
టాలీవుడ్‌లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్‌గా స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు యూత్‌లో ఫుల్ క్రేజ్. అయితే తన మేనేజర్ చేతిలో సుమారు రూ.80 లక్షల వరకు మోసపోయిందని, దీంతో అతన్ని తొలగించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రష్మిక ఈ విషయంపై తొలిసారి స్పందించింది. తాము విడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం నిజమేనని తెలిపింది.
(ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్)
కానీ ఈ నిర్ణయం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. తామిద్దరూ ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశామని చెప్పుకొచ్చింది. పరస్పర ఒప్పందంతో విడిగా తమ కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రొఫెషనల్‌గా వ్యవహరించే పనిలో ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి ఇంతవరకు వర్క్ చేశామని పేర్కొంది. ఇప్పుడు కూడా అంతే హుందాగా తామిద్దరం విడిగా పనిచేయాలని అనుకుంటున్నట్లు రష్మికతో పాటు ఆమె మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.
(ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)
Comments
Please login to add a commentAdd a comment