కామినేనీ ... కానరాలేదా...
Published Thu, Jul 13 2017 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
నవమాసాలు పెంచి ...
పురుటి నొప్పులు భరించి
జన్మనిచ్చిన ఆ బిడ్డ కన్నుమూస్తే ...
ఆ కన్నతల్లికి ఏదీ ఊరడింపు...?
.
తొమ్మిది నెలలు
అమ్మ గర్భంతో అనుబంధం పెంచుకొని
పేగు తెంచుకొని బాహ్య ప్రపంచంలోకి
బయటపడిన రోజుల్లోనే ... అమ్మ ఒడి చవిచూడకుండానే...
ఆ తల్లి కన్నుమూస్తే...
ఆ బిడ్డకు రక్షణేదీ...?
.
పౌష్టికాహారలోపం...
వాతావరణ కాలుష్యం...
దోమల స్తైర విహారం...
రక్త హీనత ... కారణాలేమైతేనేం
అనుబంధాలు...ఆత్మీయతలు
అంతలోనే అదృశ్యమైతే
ఆ పాపం ఎవరిదీ...?
ప్రశ్నిస్తోంది గిరిజనం
.
పాలకుల పరామర్శల సాక్షిగా
చావులు నిజం...
ముసురుతున్న దోమల సాక్షిగా
మలేరియా లేదట...!
లెక్కలు పక్కాగా చెబుతున్నా...
పక్కతోవ పట్టించే యత్నం...
ఇదేమి విచిత్రం...
Advertisement
Advertisement