బెంగళూరు: ప్రతిపక్ష పార్టీలంటే ప్రధాని మోదీకి భయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నేడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీయే సమావేశానికి 38 పార్టీలు వస్తున్నాయని అంటున్నారు.. కానీ అవి రిజష్టర్ అయినవేనా? అని బీజేపీని ఎద్దేవా చేశారు. నేడు బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన ఖర్గే.. మాహాకూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అనే పేరు సూచించామని తెలిపారు.
#WATCH | Our alliance will be called Indian National Developmental Inclusive Alliance: Congress President Mallikarjun Kharge in Bengaluru pic.twitter.com/pI66UoaOCc
— ANI (@ANI) July 18, 2023
ప్రతిపక్ష పార్టీల కూటమిని సమన్వయ పరచడానికి 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఖర్గే వెల్లడించారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ముంబైలో తదుపరి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. పాట్నాలో జరిగిన సమావేశానికి 16 పార్టీలు వస్తే నేడు బెంగళూరు భేటీకి 26 వచ్చాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలున్నా వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించామని తెలిపారు.
ఇదీ చదవండి: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment