వీక్షణం
శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)లోని ఓ దీవిలో అల్కట్రాజ్ అనే జైలు ఉంది. దీనిలో ఖైదీలు ఒక్కొక్కరికీ ఒక్కో ఏసీ గది, మంచి మంచం, మెత్తటి పరుపు, టీవీ ఉంటాయి. స్నానానికి వేణ్నీళ్లు ఇస్తారు. ఖరీదైన భోజనం పెడతారు. లైబ్రరీ, షటిల్ కోర్టు, చిన్న థియేటర్ కూడా ఉంటాయి. మంచి వాతావరణంలో ఉంచితే నేరస్థులు మంచిగా మారతారని ఈ ఏర్పాట్లు చేశారట!
రాజ్‌పుట్‌లు యుద్ధానికి వెళ్లేటప్పుడు తమ గుర్రాల మూతులకు నకిలీ ఏనుగు తొండాలను తగిలించేవారట. అప్పుడవి పిల్ల ఏనుగుల్లా కనిపిస్తాయి కాబట్టి శత్రువుల ఏనుగులు తమపై దాడి చేయకుండా ఉంటాయని అలా చేసేవారట!
కనిపెట్టిన 38 సంవత్సరాలకు గానీ రేడియో 50 మిలియన్ల మందికి చేరువ కాలేకపోయింది. ఫోన్ అయితే 20 ఏళ్లకు, టీవీ 13 ఏళ్లకు, ఫేస్‌బుక్ 3.6 ఏళ్లకు చేరవయ్యింది. అయితే గూగుల్ ప్లస్ మాత్రం కేవలం 88 రోజులకే యాభై మిలియన్ల మందికి చేరువైపోయింది!
1993లో ఓ వ్యక్తి మిసిసిపీ నదికి, తమ ఊరికి మధ్యన ఉన్న కట్టను పడగొట్టేశాడు. అది కూడా తన భార్య ఆఫీసు నుంచి త్వరగా వచ్చేస్తుందన్న స్వార్థంతో! దానివల్ల ఆ నదికి వరదలు వచ్చినప్పుడు పద్నాలుగు వేల ఎకరాలు నీట మునిగి పోయాయి. ఆగ్రహించిన న్యాయస్థానం అతగాడికి జీవిత ఖైదును విధించింది!
సెల్‌ఫోన్లు వచ్చాక పబ్లిక్ ఫోన్లను వాడటం మానేశారంతా. ఫలితంగా ఫోన్ బూతులు వెలవెలబోతుండటంతో పలు దేశాలు వాటిని తొలగించేశాయి. అయితే ప్రతి విషయాన్నీ క్రియేటివ్‌గా ఆలోచించే జపాన్‌వారు మాత్రం... వాటిని ఇలా అక్వేరియమ్‌లుగా మార్చేస్తున్నారు. వాళ్ల ఈ ఐడియా అక్కడివారికే కాదు, అన్ని దేశాల వారికీ భలేగా నచ్చింది!