రాగిరెడ్డి ఫ్రూటీకుమార్, ప్రచార సెల్‌ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు వినతి పత్రం అందజేశారు. 
  • కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు ఆధ్వర్యంలో పిఠాపురం తహసీల్దార్‌ కార్యాలయం, గొల్లప్రోలు నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వినతిపత్రం ఇచ్చేందుకు గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులు ముఖం చాటేయడంపై 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్‌ఐ శివకృష్ణ ఆందోళన చేస్తున్న నేతలపై దురుసుగా ప్రవర్తించి రాస్తారోకో విరమించకుంటే అరెస్టు చేస్తామంటూ దొరబాబు, కొప్పనను బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించగా కొంతసేపు కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.అనంతరం దొరబాబు, కొప్పనలను పోలీసులు జీపులో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
  • అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్‌సెల్‌లో ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉప్పలగుప్తంలో రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు, అల్లవరంలో బొమ్ము ఇజ్రాయిలు ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు.
  • రాజానగరం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి  విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇంటి పన్నులను పెంచడమే కాకుండా, పేదలకు ఇచ్చే పింఛన్ల నుంచి సొమ్ములు మినహాయించుకోవడంపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
  • అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన పన్నులు వెంటనే రద్దు చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని  ఎంపీడీఒ సిహెచ్‌వీఎఆర్‌ సుబ్రహ్మణ్యానికి అందజేశారు.
  • కోఆర్డినేటర్‌ పర్వత ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం  స్థానిక బాలాజీచౌక్, మండల పరిషత్‌ కార్యాలయాల ఎదుట పార్టీ కోఆర్డినేటర్‌ పర్వత  ప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీయెత్తున తరలివచ్చి సుమారు గంట సేపు ధర్నా నిర్వహించారు.  వద్ద ప్రధానర హదారిపై ధర్నా నిర్వహించారు.
  • రాజమండ్రిరూరల్, కడియం తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్, ఎండీవోలకు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ వెలుగుబంట్ల అచ్యుతరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 
  • ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో తహసీల్ధార్‌ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. స్థానిక శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జీఎన్‌టీ రోడ్డు మీదుగా తహసీల్ధార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపు తహసీల్ధార్‌ కార్యాలయం సెంటర్‌లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 
  • పెద్దాపురం ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల వద్ద కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, డిఎల్‌పీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రం అందజేసారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పన్నుల పెంపుకు నిరసనగా «దర్నా నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్‌ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. 
  • పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద జరిగిన ధర్నాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. అయినవిల్లి, అంబాజీపేటలలో జరిగిన ధర్నాలో పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు పాల్గొన్నారు.
  • పెంచిన ఇంటిపన్నులను ఉప సంహరించాలని డిమాండ్‌ చేస్తూ రామచంద్రపురం పార్టీ పట్టణ, మండల కన్వీనర్‌లు గాధంశెట్టి శ్రీధర్, పంతగడ ప్రసాద్‌ తదితరులు నేతృత్వంలో ఆర్డీవో కె సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు.మండల కేంద్రమైన కె.గంగవరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్‌ ధర్నా నిర్వహించిన ఎంపీడీఓ శాస్త్రీకి వినతి పత్రం అందించారు.
  • మండపేటలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ తదితరులు ధర్నా నిర్వహించగా, కపిలేశ్వరపురం ఎంపీడీవో కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ లీలాకృష్ణ ధర్నా నిర్వహించారు. మండపేట ఎండీవో కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రాయవరం మండల పరిషత కార్యాలయం వద్ద  పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు.
  • రంపచోడవరం నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లోను వైఎస్సార్‌సీపీ మండలపార్టీ నాయకులు ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానిక గిరిజనులు ఆందోళనలు నిర్వహించారు.  కో–ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎండీవో కార్యాలయం, గోకవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు.రాజోలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ముమ్మిడివరం తహసీల్దార్‌ కార్యాలయం, ఐ.పోలవరం ఎంపీడీఒ కార్యాలయాల వద్ద స్థానిక నేతలు, కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. 
గతంలో రూ.100, రూ.200 ఉన్న ఇంటి పన్ను రూ.1000 నుంచి రూ.1500 పెంచేశారు. పన్ను కట్టకపోతే విద్యుత్‌ కనెక‌్షన్‌ ఆపేస్తామని, రేషన్‌కార్డులు తొలగిస్తామని బెదిరిస్తున్నారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పే నాధుడే లేడు. ఇంటి పన్నులు ఏవిధంగా అంచనా వేసి పెంచారని చెప్పే అధికారి లేడు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలుంటాయి. వాటిని కాలరాస్తూ చంద్రబాబు సర్కార్‌ నేరుగా ఉత్తర్వులు ఇచ్చి ఇంటి పన్నులు పెంచేయడం ఏవిధంగా సబబో చెప్పాలి. ఒక పక్క ఇంటి పన్నులు పెంచేసి నీటి పన్ను పెంచుతున్నట్టుగా చెప్పారు. ఒక ఇంటికి అయినా కొళాయి ఇచ్చారా. ఏ గ్రామంలో అయినా లైబ్రరీలు పనిచేస్తున్నాయా. ఉన్న చోట పత్రికలు, పుస్తకాలు లేవు. కానీ లైబ్రరీ పన్ను వేశారు. ఏగ్రామంలో కూడా డ్రైనేజీలు లేవు. అయినా డ్రైనేజీ పన్ను విధించారు. వీధి దీపాల పన్ను అంటూ వీధిదీపాల పన్నులు అంటూ ఇష్టానుసారంగా పెంచేశారు. చంద్రబాబు సర్కార్‌ ఒక్క జుట్టుపై తప్ప అన్నింటిపైనా పన్నులు వేసినట్టు కనిపిస్తోంది.
కురసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement