
సిడ్నీలో ఓటేస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని దంపతులు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ సంకీర్ణం అనూహ్య ఫలితాలు సాధించింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుపు ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం జరిగిన ఎన్నికల్లో సుమారు 1.60 కోట్ల మంది ఓటేశారు. అయితే, 9 గెలాక్సీ ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ కూటమి మొత్తం 151 సీట్లలో 82 స్థానాలు గెలుచుకుంటుందని వచ్చింది. కానీ, ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను బట్టి అధికార పార్టీ 74 స్థానాలను కైవసం చేసుకోగా, మోరిసన్ మళ్లీ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీసం 76 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే, 65 స్థానాలు మాత్రమే గెలుచుకున్న లేబర్ పార్టీ ఓటమిని అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment