గ్రీవెన్‌‌సలో గోస | greevance process is so many problems | Sakshi
Sakshi News home page

గ్రీవెన్‌‌సలో గోస

Published Tue, Feb 18 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

గ్రీవెన్‌‌సలో గోస

గ్రీవెన్‌‌సలో గోస

గ్రీవెన్‌‌సలో గోస
 సౌకర్యాలు లేక ఫిర్యాదుదారుల అవస్థలు
 
 ఖమ్మం కలెక్టరేట్,  : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహిం చిన గ్రీవెన్‌‌సకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడాల్సి వచ్చింది. ఉదయం 8 గంట లకు కలెక్టరేట్‌కు చేరుకున్న బాధితులు పేరు నమోదు కోసం 10 గంటల వరకు వేచి ఉన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఆవరణలో  క్యూలో నిల్చున్నారు.

భద్రాచలం, ఇల్లెందు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు క్యూలో నిల్చొలేక, కుర్చీలు లేక  కలెక్టరేట్‌లోని పార్కులో కొద్ది సేపు సేదతీరారు. ఫిర్యాదుదారులు మంచినీరు, మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు వినతులు రాయరాక, సహాయకులు లేక అవస్థ పడ్డారు. కుర్చీలు లేక పోవడంతో వృద్ధులు సైతం వరండాలో కిందనే కూర్చుకున్నారు.  చంటి బిడ్డలతో వచ్చిన వారు, వికలాంగులు మరింత ఇబ్బందిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement