- రబ్బర్ సీళ్ల తొలగింపుతో నీటి వృథా
- సబ్‌కలెక్టర్‌కు తెలిపిన ఇరిగేషన్ అధికారులు
- సీడ్ వేటపై వీడియో చూపిన మత్స ్యకార నాయకులు
రొయ్య సీడ్ వివాదంపై బ్యారేజీ పరిశీలన
Published Thu, Nov 3 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
ధవళేశ్వరం :
కాట¯ŒS బ్యారేజీ దిగువ రొయ్య సీడ్ వేట కోసం రబ్బర్ సీళ్లను మత్స ్యకారులు తొలగిస్తున్నారనే ఆరోపణలతో అక్కడ సీడ్ వేటను నిషేధించారు. దాంతో ఉపాధి కోల్పోతున్నామంటూ మత్స ్యకారులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో గురువారం సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణ¯ŒS, ఇరిగేష¯ŒS హెడ్‌వర్క్స్ ఈఈ ఎ¯ŒSవీ కృష్ణారావు, మత్స్యశాఖ ఏడీ రామతీర్థలతో కూడిన అధికారుల బృందం కాట¯ŒS బ్యారేజీని పరిశీలించింది. రొయ్యసీడ్ వేటవల్ల కలిగే నష్టాలను ఇరిగేష¯ŒS అధికారులను అడిగి బృంద సభ్యులు తెలుసుకున్నారు. బ్యారేజ్ రబ్బరు సీళ్ళు తొలగించడంతో నీరు వృథాగా దిగువకు వెళుతోందని, దాంతో రబీలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇరిగేష¯ŒS అధికారులు తెలిపారు. మత్స్యకార సంఘ సొసైటీ అధ్యక్షుడు కరుకు ఇమ్మానియేల్ తాము ఏ విధంగా వేట కొనసాగిస్తున్నదీ వీడియోను సబ్‌కలెక్టర్‌కు చూపించారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తలారి మూర్తి, ఇరిగేష¯ŒS డీఈ శ్రీనివాస్, ఏఈ సాయిరాం, తహసీల్దార్ జి.భీమారావు, సీఐ ఎం. కృపానందం, పంచాయతీ కార్యదర్శి టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement