జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి సిబ్బం ది కృషి చేయాలని సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డిసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు నిరుద్యోగులకు ఎం తో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి సిబ్బం ది కృషి చేయాలని సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డిసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు నిరుద్యోగులకు ఎం తో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. టీఎ న్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గ్రంథాలయాల పాత్ర కీలకమైందన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా కె.యాదయ్య, కార్యదర్శిగా కె.రామాంజనేయులు, కోశాధికారిగా కె.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా కళాధరశర్మ, అసోసియేట్ అధ్యక్షుడిగా పరందాము లు, ఉపాధ్యక్షులుగా సుబ్బయ్య, సయ్యద్‌మైనోద్దీన్, బి.సత్యనారాయణ, కార్యదర్శిగా జానికిరాములును ఎన్నుకున్నారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డిని గ్రంథాలయ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి కె.రామకృష్ణరావు, రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, లైబ్రేరియన్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.