ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు.
చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్.
ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023
ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే..
Comments
Please login to add a commentAdd a comment