
‘ఖవ్వాలీ’ కార్యక్రమం అంటే మధురమైన పాటలతో మార్మోగుతోంది. సంగీత, గానాలతో గాయకుల జుగల్బందీ శ్రోతులను ఉర్రూతలూగిస్తోంది. కానీ ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో బుధవారం రాత్రి జరిగిన ఖవ్వాలీ కార్యక్రమం యుద్ధరంగాన్ని తలపించింది. కుర్చీల అరెంజ్‌మెంట్ విషయంలో చిన్నగా మొదలైన గొడవ చినికిచినికి గాలివాన అయింది. దీంతో పలువురు ప్రేక్షకులు కుర్చీలతో కొట్టుకున్నారు. గాల్లోకి పెద్ద ఎత్తున కుర్చీలు లేచాయి. ఇరువర్గాలు కుర్చీలతో కొట్టుకోవడంతో ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. ఖవ్వాలీ కార్యక్రమ ప్రాంగణం రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఖవ్వాలి ప్రాంగణంలో కుర్చీల విషయమై చోటుచేసుకున్న ఈ కుర్చీల యుద్ధం వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH People hurled chairs at one another at a Qawwali event in Haridwar last night, after a fight broke out reportedly over seating arrangements. No injuries reported. #Uttarakhand pic.twitter.com/OoOSMF2OhQ
— ANI (@ANI) November 19, 2019