నిందితుడు జెఫ్పరీ యావో
బోస్టన్ : ఓ మహిళని విచక్షణా రహితంగా వేటకొడవలితో హత్య చేసి చంపిన ఘటన శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో బోస్టన్ సమీపంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లైబ్రరీ గదిలో చదువుకుంటున్న ఓ మహిళపై మాసాచుసెట్స్‌కు చెందిన 23 ఏళ్ల జెఫ్పరీ యావో వేట కొడవలితో తల, రొమ్ము భాగంలో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తమోడుతున్న మహిళ లైబ్రరీ తలుపుల వైపుగా పరిగెత్తింది. అతడు అంతటితో ఆగకుండా ఆమె వైపుగా పరిగెత్తాడు. అడ్డువచ్చిన లైబ్రరీ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడి పరారయ్యాడు.
సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేక పోయింది. తీవ్ర గాయాలపాలైన మహిళ కొద్ది సేపటి తర్వాత చికిత్స పొందుతూ మరణించింది. ఆ మహిళ ఎవరు.? అతడు ఎందుకు ఆమెపై దాడి చేశాడు.? అన్న వివరాలు ఇంకా తెలియ రాలేదు. జెఫ్పరీ యావో నివసిస్తున్న ఇంటి చుట్టు పక్కల వారిని బోస్టన్ హెరాల్డ్ ఇంటర్వ్యూ చేయగా అతని గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. గత కొద్ది సంవత్సరాలుగా యావో ప్రవర్తన క్రూరంగా తయారైందని, మాలో ఎవరిని చంపుతాడో అని భయపడుతుండేవాళ్లమని చెప్పారు. అతని మిత్రులు యావో గత కొద్ది సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయాడన్న విషయాన్ని దృవీకరించారు. పోలీసులు యావోపై హత్యా, హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment