once again
-
'ఆ పార్టీలు రిజిష్టర్ అయినవేనా..?' విపక్షాల భేటీ అనంతరం ఖర్గే కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: ప్రతిపక్ష పార్టీలంటే ప్రధాని మోదీకి భయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నేడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీయే సమావేశానికి 38 పార్టీలు వస్తున్నాయని అంటున్నారు.. కానీ అవి రిజష్టర్ అయినవేనా? అని బీజేపీని ఎద్దేవా చేశారు. నేడు బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన ఖర్గే.. మాహాకూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అనే పేరు సూచించామని తెలిపారు. #WATCH | Our alliance will be called Indian National Developmental Inclusive Alliance: Congress President Mallikarjun Kharge in Bengaluru pic.twitter.com/pI66UoaOCc — ANI (@ANI) July 18, 2023 ప్రతిపక్ష పార్టీల కూటమిని సమన్వయ పరచడానికి 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఖర్గే వెల్లడించారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ముంబైలో తదుపరి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. పాట్నాలో జరిగిన సమావేశానికి 16 పార్టీలు వస్తే నేడు బెంగళూరు భేటీకి 26 వచ్చాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలున్నా వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇదీ చదవండి: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే.. -
తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి..?
-
మరోసారి బయటపడ్డ టీడీపీ నీచ రాజకీయం..
-
మరోసారి కృష్ణమ్మ వరదలు
-
ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ మోరిసన్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ సంకీర్ణం అనూహ్య ఫలితాలు సాధించింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుపు ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం జరిగిన ఎన్నికల్లో సుమారు 1.60 కోట్ల మంది ఓటేశారు. అయితే, 9 గెలాక్సీ ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ కూటమి మొత్తం 151 సీట్లలో 82 స్థానాలు గెలుచుకుంటుందని వచ్చింది. కానీ, ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను బట్టి అధికార పార్టీ 74 స్థానాలను కైవసం చేసుకోగా, మోరిసన్ మళ్లీ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీసం 76 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే, 65 స్థానాలు మాత్రమే గెలుచుకున్న లేబర్ పార్టీ ఓటమిని అంగీకరించింది. -
మలేసియా ప్రధానిగా మరోసారి మహతీర్
కౌలాలంపూర్: మలేసియా ప్రధానమంత్రిగా మహతీర్ బిన్ మహమ్మద్(92) మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇంతపెద్ద వయస్సులో ఎన్నికైన నేతగా రికార్డు సృష్టించారు. మద్దతుదారుల సంబరాల మధ్య మహతీర్ మహమ్మద్ గురువారం రాజధానిలోని ఇస్తానా నెగర ప్రాసాదంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మలేసియాకు స్వాతంత్య్రం వచ్చిన 1957 నుంచి అధికారంలో ఉన్న బరిసాన్ నేషనల్(బీఎన్) సంకీర్ణానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గట్టి షాకిచ్చారు. మొత్తం 222 సీట్లున్న పార్లమెంట్లో ప్రతిపక్ష ‘పకటన్ హరపన్’ కూటమికి 113 సీట్లు రాగా బీఎన్ కూటమి 79 సీట్లు గెలుచుకుంది. మహతీర్ మహమ్మద్ బీఎన్ కూటమి చైర్మన్‌గా ఉన్న సమయంలో 1981–2003 వరకు 22 ఏళ్లపాటు ఏకధాటిగా ప్రధానిగా పనిచేశారు. -
ఫాతిమా విద్యార్థులకు మరోసారి నిరాశ
-
మరోసారి సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు
-
రజనీ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ
-
నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై మరోసారి చర్చ
-
ఒంగోలులో మరో బైకు దహనం
ఒంగోలు క్రైం: నగరంలోని బలరాం కాలనీలో శనివారం అర్ధరాత్రి దుండగులు మరో బైకును దహనం చేశారు. స్థానికంగా మెకానిక్‌గా పనిచేసే కరీముల్లా సాయంత్రం షెడ్డు మూసి తన మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు తన వాహనాన్ని పార్క్ చేశాడు. అర్ధరాత్రి ఇంటి ముందు మంటలు రావటంతో పరిసర ప్రాంతాలవారు గమనించి అదుపు చేశారు. అప్పటికే బైకు పూర్తిగా కాలిపోయింది. బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెలలో పట్టణంలో వివిధ చోట్ల నాలుగు బైకులు, కారును దుండగులు తగులబెట్టిన విషయం తెలిసిందే. -
అక్కడ మళ్లీ చెలరేగిన హింస
వారణాసి వారణాజిల్లా జైలులో ఖైదీల తిరుగుబాటు రేపిన అలజడి ఇంకా చల్లారకముందే మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆదివారం రాత్రి మళ్లీ రెచ్చిపోయిన ఖైదీలు మరో జైలు అధికారిని గాయపరిచి బ్యారక్ 5 కు నిప్పుపెట్టారు. దీంతో జిల్లా కారాగారంలో మళ్లీ హింస చెలరేగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శనివారం జరిగిన అల్లర్లలో తమపై అక్రమంగా కేసులు బనాయించారంటూ ఖైదీలు ఆగ్రహానికి గురయ్యారు. బ్యారక్ 8 లో ఖైదీలు జైలు అధికారి హరీంద్ర సింగ్ పై తిరగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సెక్యూరిటీ బలగాలను జైలుకు తరలించారు. ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుళ్లు లోనికి ప్రవేశించకుండా ఖైదీలు అడ్డుకున్నారు. భద్రతా బలగాలు జైలు ఆవరణలోకి రావడానీకి వీల్లేదంటూ మరింత రెచ్చిపోయిన ఖైదీలు బ్యారక్ 5 కు నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలను ఆర్పివేశారు. అనంతరం జైలులో ఏవైనా ఆయుధాలు దాచి ఉంచారనే అనుమానంతో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించి, ఎలాంటి అనుమానిత ఆయుధాలు లేవని తేల్చారు. అయితే ఈ ఘర్షణకు బాధ్యులైన వారిని ఎవర్నీ వదిలిపెట్టేది లేదని జిల్లా కలెక్టర్ రాజమణి యాదవ్ ప్రకటించారు. శని, ఆదివారాల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై పూర్తి విచారణ జరుగుతుందని తెలిపారు. కాగా వారణాసి జైలులో జైలు అధికారులపై తిరగబడిన ఖైదీలు జైలు ఉన్నతాధికారిని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. బ్యారక్ లను తమ ఆధీనంలోకి తీసుకొని హింసకు దిగడం ఉద్రిక్తతను రాజేసిన సంగతి తెలిసిందే. -
అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడి
-
మరోసారి గొంతు సవరించిన జూఎన్టీఆర్..!
-
నెలూరులో మళ్ళీ కుండపోత
-
మళ్లీ జతగా వస్తున్నారు!
అతను కోటీశ్వరుడి కొడుకు. చెఫ్ కావాలన్నది అతని ఆశయం. అతని తండ్రికి అది నచ్చదు. స్విట్జర్లాండ్‌లో చదువుకుని, ఇండియా వచ్చి, ఓ హోటల్లో చెఫ్‌గా చేరతాడు. చెఫ్‌గా చేస్తున్న అతనికి ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లగలిగాడా? ఆ హోటల్‌తో అతనికి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడటానికి కారణం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. మలయాళంలో ఆల్రెడీ హిట్ పెయిర్ అనిపించుకుని, ఇటీవల ‘ఓకె బంగారం’తో మరోసారి దాన్ని నిజం చేసుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘జతగా’ పేరుతో నిర్మాత సురేశ్ కొండేటి తెలుగులోకి విడుదల చేయనున్నారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్ ఇది. పాటలను, చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేస్తాం’’ అని సురేశ్ చెప్పారు. -
ధనుష్‌తో మరోసారి
వివాహానంతరం నటించను అని మళ్లీ నటిస్తున్న తారామణుల్లో నటి అమలాపాల్ ఒకరు. ఈమె నాయకిగా ఎంత త్వరగా ఎదిగారో అంతే త్వరగా పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్గా నిలదొక్కుకున్న అమలాపాల్ ఆ తరువాత దైవతిరుమగళ్, వేట్టై, తలైవా, వేల ఇల్లాద పట్టాదారి తదితర చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు లోనూ బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. ఇలా నటిగా ఎదుగుతున్న సమయంలోనే దర్శకుడు విజయ్ ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలం నటనకు దూరంగా ఉన్న అమలాపాల్ ఆ తరువాత తన భర్త నిర్మిస్తున్న చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల సూర్య కీలక పాత్ర పోషస్తూ తన 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై పాండిరాజ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న పసంగ-2 చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపి రీఎంట్రీ అయ్యారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4 న విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించడానికి సిద్ధం అని ప్రకటించిన అమలాపాల్ ఇప్పుడు మరో చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హిందీ చిత్రం నిల్‌బట్టీ సన్నటకు తమిళ్ రీమేక్‌లో నటించడానికి అమలాపాల్ గీన్‌సిగ్నల్ ఇచ్చారు. విశేషమేమిటంటే ఈ చిత్రంలో నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో కలిసి నిర్మించనున్నారు. హిందీ చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వినీ అయ్యర్‌నే ఈ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది కథానాయకి పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రం అట. అమలాపాల్‌కు అమ్మగా నటి రేవతి నటించనున్న ఈ చిత్రం వచ్చే నెల సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే ధనుష్ అమలాపాల్ జంటగా ఇంతకు ముందు వేల ఇల్లా పట్టాదారి చిత్రంలో నటించారు. ఈ తాజా చిత్రంతో మరోసారి కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారన్న మాట. -
బోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తత
-
మరోసారి పేట్రేగిపోయిన పాకిస్థాన్
-
సూది సైకో మరోదాడి
పశ్చిమ గోదావరి: సూది సైకో మరో దాడి చేశాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండేపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అల్లూరి పాపారావు(35) గురువారం ఉదయం తన బైక్‌పై మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్లో బైక్ స్టాండ్ వేస్తుండగా వెనుక నుంచి హెల్మెట్‌తో వచ్చిన ఆగంతకుడు పాపారావు తొడపై సిరంజితో గుచ్చాడు. పాపారావు కేకలు వేసుకుంటూ జనాన్ని అప్రమత్తం చేశాడు. ఈలోగానే ఆగంతకుడు అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో కూడా సూది సైకో కలకలం రేపాడు. మండలంలోని ముఠాపురం పంచాయతీ బిల్యాతండాలో అంగన్వాడీ ఆయాగా పార్వతి అనే మహిళ పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఆమె విధులు ముగించుకుని గ్రామానికి తిరిగి వస్తుండగా నిర్జన ప్రదేశంలో వెనుక నుంచి బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడపై సూదితో గుచ్చి మాయమయ్యాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. -
మరోసారి చర్చల పర్వం
ఇరుగూ పొరుగూ అన్నాక పొరపొచ్చాలు సహజం. అడపా దడపా ఘర్షణలూ తప్పవు. కానీ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్నంత బలహీనంగా, పెళుసుగా ఏ రెండు దేశాల సంబంధాలూ ఉండవన్నది నిజం. రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగడం, ఒక ఆశారేఖ తళుక్కుమనడం... ఇంతలోనే అధీనరేఖవద్ద తుపాకులు గర్జించడం, రెండువైపులనుంచీ హెచ్చరికలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తడం ఒక రివాజుగా మారింది. మధ్యన ఏదో అంశంపై అలకలు, కార్యదర్శుల స్థాయి చర్చలో, మరొకటో నిలిచిపోవడమూ మామూలే. అందువల్లే శుక్రవారం రష్యాలోని ఉఫాలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్ఓసీ) సదస్సుల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య జరిగిన చర్చలను అందరూ స్వాగతిస్తున్నా వాటిపై పెద్ద ఆశలేమీ పెట్టుకోవడం లేదు. అయితే అధినేతలిద్దరి మధ్యా ముందు అరగంట చర్చలుంటాయనుకున్నది గంటసేపు జరగడం ఒక శుభసూచకమని విశ్లేషకుల భావన. నిరుడు తన ప్రమాణస్వీకారానికి మిగిలిన సార్క్ దేశాల అధినేతలతోపాటు నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడంద్వారా నరేంద్ర మోదీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పుడే ఇద్దరి మధ్యా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకు ఏడాదిక్రితం పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నవాజ్ ఇరు దేశాల సంబంధాలపై విభిన్నంగా మాట్లాడటంవల్ల ఈ చర్చల ఫలితంపై ఎన్నో ఆశలు రేకెత్తాయి. తమ భూభాగాన్ని ఉగ్రవాదులు భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడాన్ని అంగీకరించబోమని నవాజ్ అప్పట్లో చెప్పారు. అంతేకాదు...ముంబై దాడుల్లో తమ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం గురించి కూడా సమీక్షిస్తానని, కార్గిల్ విషయంలో జరిగిందేమిటో వెల్లడిస్తానని అన్నారు. అటు తర్వాత ఐక్యరాజ్యసమితిలో మాట్లాడినప్పుడు కూడా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు. పాక్ ప్రధానిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం అసాధారణం. ఈలోగా ఇక్కడ మోదీ అధికారంలోకి రావడం, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక చర్చలు జరగడంతో ఇరు దేశాల మధ్యా కొత్త శకం ఆవిష్కృతం అవుతుందనుకున్నారు. అయితే, ఆ చర్చలైన కొన్ని రోజులకే పరిస్థితులు మారిపోయాయి. సరిహద్దుల్లో యధావిధిగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ముందు రెచ్చగొట్టింది మీరంటే మీరని ఆరోపణలు వినిపించాయి. మోదీ-నవాజ్ ద్వైపాక్షిక చర్చలకు కొనసాగింపుగా నిరుడు ఆగస్టులో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు హఠాత్తుగా రద్దయ్యాయి. న్యూఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషనర్ మన ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా వేర్పాటువాద హురియత్ నేతలతో సమావేశం కావడంవల్లే ఈ స్థితి ఏర్పడింది. ‘మీరు ఎవరితో చర్చలు జరపాలనుకుంటున్నారు...భారత ప్రభుత్వంతోనా, వేర్పాటువాదులతోనా, తేల్చుకోండి’ అని మన ప్రభుత్వం ఆ సందర్భంగా పాక్‌కు అల్టిమేటం కూడా ఇచ్చింది. ఆ తర్వాత నిరుడు కఠ్మాండూలో జరిగిన సార్క్ దేశాల అధినేతల సమావేశంలో మోదీ, నవాజ్‌లు పరస్పరం ఎదురుపడి చిరునవ్వులు చిందించుకోవడం మినహా పలకరింపులే లేవు... ఇక ద్వైపాక్షిక చర్చల మాట చెప్పేదేముంది? ఇలాంటి సమయంలో ఉఫాలో రెండు దేశాల అధినేతల మధ్యా జరిగిన చర్చలు ఆశ్చర్యపరచడం సహజమే. ఇరు దేశాలమధ్యా స్తంభించిన చర్చల ప్రక్రియను పునరుద్ధరించుకోవాలని, ముంబై దాడి కేసు నిందితులపై విచారణ త్వరితగతిన జరగడానికి వీలైన చర్యలు తీసుకోవాలని చర్చల అనంతరం విడుదలైన ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఈ చర్చలు ప్రధానంగా ఉగ్రవాదంపైనా, దాని ధోరణులపైనా సాగాయని వివరించింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు ప్రకటన తెలిపింది. ఈ చర్చలకు కొనసాగింపుగా భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళానికి, పాకిస్థాన్ రేంజర్స్ మధ్యా...ఆ తర్వాత ఇరు దేశాల మిలిటరీ డెరైక్టర్ జనరళ్ల మధ్యా సంప్రదింపులు సాగుతాయని ఈ ఉమ్మడి ప్రకటన చెప్పడం ఆశావహమైన పరిణామం. అలాగే, ముంబై దాడుల్లో ప్రమేయమున్నదని చెబుతున్న ఉగ్రవాదుల స్వర నమూనాలను అందించడంతోసహా వివిధ చర్యలు తీసుకోవాలనుకోవడం కూడా ఒక ముందడుగే. అయితే, రెండు దేశాలకూ మధ్య అత్యంత కీలకమైన సమస్యగా ఉన్న కశ్మీర్ సంగతి ఇందులో ప్రస్తావనకే రాకపోవడంవల్ల ఈ చర్చల కథ కూడా కంచికే వెళ్తుందా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. ఈ చర్చల కోసం నరేంద్రమోదీ ఒక మెట్టు దిగారనే చెప్పాలి. స్నేహితులను ఎంచుకున్నట్టుగా మన పొరుగువారిని ఎంపిక చేసుకోవడం సాధ్యంకాదు. ఆ పొరుగు గిల్లికజ్జాలు పెట్టుకునేదైనా... వారి వ్యవహార శైలి మనకు నచ్చకపోయినా వారిని దారికి తెచ్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేయకతప్పదు. నిరుడు ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను మన దేశం నిలిపేయడాన్ని ఈ కారణంతోనే దౌత్య నిపుణులు వ్యతిరేకించారు. చర్చలనేవి నిరంతర ప్రక్రియగా ఉండక తప్పదు. అందులో మన వైఖరేమిటో చెప్పడం, వారి వాదనలేమిటో తెలుసుకోవడం, ఉభయులూ కలిసి పనిచేయడానికి గల అవకాశాలేమిటో చూడటం, సమస్యల విషయంలో ఒక పరిష్కారాన్ని అన్వేషించడానికి ప్రయత్నించడం తప్పనిసరి. ఉగ్రవాదానికి ఊతమీయడంవంటి అంశాల్లో గట్టిగా అభ్యంతరాలు చెప్పడం, తీరు మారనప్పుడు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఏకాకిని చేయడం, ఒత్తిళ్లు తీసుకురావడం చేయాలి. దీనికి ఓపిక ఉండాలి. వాస్తవ పరిస్థితులను గమనించే చాకచక్యం ఉండాలి. ఇప్పుడు పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధపడటం ద్వారా మోదీ తనకు ఆ ఓపిక, ఆ చాకచక్యం ఉన్నాయని నిరూపించారు. అయితే, ఈ చర్చలు సత్ఫలితాలనీయాలంటే పాకిస్థాన్ తన పోకడను మార్చుకోవాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తనకు చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించుకోవాలి. అదంత సులభం కాదు. పాక్‌లో తన మాటే నెగ్గాలని అక్కడి సైన్యం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భారత్‌తో సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించినప్పుడల్లా మోకాలడ్డుతుంది. అంతర్గతంగా పాకిస్థాన్‌లో ఆ సమస్య పరిష్కారమై అంతిమంగా ఇరుదేశాల మధ్యా శాంతిసామరస్యాలు నెలకొంటే అది రెండుచోట్లా అభివృద్ధికి బాటలు పరుస్తుంది. -
నేపాల్‌లో మరోసారి భూకంపం