
కౌలాలంపూర్: మలేసియా ప్రధానమంత్రిగా మహతీర్ బిన్ మహమ్మద్(92) మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇంతపెద్ద వయస్సులో ఎన్నికైన నేతగా రికార్డు సృష్టించారు. మద్దతుదారుల సంబరాల మధ్య మహతీర్ మహమ్మద్ గురువారం రాజధానిలోని ఇస్తానా నెగర ప్రాసాదంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
మలేసియాకు స్వాతంత్య్రం వచ్చిన 1957 నుంచి అధికారంలో ఉన్న బరిసాన్ నేషనల్(బీఎన్) సంకీర్ణానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గట్టి షాకిచ్చారు. మొత్తం 222 సీట్లున్న పార్లమెంట్‌లో ప్రతిపక్ష ‘పకటన్ హరపన్’ కూటమికి 113 సీట్లు రాగా బీఎన్ కూటమి 79 సీట్లు గెలుచుకుంది. మహతీర్ మహమ్మద్ బీఎన్ కూటమి చైర్మన్‌గా ఉన్న సమయంలో 1981–2003 వరకు 22 ఏళ్లపాటు ఏకధాటిగా ప్రధానిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment