- మన్యంలో ఆగని కాళ్లవాపు మరణాలు
- ఈ నెలలో మరో ఇద్దరు మృతి
- రక్షించాలని గిరి పుత్రుల వేడుకోలు
బాబూ..మావైపు చూడండయ్యా
Published Fri, Nov 18 2016 9:30 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
గిరి పుత్రులను అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధి కబళిస్తున్నా దాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో ఆగస్టు నెలలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి ఇప్పటి వరకూ 12 మందిని బలితీసుకుంది. వ్యాధి ప్రారంభంలో నాటు సారా తాగడం, పౌష్టికాహార లోపం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మృతు ల్లో విద్యార్థులుండడం, వరుసగా మరణా లు సంభవిస్తుండడంతో వ్యాధి మూలాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 100 మంది బాధితులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేశారు. చికిత్స సమయంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి విశాఖలో పరీక్షలు నిర్వహించినా ఇప్పటికీ వ్యాధిని నిర్ధారించలేదు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి కాళ్లవాపు వ్యాధిని అరికడతామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. చింతూరు ఏరియా వైద్యశాలలో ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తామన్న హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లవాపు మరణాలు ప్రారంభమైన నాలుగునెలల్లో నాలు గు సార్లు జిల్లా పర్యటనకు వచ్చినా మృతు ల కుటుంబాలు, బాధితులను కనీసం పరామర్శించకపోవడం గమనార్హం.
సర్వే ఫలితాలు శూన్యం
కాళ్లవాపు మరణాలు సంభవించిన తర్వాత ఏజెన్సీలో ఇంటింట సర్వే చేసి వ్యాధి పీడితులను గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే ద్వారా సాధించింది శూన్యమని ఈ నెల 4, 5 తేదీల్లో చింతూరు మండలం పాలగూడెంకు చెందిన పొడియం మల్లమ్య(45), మామిళ్లగూడెంకు చెందిన మచ్చిక లక్ష్మయ్య(55) మృతి చెందడంతో తేలిపోయింది. ఇప్పటి వరకూ వీఆర్‌పురం మండలంలో 8 మంది, చింతూరులో ముగ్గురు, కూనవరంలో ఒకరు మృతి చెందారు. ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు రేష¯ŒS దుకాణాల ద్వారా ఉచితంగా పాలు, ఇతర సరుకులు పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ హామీ ఇచ్చినా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
Advertisement
Advertisement