![MLC Kavitha To Participate In Indian Library Congress In Kerala - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/18/KAVITHA-2.jpg.webp?itok=QV00AsVu)
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. కేరళలోని కన్నూరులో రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు రావాలని ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పంపారు.
జనవరి 2వ తేదీ సాయంత్రం జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3న సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. సమావేశాలను కేరళ సీఎం విజయన్ ప్రారంభించనుండగా, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment