సాక్షి, బెంగళూరు: దేశంలో మానసిక వ్యాధుల సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉధృతమయ్యేలా కనిపిస్తోందనీ, 2022కల్లా మానసిక రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలను పూర్తిస్థాయిలో నెలకొల్పాల్సి ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆరోగ్య సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కృషి చేయాలనికోరారు. మధుమేహం బాధితుల కంటే మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మరో కార్యక్రమంలో కోవింద్ మాట్లాడుతూ ఉద్యోగాలు సంపాదించేందుకు మాత్రమే చదువు అనుకోవడం మంచిది కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment