గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ
గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ
Published Thu, Jul 21 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
హుజూర్‌నగర్: పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి పంచాయతీ కార్యదర్శి పిడమర్తి ఇంద్రబాబు, భార్గవ్ మెడికల్స్ పాశం నాగిరెడ్డిలు 10 కుర్చీలను బహూకరించారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో చైర్మన్ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామికి వారు ఈ కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉపాధ్యక్షుడు తేజావత్ సైదానాయక్, ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్‌గౌడ్, కోశా«ధికారి ఊరె వెంకయ్య, కనకారెడ్డి, కిరణ్, శ్రీనివాస్, సురేష్, మధు పాల్గొన్నారు.
Advertisement
Advertisement