chairs
-
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్‌కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్‌కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
కుర్చీలతో వీరంగం చేసిన కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు. చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే.. -
ఈ సభా సాక్షిగా..అయ్యన్న పని అయిపాయె
-
చైర్లతో ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు!!
‘ఖవ్వాలీ’ కార్యక్రమం అంటే మధురమైన పాటలతో మార్మోగుతోంది. సంగీత, గానాలతో గాయకుల జుగల్బందీ శ్రోతులను ఉర్రూతలూగిస్తోంది. కానీ ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో బుధవారం రాత్రి జరిగిన ఖవ్వాలీ కార్యక్రమం యుద్ధరంగాన్ని తలపించింది. కుర్చీల అరెంజ్మెంట్ విషయంలో చిన్నగా మొదలైన గొడవ చినికిచినికి గాలివాన అయింది. దీంతో పలువురు ప్రేక్షకులు కుర్చీలతో కొట్టుకున్నారు. గాల్లోకి పెద్ద ఎత్తున కుర్చీలు లేచాయి. ఇరువర్గాలు కుర్చీలతో కొట్టుకోవడంతో ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. ఖవ్వాలీ కార్యక్రమ ప్రాంగణం రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఖవ్వాలి ప్రాంగణంలో కుర్చీల విషయమై చోటుచేసుకున్న ఈ కుర్చీల యుద్ధం వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. #WATCH People hurled chairs at one another at a Qawwali event in Haridwar last night, after a fight broke out reportedly over seating arrangements. No injuries reported. #Uttarakhand pic.twitter.com/OoOSMF2OhQ — ANI (@ANI) November 19, 2019 -
ఆ కుర్చీలు ఎవరికి!?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనధికార భేటీ సందర్భంగా శుక్రవారం మహాబలిపురంలో పాండవ రథాల ప్రాంగణంలో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూర్చుని కొబ్బరి బోండాలు తాగుతూ సేద తీరిన విషయం గుర్తుంది కదా! వారిద్దరూ కూర్చున్న ఆ కుర్చీలకు ఇప్పుడు భారీ డిమాండ్ వచ్చింది. ఆ ఇరువురు దేశాధినేతలు అక్కడ కాసేపు కూర్చోవాలనేది అకస్మాత్తుగా, ఆ కార్యక్రమానికి రెండు గంటల ముందు తీసుకున్న నిర్ణయం. దాంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు గిండిలోని ఫర్నిచర్ షోరూం వారిని సంప్రదించి ఇద్దరు అగ్రనేతలు వసతిగా కూర్చునేందుకు రెండు టేకు కుర్చీలు, ఒక టీపాయ్, అనువాదకులు కూర్చునేందుకు మరో రెండు కుర్చీలను హుటాహుటిన తెప్పించారు. వాటికి డబ్బులను కూడా తరువాత ఇస్తామని ఆ షోరూం ఓనర్‌కు చెప్పారు. ఇప్పుడు అగ్రనేతలు కూర్చున్న ఆ రెండు కుర్చీల కోసం రాష్ట్ర ప్రజా పనుల శాఖ, కేంద్ర ప్రభుత్వ అధికారులు పోటీ పడుతున్నారు. అగ్రనేతల పర్యటనకు గుర్తుగా వాటిని తమ వద్దే ఉంచుకోవాలని ప్రజాపనుల శాఖ భావిస్తుండ గా, చరిత్రాత్మక భేటీ స్కృతిచిహ్నంగా ఆ ఫర్నిచర్‌ను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. మరోవైపు, ‘ఆ ఫర్నిచర్‌కు డబ్బులు వద్దు.. నాకే తిరిగివ్వండి.. నా దగ్గరే గుర్తుగా పెట్టుకుంటా’ అని ఫర్నిచర్ షోరూం ఓనర్ కోరుతున్నారట. -
డయ్యింగ్ డేంజర్
♦ కాలుష్య కోరల్లో క్షీరపురి ♦ చీరాలలో 45కు పైగా అక్రమ డయ్యింగ్ యూనిట్లు ♦ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులవే ఎక్కువ ♦ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మాట మరిచిన యూనిట్ల యజమానులు ♦ డయ్యింగ్ యూనిట్లకు విద్యుత్ కట్ చేసినా పునరుద్ధరించేలా చేసిన ప్రజాప్రతినిధి ♦ ప్రస్తుతం తూతూ మంత్రంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆయనే ఫిర్యాదు ♦ కిలోమీటర్ల మేర కలుషితమైన భూగర్భ జలాలు ♦ సీజింగ్ ఆదేశాలు బేఖాతరు వస్త్రవ్యాపారంలో చినముంబయిగా పేరొందిన చీరాల కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. తమిళనాడు నుంచితరలివచ్చిన డయ్యింగ్ యూనిట్ల నుంచి కొన్నేళ్లుగా విడుదలవుతున్న రసాయనాలతో భూగర్భ జలాలన్నీ విషతుల్యమయ్యాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆయన అనుచరులే నడిపిస్తున్న ఆ డయ్యింగ్ యూనిట్లతో చీరాల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. చీరాల: చీరాలలో చేనేత పరిశ్రమలు ఉండటంతో నూలుకు రంగులు వేసేందుకు అద్దకం అవసరం. ఇందుకు సహజ సిద్ధమైన చిన్నపాటి రంగుల కార్ఖానాలు ఏర్పాటు చేసి వాటికి అద్దకం వేసేవారు. వీటివల్ల పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చీరాల కేంద్రంగా రెడీమేడ్ వస్త్రాలు, ఇతర ఫ్యాబ్రిక్స్ కూడా తయారు కావడం మొదలైంది. ఇందుకు చీరాల ప్రాంతంలో 65 భారీ క్యాబినెట్ డయ్యింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. నామమాత్రపు అనుమతి కూడా లేకుండా యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని మూతపడగా ప్రస్తుతం 45 ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వస్త్రాలకు చీరాలలో డయ్యింగ్ జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి 45 మంది వ్యాపారులు చీరాలలో డయ్యింగ్ యూనిట్లను అక్రమంగా పెట్టారు. నియోజకవర్గంలోని ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్నాయి. ఇవి రోజూవారి వదిలే విషపూరిత నీరు సుమారు 50 లక్షల లీటర్లకు పైగానే ఉంటుందని అంచనా. తమిళనాడులోని తిరువూరు, సేలం, ఈరోడ్, కంచి, కుంభకోణం, ఆరణి వంటి ప్రాంతాల్లో డయ్యింగ్ యూనిట్లను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. వాటి నుంచి వచ్చే విషపూరితమైన కలుషిత నీరు భూగర్భ జలాల్లో చొరబడి, విషపూరితంగా మార్చిన ఫలితంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో యూనిట్లపై దృష్టి పెట్టింది. కలుషిత నీటిని శుద్ధిచేసే ప్లాంట్లు ఉంటేనే డయ్యింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఖచ్చితమైన నిబంధన విధించింది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలంటే కోట్లతో కూడుకున్న పని. దీంతో చీరాలలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడికి తరలివచ్చాయి. మాట తప్పి...మడం తిప్పి: ఆయన నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి. చట్టం, నిబంధనల గురించి అనునిత్యం వల్లె వేస్తుంటారు. కానీ వాటన్నింటి వెనక జనం బాగోగుల కన్నా స్వప్రయోజనాలను చక్కబెట్టుకునే వ్యూహమే ఉంటుంది. క్షీరపురిని కాలుష్య కోరల్లో నెట్టివేస్తున్న డయ్యింగ్ యూనిట్ల జోలికి అధికారులెవ్వరూ ఎందుకు వెళ్లరంటే వాటి నిర్వాహకులకు సదరు ప్రజాప్రతినిధే పెద్దదిక్కు మరి. కొత్తపేట, దేవాంగపురి, చీరాలనగర్, సాయికాలనీ, కోర్టు రోడ్డులో క్యాబినెట్ డయ్యింగ్లు నడుపుతున్న వారు ఆ ప్రజాప్రతినిధి అనుచరులు. యూనిట్ల నుంచి వచ్చే వృథా నీటిలో దారుణమైన విషవాయువులు కలిసి ఉన్నట్లు 2012లో పరీక్షలు నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) మహేష్‌తో పాటు ఇతర అధికారులు నిర్ధారించారు. ఆ తరువాత అనుమతులు లేవంటూ వాటికి విద్యుత్ శాఖాధికారులు సరఫరా నిలిపేశారు. తమిళనాడు డయ్యింగ్‌లను మూసివేస్తే తన అనుచరులవి కూడా మూతపడతాయనుకుని సదరు ప్రజాప్రతినిధి రంగంలోకి దిగాడు. 2012లో అప్పటి కలెక్టర్ కాంతీలాల్‌దండే సమక్షంలో కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ రూ.5 కోట్లు ఖర్చుతో ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత విద్యుత్ శాఖాధికారులు సరఫరా పునరుద్ధరించేలా చేశారు. కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఇప్పిస్తానని చెప్పిన ఆ ప్రజాప్రతినిధి దాని ఊసే పట్టించుకోలేదు. కాలుష్య కారకాలతో భూగర్భజలాలు విషతుల్యమై పంట పొలాలు సైతం దెబ్బతినడంతో పాటుగా కుందేరులో గడ్డితిని, నీరు తాగిన పశువులు రోజుకు 4 వరకు మరణిస్తున్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాని నుంచి బయటపడేందుకు ఆ ప్రజాప్రతినిధి మళ్లీ వ్యూహం పన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డయ్యింగ్ యూనిట్లను మూసేయాలంటూ ఇటీవల పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుకు నామమాత్రంగా ఫిర్యాదు చేశారు. ఆమేరకు బోర్డు అధికారులు కూడా డయ్యింగ్‌లను తూతూ మంత్రంగా తనిఖీ చేశారు. డయ్యింగ్ యూనిట్ల యజమానులు పొల్యూషన్ బోర్డు అధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయగా ముందు మీ ప్రజాప్రతినిధిని ఒప్పించుకోండని ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత డయ్యింగ్ అక్రమార్కుల్లో కొందరు ప్రజాప్రతినిధిని కలిసి ఓ ఒప్పందానికి వచ్చారని సమాచారం. పొల్యూషన్ బోర్డు అధికారులు విచారించినప్పటికీ అనుమతిలేని ఒక్క డయ్యింగ్ యూనిట్‌ను మూసివేసిన దాఖలాలు లేవు. ఆయన అనుచరుల కోసం కొన్ని క్యాబినెట్ డయ్యింగ్లకు అండగా ఉండటంతో పాటు కేంద్రం నుంచి వచ్చే అనేక సబ్సిడీలు, పథకాలను వర్తింపజేస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సంభవించే ప్రమాదాలివే... ఈ విషపూరితమైన నీరు నేరుగా విడుదల చేయడంతో అవి భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. అలానే కుందేరులో విడుదల కావడంతో ఆ పరిసర ప్రాంతాలతో పాటు సముద్రంలో కలవడం వలన కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావుల్లోకి ఈ కలుషిత నీరు చేరుతోంది. ఈ నీటిని ప్రజలు తాగడం వలన కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో పాటుగా చర్మవ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారు. నీటిలో ఉప్పు శాతం పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతిని జీర్ణకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అలానే బావులు, బోర్లలోని నీళ్లు మందంగా మారుతాయి. వాటిని తాగడం వలన కూడా అనేక వ్యాధుల బారిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోతోంది. దీనివల్ల చేపలు, రొయ్యలతో పాటు సముద్ర జీవులు చనిపోతాయి. నిబంధనలకు నీళ్లు... డయ్యింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం ముందుగా సీఎస్టీ అనుమతిని కాలుష్య నియంత్రణ బోర్డు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ పెట్టే స్థలం అందుకు అనుకూలమైందా, స్థానికులకు ఇబ్బందులకు ఏర్పడతాయా అనేది పరిశీలించాలి. ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించిన అనుమతి తీసుకోవాలి. తప్పకుండా యూనిట్ల నుంచి విడుదలయ్యే కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు ట్రీట్మెంట్ ప్లాంట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ చీరాలలో ఉన్న డయ్యింగ్ యూనిట్లకు ఇటువంటి అనుమతులేమీ లేవు. నేటికీ అడుగుపడని ట్రీట్మెంట్ ప్లాంట్..! గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహేష్, మరికొందరు అధికారులు అనుమతి లేని డయ్యింగ్ యూనిట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్న డయ్యింగ్ యూనిట్ల యజమానులందరూ కలిసి మొత్తం మీద ఒక ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినా నేటికీ పునాదికి నోచుకోలేదు. ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ప్రత్యేకంగా ఒక పైపులైన్‌ను వేసి డయ్యింగ్ యూనిట్ల నుంచి వచ్చే కలుషిత నీటిని ఈ పైపులైన్ ద్వారా ట్రీట్మెంట్ ప్లాంట్‌కు అనుసంధానం చేసేందుకు అంగీకరించినప్పటకీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలంటే రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పిస్తుందని, మిగిలిన మొత్తం డయ్యింగ్ యూనిట్ల యజమానులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే డయ్యింగ్ యూనిట్ల యజమానులు ఇంత పెద్ద మొత్తం పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం నేటికీ మొదలు కాలేదు. పోరాటమే శరణ్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డయ్యిం గ్ యూనిట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో, మామూళ్ల మత్తుతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కాలుష్య భూతం నుంచి విముక్తి కావాలంటే పోరు తప్పేట్లు లేదని ప్రజలంటున్నారు. నిరసన బాట పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. చీరాల విషపూరితమవుతుందిలా... చీరాల ప్రాంతంలో ఉన్న డయ్యింగ్ యూనిట్ల నుంచి రోజుకు 50 లక్షల లీటర్లకు పైగానే వివిధ రసాయనాలు, ఇతర వ్యర్థ పదార్థాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. సుమారు ఒక్కొక్క డయ్యింగ్ యూనిట్లో రోజూ మూడు నుంచి నాలుగు వేల కేజీల వస్త్రాలకు డయ్యింగ్ వేస్తారు. ఒక్కో కేజీ వస్త్రానికి డయ్యింగ్ వేయాలంటే 200 లీటర్లు రసాయనాలతో కూడిన నీటిని వినియోగిస్తారు. ఆ తర్వాత వాటిని నేరుగా కుందేరు లేదా ఆ పక్కనే వదిలేస్తున్నారు. యూనిట్ల నుంచి వచ్చే వ్యథా నీటిలో దారుణమైన విష వాయువులు కలిసి ఉన్నట్లు గతంలోనే పరీక్షలు నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పటి ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) మహేష్‌తో పాటు ఇతర అధికారులు నిర్ధారించారు. టీడీఎస్ (టోటల్ డిజాల్వ్ సాలిడ్) 2100 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా ఏకంగా 40 వేల మిల్లీ గ్రాములు వరకు ఉంది. అలానే సీఓడీ (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్) 250 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా 4 వేల మిల్లీ గ్రాములు ఉన్నాయి. అలానే సస్పెండెడ్ సాలిడ్స్ 100 మిల్లీ గ్రాములు ఉండాల్సి ఉండగా 1800 మిల్లీ గ్రాములు వరకు ఉంది. -
‘జన్మభూమి’లో విద్యార్థులే కూలీలు!
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జన్మభూమి కార్యక్రమం విద్యార్థులకు పెద్ద కష్టాన్నే తచ్చిపెట్టింది. గ్రామ సభకు హాజరయ్యే వారి కోసం విద్యార్థులు కూలీల అవతారమెత్తి కుర్చీలు మోయాల్సి వచ్చింది. ఈ సంఘటన బుధవారం కల్లూరు మండలం గోకులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం జన్మభూమి కార్యక్రమం పాఠశాలలో నిర్వహించకూడదు. వేదిక దొరకకపోవడమో..స్థలాభావమో... కారణమేదయితేనేం.. నోడల్ అధికారి ఏజేసీ రామస్వామి ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మీవరదారెడ్డి అధ్యక్షతన ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభకు హాజరైన ప్రజలకు అవసరమైన కుర్చీలు వేయించలేదు. జనం నిలబడి అధికంగా ఉండటంతో మరికొన్ని కుర్చీలు ఆటోలో తీసుకువచ్చారు. ఆటో వద్ద నుంచి సభ వద్దకు విద్యార్థులతో కుర్చీలను మోయించారు. పిల్లలు బడికి..పెద్దలు పనికి అంటూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి చెప్పే అధికారులే ఇలా విద్యార్థులతో పనిచేయించడం విమర్శలకు తావిచ్చింది. - కల్లూరు -
తమిళనాడులో కేబినెట్ సమావేశం
-
గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ
హుజూర్నగర్: పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి పంచాయతీ కార్యదర్శి పిడమర్తి ఇంద్రబాబు, భార్గవ్ మెడికల్స్ పాశం నాగిరెడ్డిలు 10 కుర్చీలను బహూకరించారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో చైర్మన్ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామికి వారు ఈ కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉపాధ్యక్షుడు తేజావత్ సైదానాయక్, ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్‌గౌడ్, కోశా«ధికారి ఊరె వెంకయ్య, కనకారెడ్డి, కిరణ్, శ్రీనివాస్, సురేష్, మధు పాల్గొన్నారు. -
నమ్మించారు..నగదు, నగలతో పరారయ్యారు
♦ మోసం చేసిన దంపతుల అరెస్టు ♦ గుర్తు తెలియని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దన్న సీఐ రాజిరెడ్డి వేంసూరు : గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చల్లా వాసు-లక్ష్మీతిరుపతమ్మ దంపతులు కుర్చీలు, ఫ్యాన్లు, చాపలు తదితర వస్తువులను వారాల పద్ధతిలో ఇస్తూ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలోనే మండల పరిధిలోని కందుకూరుకు చెందిన నరిశెట్టి లలితమ్మ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానురాలితో వరసలు కలిపి ఆమెను నమ్మించారు. ఈ నెల 6వ తేదీన ఆ దంపతులు సత్తుపల్లిలో పెళ్లికి వెళ్తున్నాం... మా వద్ద పెట్టుకునేందుకు బంగారం లేదు.. మీ బంగారం ఇస్తే పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పి నమ్మించారు. అదీగాక అదే రోజు ఆ ఇంటి యజమానురాలు డబుల్‌కాట్ మంచం కింద దాచిన రూ.70వేలు నగదును గమనించారు. లలితమ్మ ఇంట్లో లేని సమయంలో ఆ డబ్బు చోరీ చేసి పరారయ్యూరు. లలితమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు విషయం వెల్లడైంది. వారి వద్ద నుంచి మూడు గ్రాముల బంగారం, రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ ఇంటి యజమానులు అద్దెకు వచ్చేవారి వివరాలు తెలుసుకోకుండా అద్దెకు ఇస్తే వారు ఎలాంటి వారో కనిపెట్టడం కష్టమన్నారు. కందుకూరు ఘటనలో ఇదే జరిగిందన్నారు. నిందితులను కోర్టుకు రిమాండ్ చేసినట్టు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సీట్ల కోసం కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో సీట్ల కోసం నేతలు పంచాయితీకి దిగారు. ముందు వరుసలో సీటెందుకు కేటాయించలేదని ఒకరు, తనను వేదికపైకి ఆహ్వానించలేదని మరొకరు వాగ్వాదానికి దిగారు. నిరసన వ్యక్తం చేశారు. ఆరంభంలోనే రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తన సీటు కోసం దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్యతో గొడవకు దిగారు. వేదికపైకి ఆహ్వానించడంతో వెళ్లిన వీహెచ్‌ను రెండో వరుసలో కూర్చోవాలని అక్కడున్న కొందరు నేతలు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ముందు వరుసలో సీటెందుకు కేటాయించ లేదని పొన్నాలతో వాదించారు. ‘గొడవ చేయొద్దు. ఎక్కడో ఒకచోట కూర్చోండి. ప్రతిదానికి గొడవెందుకు?’ అని దిగ్విజయ్ వారించారు. అయినప్పటికీ దిగ్విజయ్తోనూ వీహెచ్ వాగ్వాదానికి దిగారు. సీనియర్లకు విలువ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తంచేశారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తనకు కనీసం ఆహ్వానమైనా పంపలేదని మండిపడ్డారు. టీపీసీసీ తీరుపై వేదిక కింద కూర్చొని ఆమె నిరసన తెలిపారు. పొన్నాల రేణుక వద్దకొచ్చి సమాచార లోపం వల్లే అలా జరిగిందని వివరణ ఇచ్చారు. ఏర్పాట్లు ఘోరం...! సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఏర్పాట్లలో జిల్లా పార్టీ ఘోరంగా విఫలమైంది. కార్యకర్తలకు కనీసం తాగునీరు సరఫరా చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాయకులకు, కార్యకర్తలకు నిర్వాహకులకు భోజన, వసతి ఏర్పాట్లు చేయలేదు. వందలాది మంది కార్యకర్తలకు భోజనం అందలేదు. సమీప పరిసరాల్లో ఎక్కడా హోటళ్లు కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించారు. వీరిలో కొందరు షుగర్ రోగులుండడంతో నిర్వాహకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రముఖులకూ భోజనం అందలేదు. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, బలరాం నాయక్సహా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం భోజనం దొరకక ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలకు వసతి లేదు. దీంతో వందలాది మంది కార్యకర్తలు చేసేదేమీ లేక పార్టీ నేతలను తిట్టుకుంటూ తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. -
ఇల్లే హరివిల్లు
గృహానికి ఎల్ఈడీ లైట్ల వెలుగులు ఆకాశంలో విరిసే ఇంద్రధనుస్సు మీ ఇంట్లోనే ఉంటే.. అంతకు మించి ఆనందం, ఆహ్లాదం ఇంకేముంటుంది? సప్తవర్ణ కాంతులీనుతూ గృహం ఔరా! అని విస్తుపోయేలా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటిని ఎల్ఈడీ లైట్ల కాంతులు విరజిమ్మేలా నిర్మించుకోవడం ఓ ఫ్యాషన్. అవును.. ఇల్లంతా పరచుకున్న వె లుతురులో.. ఫర్నిచర్ లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఫర్నిచర్ వెలుగులు పంచితే ఎలా ఉంటుందో ఊహించండి. చీకట్లో ఆ సామగ్రి వెలుగులు అద్భుతం అనిపిస్తుంది.రాత్రయిందంటే చాలు మీ ఇంటిని ఇంద్రధనుస్సు పరచుకున్నట్లు రంగులమయం చేసుకోవచ్చు. ఎల్ఈడీ లైట్లతో మిరుమిట్లు గొలిపే ఫర్నిచర్ ఇప్పుడు మార్కెట్లో వెలిగిపోతోంది. ఎల్ఈడీ సొగసులు అద్దుకున్న హంసతూలికా తల్పం మీ పడక గదిలో కనువిందు చేస్తుంది. లివింగ్ హాల్లో ఉన్న సోఫాసెట్ సంధ్యాకాంతులు పంచుతుంది. అంతేనా మెరిసే టైల్స్ నింగిలో మెరిసే తారకలను భువికి దించుతాయి. ఒకప్పుడు పండుగలు, పబ్బాలాకే ఇంటిని రంగు రంగుల బల్బులతో అలంకరించుకునే వారు. అలా చిన్న చిన్న బల్బులకే పరిమితమైన ఈ రంగుల కాంతులను ఇప్పుడు సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, మంచం, మెట్లు, ప్లేట్లూ, గ్లాసులు, గిన్నెలు ఇలా అన్నింటిలో చొప్పించేస్తున్నారు డిజైనర్లు. ఫర్నిచర్ చాలావరకు పారదర్శకంగా ఉండే గట్టి ప్లాస్టిక్‌తో చేసినవే కాబట్టి వాటి లోపల రీచార్జబుల్ బ్యాటరీలతో వెలిగే ఎల్ఈడీ లైట్లను అమరుస్తారు. రకరకాల డిజైన్లు ప్రకాశవంతమైన రంగులతో పగటిపూట ఒక రకంగా రాత్రి పూట మరో రకంగా వెలుగులు విరజిమ్మటమే ఈ లైట్ల ప్రత్యేకత. ఇలాంటి ఎల్ఈడీ లైట్లు ఉంటే ప్రతి రోజూ పండగే. ఇంట్లో జరిగే శుభాకార్యాలకు ప్రత్యేకమైన ఏర్పాట్ల అవసరం ఉండదు. మూడ్‌కు తగ్గ కలర్స్ కలర్స్ మన మూడ్‌ని మారుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు నిపుణులు. తెలుపు రంగు మెదడును ఉత్తేజపరుస్తుంది. నీలం ప్రశాంతతను ఇస్తుంది. ఇలా ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత. ఫర్నిచర్లో వినియోగించే రంగులు కేవలం అందం కోసమే కాదు మన మూడ్‌కు తగ్గట్టు రిమోట్ సహాయంతో కలర్స్‌ని మార్చుకునే సౌలభ్యం కూడా కల్పించాయి వాటి కంపెనీలు.ఇక గచ్చుకు ఎల్ఈడీలను అమర్చేటప్పుడే కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లు లైట్లను అమరుస్తారు. నచ్చిన కలర్‌ను ఎంచుకుని ఆనందం పొందవచ్చు. మెట్ల విషయానికి వస్తే గట్టి గాజుతో చేసిన టైల్స్, వాటి అడుగున ఎల్ఈడీ లైట్లను అమరుస్తారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. మనం వేసే అడుగులను బట్టి లైట్స్ కూడా అంతే లయబద్ధంగా రంగులు పంచుతాయి. అడుగు తీయగానే వెలుగులు ఆగిపోతాయి. సోలార్ వెలుగులు ఇంటి ఆవరణలో సోలార్ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవడమే కాకుండా ఇంటిని రంగులతో నింపేయొచ్చు. వీటిలో సెన్సర్ల సాయంతో పనిచేసేవి కూడా ఉన్నాయి. చీకట్లో మనం ఆ చుట్టుపక్కలకు రాగానే వాటంతట అవే వెలిగి దారి చూపిస్తాయివి. ఆరు బయట పెట్టే పూల కుండీలు, టైల్స్‌లో అమర్చిన లైట్లు పగలు సూర్యకాంతిని గ్రహించి రాత్రి పూట వెలుగులు పంచుతాయి. బాత్‌టబ్‌లు, ప్యాన్లు.. ఇలా ఒక్కటేమిటి ఇంట్లోని ప్రతి వస్తువులకు ఎల్ఈడీ లైట్లను అమరుస్తున్నారు డిజైనర్లు. మీ రిక్వైర్మెంట్ను బట్టి చార్జెస్ ఉంటాయి. ఈ వెలుగులు మీకు కావాలంటే జంట నగరాల్లోని లెడ్ లైట్స్ షోరూమ్స్ని లేదా ఇంటీరియర్ డిజైనర్స్‌ని సంప్రదిస్తే మీ గృహసీమని రంగులమయం చేసుకోవచ్చు. చీకటికి వన్నెలద్దుతున్న ఈ కొత్త ట్రెండ్ భలేగా ఉంది కదూ. ..:: విజయారెడ్డి ఫర్నిచర్లో ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్‌గా మారింది. వీటిని అమర్చుకోవడానికి చదరపు అడుగుకు కనీసం 1200 రూపాయలు ఖర్చవుతుంది. విద్యుత్ గురించి భయపడాల్సిన పని లేదు. కరెంట్‌ను ఆదా చేసే చాలా రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఒక్కసారి ఖర్చు చేస్తే చాలు జీవితాంతం మన్నికగా ఉంటాయి. - మాధురి, ఇంటీరియర్ డిజై నర్, లకోటియా ఇన్స్టిట్యూట్ -
చైర్మన్ కుర్చీ’ రూ.50 లక్షలు?!
ఓ భూ కబ్జాదారుడికి టీడీపీ అమ్మేసిందని ఆరోపణలు తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకే బేరసారాలు కదిరి, న్యూస్‌లైన్ : ఎన్నికలంటేనే.. అనేక జిమ్మిక్కులుంటాయి. అందులో ‘కుర్చీలు’ కొనడం కూడా పరిపాటి. కదిరి మునిసిపాలిటీలో ఇదే జరిగిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని పట్టణంలో అక్రమార్జన పరుడైన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి రూ.50 లక్షలకు అమ్మేశారని తెలుస్తోంది. టీడీపీ నాయకులు ఈ అమ్మకానికి సూత్రధారులన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలో అక్రమ లే అవుట్లు వేసి పట్టణ ప్రజలను నిలువునా ముంచుతున్న సదరు వ్యక్తి.. తాను కౌన్సిల్లో అడుగు పెడితే.. తన ప్లాట్ల వ్యాపారానికి అడ్డూ అదుపూ ఉండదని, మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరింపజేసుకోవచ్చన్న ఆలోచనతోనే ‘చైర్మన్ కుర్చీ’ తమకే దక్కేలా టీడీపీ నేతలతో ఒప్పందం కుదుర్చుకుని కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ఈయన తన భార్యను 8వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దింపారని, ఆమెను చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టేందుకే బేరసారాలు ఆడినట్లు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. సీపీఐ కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్య యాదవ్ సైతం ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ఆరోపించడం బలం చేకూరుస్తోంది. ‘ఆమె గెలిస్తే..ఈయన మున్సిపాలిటీని అమ్మేస్తాడు’ అందుకే ‘ఫ్యాను’కు ఓటేసి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రుణం తీర్చుకుందామంటున్నారని విన్నవారు చెబుతున్నారు. 33వ వార్డులో సైతం టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారంలో ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. పూర్వాశ్రమంలో ఆయన లాటరీ టికెట్లు అమ్ముతుండేవాడు. అప్పట్లో పోలీసులకు పట్టుబడి కోర్టుకు హాజరైన సంఘటనలెన్నో ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్‌లో కేసు నమోైదె తే కోర్టులో జరిమానా చెల్లించి వచ్చాడు. దీంతో ప్రచారంలో అవస్థలు పడుతున్నానని తన మిత్రులతో వాపోయినట్లు సమాచారం. కుటాగుళ్లలో 1 వార్డు టికెట్ ఆఖరు దాకా తనకే వస్తుందని ఆశపడిన నాగరాజుకు కాదని, డబ్బున్న మరో వ్యక్తికి ఇచ్చారని ప్రజలు చెబుతున్నారు. వేమయ్య యాదవ్ సైతం ఆరోపించాడు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను వెంటాడుతోంది. ప్రచారంలో ఓటర్ల నుంచి చేదు అనుభవాన్ని వారు చవి చూస్తున్నారు. -
గ్రీవెన్సలో గోస
గ్రీవెన్సలో గోస సౌకర్యాలు లేక ఫిర్యాదుదారుల అవస్థలు ఖమ్మం కలెక్టరేట్, : కలెక్టరేట్లో సోమవారం నిర్వహిం చిన గ్రీవెన్సకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడాల్సి వచ్చింది. ఉదయం 8 గంట లకు కలెక్టరేట్‌కు చేరుకున్న బాధితులు పేరు నమోదు కోసం 10 గంటల వరకు వేచి ఉన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఆవరణలో క్యూలో నిల్చున్నారు. భద్రాచలం, ఇల్లెందు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు క్యూలో నిల్చొలేక, కుర్చీలు లేక కలెక్టరేట్లోని పార్కులో కొద్ది సేపు సేదతీరారు. ఫిర్యాదుదారులు మంచినీరు, మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు వినతులు రాయరాక, సహాయకులు లేక అవస్థ పడ్డారు. కుర్చీలు లేక పోవడంతో వృద్ధులు సైతం వరండాలో కిందనే కూర్చుకున్నారు. చంటి బిడ్డలతో వచ్చిన వారు, వికలాంగులు మరింత ఇబ్బందిపడ్డారు.