View
-
‘వ్యూ’ లక్ష్యం రూ.1,000 కోట్లు
ముంబై: టీవీల తయారీలో ఉన్న వ్యూ టెలివిజన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో రూ.1,000 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. ‘కంపెనీ లాభదాయకంగా ఎదగాలని కోరుకుంటోంది. అది నిలకడగా లేకుంటే మార్కెట్ వాటా కోసం వెంబడించబోము’ అని సంస్థ ఫౌండర్, చైర్పర్సన్ దేవితా షరాఫ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక, వ్యూహాత్మక వాటాదారుల కోసం వెతకడానికి ఇది సరైన సమయం అని ఆమె యోచిస్తున్నారు. ‘2022–23లో రూ.900 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లను దాటతాం. టర్నోవర్ గర్వం అయితే, లాభదాయకత చిత్తశుద్ధి లాంటిది. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం లాభాలు మూడు రెట్లు అధికం. లాభదాయకత కోసం ఎక్కువ శ్రద్ధ వహిస్తాం’ అని తెలిపారు. 40 లక్షలకుపైగా టీవీలు.. వ్యూ ఇప్పటి వరకు 40 లక్షల పైచిలుకు టీవీలను విక్రయించింది. 2022–23లో మొత్తం ఆదాయంలో 80 శాతం వాటా 50 అంగుళాలు ఆపైన సైజులో లభించే ప్రీమియం మోడళ్లు కైవసం చేసుకున్నాయి. ‘అన్ని టీవీ విభాగాల్లో ప్రీమియం కేటగిరీ అత్యంత లాభదాయకంగా ఉంటుంది. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరుగుతున్నందున టీవీ సెట్స్‌కు చాలా డిమాండ్ ఉంది. వినియోగ విధానాలు మారుతున్నాయి. లిమిటెడ్ ఎడిషన్‌లో రూ.20 లక్షల ధరతో 100 అంగుళాల టీవీని కొన్నేళ్ల క్రితం ప్రవేశపెట్టాం. 100 యూనిట్లు విక్రయించాం. 85 అంగుళాల టీవీలు 2012 నుంచి 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. వచ్చే ఒకట్రెండేళ్లలో 85, 98 అంగుళాల టీవీలు 10,000 యూనిట్ల అమ్మకాలను ఆశిస్తున్నాం’ అని దేవితా షరాఫ్ చెప్పారు. ధర పెంపు ప్రభావం ఉండదు.. ఈ మధ్యకాలంలో ప్యానెళ్ల ధరలు పెరిగాయి. అయితే కోవిడ్ కాలం మాదిరిగా ప్యానెళ్ల కొరత లేదని దేవితా షరాఫ్ తెలిపారు. ‘ధరల పెంపు కారణంగా వ్యూ వంటి ప్రీమియం బ్రాండ్ ప్రభావితం కాలేదు. కంపెనీ సేవలందించే వివేకం గల వినియోగదారులు ప్రపంచ పోకడలను అర్థం చేసుకోగలుగుతారు. తక్కువ ధర విభాగాల్లో పోటీపడే బ్రాండ్లకు ఇది కష్టంగా మారుతుంది. ఈ కంపెనీలు ధరపై మాత్రమే విక్రయించగలుగుతాయి’ అని వివరించారు. కంపెనీ తాజాగా 98, 85 అంగుళాల్లో నూతన టీవీల శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర రూ.6 లక్షల వరకు ఉంది. -
17వ శతాబ్దానికి చెందిన " బన్సీలాల్‌పేట మెట్ల బావి " ఏరియల్ వ్యూ
-
గూగుల్ గుడ్ న్యూస్: ‘స్ట్రీట్ వ్యూ’ని ఎంజాయ్ చేయండి!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ గూగుల్ మ్యాప్స్‌లో ’స్ట్రీట్ వ్యూ’ ఫీచర్‌ను భారత మార్కెట్లో మరోసారి తీసుకొచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర 10 నగరాల్లో 1,50,000 కి.మీ. విస్తీర్ణంలో ఇది బుధవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారని వివరించింది. 2022 ఆఖరు నాటికి ఈ ఫీచర్‌ను 50 నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఏదైనా ప్రాంతం ఇమేజీని 360 డిగ్రీల కోణంలో చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గతంలోనే దేశీయంగా ప్రవేశపెట్టినప్పటికీ భద్రతా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు కేంద్రం అనుమతించలేదు. మరోవైపు, ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్‌లను మెరుగుపర్చేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కూడా జట్టు కట్టినట్లు గూగుల్ వివరించింది. త్వరలో హైదరాబాద్, కోల్‌కతాలోని స్థానిక ట్రాఫిక్ విభాగంతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ మిరియం కార్తీక డేనియల్ తెలిపారు. -
జీఎస్టీ బిల్లు - అంచనాలు
న్యూడిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్ టీ బిల్లు కు గ్రీన్ సిగ్నల్ లభించడం దాదాపుగా ఖాయిమైనట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కేంద్ర కేబినెట్ బిల్లులో కీలకమైన మార్పులకు ఆమెదం తెలపడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వస్తు, సేవల పన్నుకు మోక్షం లభించనుంది. వివాదాస్పదమైన ఒక శాతం తయారీ పన్ను తొలగించడం, తొలి ఐదేళ్లలో రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లితే ఇందుకు పరిహారాన్ని చెల్లించే హామీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేయడం కూడా దీనికి ఊతమిస్తోంది. ఆగస్ట్ 12లోగా ముగియనున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు చట్ట రూపాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతోంది. తొలుత రాజ్యసభలో, అనంతరం లోక్‌సభలో ఆమోదం కోసం యోచిస్తోంది. ఈ బిల్లు చట్టమైతే. దేశవ్యాప్తంగా ఒకే పన్ను రేటు అమల్లోకి రానుంది. ఏప్రిల్1, 2017నుంచి అమలు తేవాలని పట్టుదలగా ఉంది. అటు వచ్చే వారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తిచేసినట్లు కేంద్ర సహాయమంత్రి నక్వీ చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లు ఆమోదం, ప్రభావంపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా,ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటోమొబైల్స్, ఎఫ్ ఎంసీజీ, రియల్ ఎస్టేట్, టూరిజం, ఆన్ లైన్ మార్కెటింగ్ తదితర రంగాలు ప్రభావితం కానున్నాయి. దీనిమూలంగా ప్రస్తుత అమ్మకపు పన్ను భారీగా క్షీణించేందుకు వీలుంటుందనీ, దీంతో ఫ్యాన్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఒవెన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా. ద్వంద్వ పన్నుల భారం ఉండదని చెబుతున్న ఈ బిల్లుకు అమల్లోకి వస్తే విలాసవంత వాహనాలు మినహా మిగిలిన వాహనాలు, విడిభాగాలు జీఎస్టీకిందకు రానుండడంతో వాహనాల ధరలు, సేవల వ్యయాలు తగ్గుతాయంటున్నారు. వ్యక్తిగత సంరక్షణ, వంట నూనెలు వంటివి జీఎస్టీ కిందకు వస్తే పన్నులు పెరుగుతాయి. ఫలితంగా ధరలు కూడా కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఇవి నిత్యావసరాల కేటగిరీ లో ఉండడంతో తక్కువ స్థాయి పన్ను అమలవుతోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు రవాణా, గిడ్డంగుల నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. తాజాగా రూపొందించిన జీఎస్టీ ముసాయిదాలో ఈకామర్స్ లావాదేవీలకు ప్రత్యేక పన్ను విధానాలను అమలవుతాయి. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఒకే పన్ను రేటు వర్తిస్తుంది. పలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులపై విధించే సర్వీస్ ట్యాక్స్ మరింత పెరిగే అవకాశముంది. వివిధ రాష్ర్టాలు విధిస్తున్న పలురకాల పన్నుల స్థానే రెండు మూడు పన్నులే అమల్లోకి వస్తాయి. దీంతో పరోక్ష పన్నుల వ్యవస్థపట్ల అందరికీ స్పష్టత వస్తుంది. వస్తువులు, సేవలు, తయారీ, వినియోగం, రవాణా వంటి పలు విభాగాలపై పడుతున్న పలురకాల పన్నులు తొలగుతాయి. అమ్మకపు పన్ను, వ్యాట్, ఆక్ట్రాయ్, ఎక్సైజ్ సుంకం తదితర సుంకాలు ఒకే గొడుగుకిందకు వస్తాయి. ఇది ప్రత్యక్షంగా పలురంగాలకు లబ్ది చేకూర్చడంతోపాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. -
గగనం నుంచి నగర వీక్షణం!
-
శామ్ సంగ్ జెయింట్ టాబ్లెట్ టీజర్ లీక్!
మొబైల్ ఫోన్ల విభాగంలో దుమ్ము రేపుతున్న శామ్ సంగ్ మార్కెట్లోకి మరో సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించనుంది. యాపిల్ ప్రో ఐ-పాడ్ 12.9 ఇంచెస్ స్క్రీన్ కు దీటుగా.. శామ్ సంగ్ గెలాక్సీ 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో టాబ్లెట్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు గత సంవత్సర కాలంగా రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్ లైన్ లో లీక్ అయిన ఓ టీజర్... ఆ విషయాన్ని రూఢి చేస్తూ.. స్మార్ట్ ఫోన్ అభిమానులను ఉవ్విళ్ళూరిస్తోంది. ఆన్ లైన్ లో ఇప్పటికే లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే... 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో గెలాక్సీ ట్యాబ్ అందర్నీ ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ అభిమానుల మనసు దోచుకుంటుండగా వారిని తనవైపు తిప్పుకొనేందుకు శామ్ సంగ్ కంపెనీ మార్కెట్లోకి అతి పెద్ద స్క్రీన్ తో జెయింట్ టాబ్లెట్ ను తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎఫ్ఏ బెర్లిన్ లో శామ్ సంగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీజర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆన్ లైన్ లో విడుదలైన టీజర్ ప్రకారం ఆ జెయింట్ టాబ్లెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే... సుమారుగా లాప్ టాప్ ను తలపిస్తున్న టాబ్లెట్.. ఆకట్టుకునే నల్లని రంగులో ఉంది. దీనికి ఫోల్డబుల్ స్టాండ్ ను కూడ అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టాబ్లెట్ పూర్తి వివరాలను అక్టోబర్ నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు కొన్ని సంస్థలు కూడ చెప్తున్నాయి. ఆన్ లైన్ టీజర్ ప్రకారం 451.8 మి.మీ. వెడల్పు, 275.8 మి.మీ పొడవు తోపాటు 11.9 మందంగా ఈ బ్లాక్ టాబ్లెట్ ఉంది. 18.4 అంగుళాల టీఎఫ్ టి ఎల్సీడీ స్క్రీన్, 1920x1080 రిజల్యూషన్ తో 8 మెగా పిక్సెల్ కెమెరా కలిగిన ఈ పరికరంలో 2.1 మెగా పిక్సెల్ తో మరో కెమెరా ఉంది. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్జినోస్ 7 ప్రాసెసర్, 1.6 గిగాహెట్జ్ రన్నింగ్ కెపాసిటీ తోపాటు.. 2 జీబీ రాం కలిగి ఉంది. ఆ మెగా టాబ్లెట్ మార్కెట్లో నిజంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ సాంసంగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
అరవింద నేత్రుడు.. అందాల రాముడు
ఒంటిమిట్ట : బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఒంటిమిట్ట కోదండరాముడు వటపత్రసాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ఆలయంలోని మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాల అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. వటపత్ర సాయి అలంకారంలో రాముల వారు పురవీధుల్లో ఊరేగారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. అన్ని సౌకర్యాలతో శ్రీకోదండరామనగర్ కోదండరామాలయ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అన్ని సౌకర్యాలతో శ్రీకోదండరామనగర్ నిర్మిస్తామని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. ఇళ్లు కోల్పోయిన 86 మంది బాధితులకు చెక్కులు, హామీ పత్రాలను సోమవారం స్థానిక హరిత కల్యాణ మండపంలో కలెక్టర్ కేవీ రమణతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ కోదండరామాలయ పరిసరాల్లో ఇళ్లు కోల్పోయిన వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అందమైన కాలనీ నిర్మిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నిలబెట్టుకుంటామన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే తమ ద్వారా పరిష్కరించుకోవాలని బాధితులను కోరారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల అనంతరం హౌసింగ్ అధికారులు ఇళ్లు నిర్మించే పనిలో నిమగ్నమవుతారన్నారు. ఆర్అండ్బీ అధికారులు నిర్ణయించిన మొత్తం కంటే వంద శాతం నష్టపరిహారం అదనంగా చెల్లిస్తున్నామని తెలిపారు. నాలుగు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. లబ్ధిదారులకు అధికారుల ద్వారానే ఇళ్లు నిర్మించి ఇస్తామని కలెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కాలనీ ఏర్పాటు చేస్తామని, ఇంటి లోపలి భాగాన్ని లబ్ధిదారులు వారికి ఇష్టమొచ్చిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. భక్తులకు ఇక్కట్లు కలుగకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక హరిత రెస్టారెంట్లో జిల్లా స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీఐపీలు, భక్తులకు ప్రత్యేకంగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు భోజనం, నీటి వసతిని కల్పించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తగినన్ని బారికేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏజేసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్పిళ్లై పాల్గొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన ఐజీ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవ ఏర్పాట్లను రాయలసీమ ఐజీ వేణుగోపాల్‌కృష్ణ సోమవారం సాయంత్రం పరిశీలించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లు, బారికేడ్లు, వీఐపీ వసతుల గురించి సీఐ ఉలసయ్య, ఎస్ఐ అరుణ్రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే వీఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఒంటిమిట్ట అభివృద్ధికి కృషి ఒంటిమిట్ట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పేర్కొన్నారు. సీఎం బహిరంగ సభ జరిగే హైస్కూల్ ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే యోచనలో ఉన్నామన్నారు. ముఖ్యంగా ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించి మండల ప్రజల తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేత సోమశిల వెనుకజలాల నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించే శిలాఫలకానికి 2వ తేదిన శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు. ఒంటిమిట్టను పర్యాటకంగా కూడా అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం వారు ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. -
‘వైకుంఠ’ దర్శనం.. దివ్యానుభూతి
తిరుమలలో ఉత్తర ద్వారపవేశంతో భక్తజనం ఆనందం సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) సందర్భంగా ఉత్తర ద్వారంలో దర్శించుకుని భక్తులు దివ్యానుభూతిని పొందారు. వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల సంవత్సరాది గురువారమే రావడంతో డిసెంబర్ 31 నాటికే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3.05 గంటల నుంచీ సామాన్య భక్తులను అనుమతించడంతో దాదాపు రెండు లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు రావడంతో రద్దీ పెరిగి దర్శనం కోసం క్యూలైన్లో తోపులాటలు చోటుచేసుకున్నాయి. భక్తులు ఇక్కట్లు పడ్డారు. కాగా, వీఐపీ లకు కేటాయించే టికెట్లలో ఈ ఏడాది 70 శాతం కోత విధించి 2,474 టికెట్లే ఇచ్చారు. 1.20 గంట ల నుంచి వీఐపీలకు దర్శనం ప్రారంభించి 3 గంటలకు పూర్తి చేశారు. 3.05 గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. గురువారం సాయంత్రం టీటీడీ ఉద్యోగులను ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించారు. తమనూ అనుమతించాలని పోలీసు కుటుంబాలు కోరినా అనుమతించకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీవారి సేవలో జడ్జిలు, ప్రముఖులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ.రమ ణ, జస్టిస్ రంజన్ గొగై, ఆంధ్ర, తెలంగాణ ఉవ్ముడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, కేరళ, ఢిల్లీ, వుద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ మీనాకువూరి, జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ సంజయ్ కిశోర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్రావు, గౌహతి తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి కె.శ్రీధర్‌రావు, నెదర్లాండ్‌లోని అంతర్జాతీయ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దళ్వార్ బండారి.. వేంకటేశ్వర స్వామి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. స్వర్ణ రథంపై సర్వాంతర్యామి తిరుమలలో గురువారం స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తలోకానికి తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. -
వీక్షణం
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా)లోని ఓ దీవిలో అల్కట్రాజ్ అనే జైలు ఉంది. దీనిలో ఖైదీలు ఒక్కొక్కరికీ ఒక్కో ఏసీ గది, మంచి మంచం, మెత్తటి పరుపు, టీవీ ఉంటాయి. స్నానానికి వేణ్నీళ్లు ఇస్తారు. ఖరీదైన భోజనం పెడతారు. లైబ్రరీ, షటిల్ కోర్టు, చిన్న థియేటర్ కూడా ఉంటాయి. మంచి వాతావరణంలో ఉంచితే నేరస్థులు మంచిగా మారతారని ఈ ఏర్పాట్లు చేశారట! రాజ్పుట్లు యుద్ధానికి వెళ్లేటప్పుడు తమ గుర్రాల మూతులకు నకిలీ ఏనుగు తొండాలను తగిలించేవారట. అప్పుడవి పిల్ల ఏనుగుల్లా కనిపిస్తాయి కాబట్టి శత్రువుల ఏనుగులు తమపై దాడి చేయకుండా ఉంటాయని అలా చేసేవారట! కనిపెట్టిన 38 సంవత్సరాలకు గానీ రేడియో 50 మిలియన్ల మందికి చేరువ కాలేకపోయింది. ఫోన్ అయితే 20 ఏళ్లకు, టీవీ 13 ఏళ్లకు, ఫేస్బుక్ 3.6 ఏళ్లకు చేరవయ్యింది. అయితే గూగుల్ ప్లస్ మాత్రం కేవలం 88 రోజులకే యాభై మిలియన్ల మందికి చేరువైపోయింది! 1993లో ఓ వ్యక్తి మిసిసిపీ నదికి, తమ ఊరికి మధ్యన ఉన్న కట్టను పడగొట్టేశాడు. అది కూడా తన భార్య ఆఫీసు నుంచి త్వరగా వచ్చేస్తుందన్న స్వార్థంతో! దానివల్ల ఆ నదికి వరదలు వచ్చినప్పుడు పద్నాలుగు వేల ఎకరాలు నీట మునిగి పోయాయి. ఆగ్రహించిన న్యాయస్థానం అతగాడికి జీవిత ఖైదును విధించింది! సెల్ఫోన్లు వచ్చాక పబ్లిక్ ఫోన్లను వాడటం మానేశారంతా. ఫలితంగా ఫోన్ బూతులు వెలవెలబోతుండటంతో పలు దేశాలు వాటిని తొలగించేశాయి. అయితే ప్రతి విషయాన్నీ క్రియేటివ్‌గా ఆలోచించే జపాన్‌వారు మాత్రం... వాటిని ఇలా అక్వేరియమ్లుగా మార్చేస్తున్నారు. వాళ్ల ఈ ఐడియా అక్కడివారికే కాదు, అన్ని దేశాల వారికీ భలేగా నచ్చింది! -
వీక్షణం
చైనాలో ఓ రహదారిని నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అడ్డుగా ఉన్న నిర్మాణాలను పడగొట్టి, యజమానులందరికీ వేరేచోట స్థలాలు ఇప్పించారు. కానీ ఓ ఇద్దరు దంపతులు మాత్రం తమ ఇంటిని కూలగొట్టడానికి ఒప్పుకోలేదు. వారిని బతిమాలి విసిగిపోయిన అధికారులు ఇంటిని పడగొట్టడం మొదలు పెట్టారు. అయినా కూడా బయటకు వచ్చేది లేదని వాళ్లు మొరాయించడంతో చివరికి ఆ ఇంటిని అలాగే ఉంచి రోడ్డు వేసేశారు. ఇప్పుడా ఇల్లు సరిగ్గా దారి మధ్యలో ఉంది! ‘హ్యారీపాటర్’లో రాన్ వెస్లీగా నటించిన రూపర్ట్ గ్రింట్ చాలా పాపులర్ అయ్యాడు. బాగా సంపాదించాడు కూడా. అయితే అతగాడికి చిన్నప్పుడు ఐస్క్రీములమ్మాలనే కోరిక ఉండేదట. దాన్ని తీర్చుకోవడానికి ఓ వ్యాన్ కొనుక్కుని, అందులో ఐస్‌క్రీములు పెట్టుకుని ఊరూ వాడా తిరగడం మొదలెట్టాడు. అయితే అమ్మడంలేదులెండి... పంచుతున్నాడంతే! జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక పెంగ్విన్ని పెంచుకుంటున్నాడు. దాని పేరు లాలా. ఇది ఇంట్లో ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? రోజూ ఒక బ్యాగ్‌ని వీపునకు తగిలించుకుని వెళ్లి, పక్క వీధిలో ఉన్న మార్కెట్లో చేపలు కూడా కొనుక్కొస్తుంది. దాని యజమాని ఆ బ్యాగ్‌లో డబ్బులు వేసి పంపిస్తాడట. చేపలు బ్యాగ్‌లో వేశాక, ఆ డబ్బిచ్చి వీటిని ఇంటికి తీసుకొస్తుందట లాలా! -
కన్నీళ్లూ... తాగలేదు..!
వీక్షణం తిండి లేకపోయినా కొన్ని రోజులు ఉండవచ్చు కానీ, మంచినీళ్లు తాగకుండా కొన్ని గంటలు ఉండాలన్నా కష్టమే. కానీ బార్బరా వార్డ (43)కి మాత్రం యేళ్లుగా నీళ్లు తాగకుండానే బతుకుతోంది. ఎందుకంటే... నీళ్లు తాగితే ఆమె ప్రాణాలే పోతాయి. అందరూ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నీళ్లు తాగితే, బార్బరా మాత్రం తన ప్రాణాలు కాపాడుకోవడానికి నీటికి దూరంగా ఉంటోంది. కొన్నేళ్ల క్రితం స్నానం చేస్తుండగా బార్బరా షాక్ తిన్నట్టుగా అయిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే, ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతోందని వైద్యులు చెప్పారు. కొన్ని కోట్ల మందిలో ఒకరికి వచ్చే ఆ వ్యాధి లక్షణాలు విచిత్రంగా ఉంటాయి. వాళ్లు నీటికి దూరంగా ఉండాలి. నీరు తాగకూడదు. అసలు నీటిని ముట్టనే కూడదు. కాస్త నీరు తగిలినా ఒళ్లంతా ర్యాషెస్ వస్తాయి. తుమ్ముల్లా మొదలై చివరకు ఊపిరాడదు. వెంటనే మందులు తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యతో కొన్నేళ్లుగా నరకం చూస్తోంది బార్బరా. స్నానం చేయడానికి లేదు. బాడీ స్ప్రే వేసుకున్నా ప్రమాదమే. నీళ్లు తాగడానికి లేదు. బాధ కలిగితే కనీసం మనసారా ఏడవడానికి కూడా లేదు. ఏడిస్తే ఆ కన్నీళ్లే ఆమె ప్రాణాలు తీసేస్తాయి. చెమట పట్టినా రిస్కే. దాంతో ప్రతిక్షణం భయపడుతూ బతుకుతోంది. భర్తతో, పిల్లలతో సంతోషంగా గడపడానిక్కూడా లేదని కుమిలిపోతోంది! -
ఆహారం విలువేంటో తెలియాలని...
వీక్షణం హోటల్‌కి వెళ్తాం. కావలసినంత తింటాం. మిగిలింది వదిలేసి వస్తాం. ఇంట్లో వంట చేసుకుంటాం. నచ్చినంత తింటాం. మిగిలింది పారేస్తాం. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వృథా చేసే ఆహారమెంతో అందరికీ తెలుసు. కానీ ఎవరూ పట్టించుకోరు. బాప్టిస్ట్ డ్యూబన్షెట్ కూడా పట్టించుకోకుండా ఉండవచ్చు. కానీ అతడలా చేయలేదు. ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక, ఆకలితో అల్లాడి మరణిస్తుంటే... ఇలా ఫుడ్‌ని వేస్ట్ చేయడమేంటి అని ఆవేదన చెందాడు. ఆహారం విలువేంటో తెలియజేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు అతడు చేసిన పని గురించి తెలిస్తే షాక్ తింటారు ఎవరైనా. ఫ్రాన్సకు చెందిన పాతికేళ్ల యుకువడు బాప్టిస్ట్... ప్యారిస్ నుంచి వార్సా వరకూ సైకిల్ యాత్ర చేపట్టాడు. అంటే అతడు ప్రయాణించాల్సిన దూరం మూడు వేల కిలోమీటర్ల పైనే. రోజుకు అరవై కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ పోతున్నాడు. అయితే తనతో ఎలాంటి ఆహారం తీసుకుని పోలేదు. మరి ఏం తింటాడు అనేగా? ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు ఆగుతున్నాడు. ఆ చుట్టుపక్కల ఏవైనా డస్ట్బిన్స ఉన్నాయేమో చూస్తున్నాడు. వాటిలో వృథాగా పారేసిన ఆహార పదార్థాల్ని తీసుకుని తింటున్నాడు. మొదట అతణ్ని చూసి కొందరు అసహ్యించుకున్నారు. కానీ అతడు ‘మీరు పారేసేది మరొకరి కడుపు నింపుతుంది’ అని తెలియజేయడానికే అలా చేస్తున్నాడని తెలిసి విస్మయం చెందారు. కొందరైతే ఇంకెప్పుడూ ఆహారం పారేయమని మాటిచ్చారు కూడా. చూస్తుంటే బాప్టిస్ట్ ప్రయత్నం ఫలించేట్టుగానే ఉంది. -
సంపదను వీడి సన్యాసం తీసుకుంది!
వీక్షణం ఎంత ఆధునికంగా తయారవుదాం, ఎంత విభిన్న తరహాలో ఎంజాయ్ చేద్దాం అంటూ ఆలోచించే యువత ఉన్న ఈరోజుల్లో... అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నీ వద్దనుకుని... సన్యాసం పుచ్చుకుందో యువతి. చైనా లోని జినన్ పట్టణానికి చెందిన టింగ్ అనే ఇరవై నాలుగేళ్ల యువతి... లగ్జరీ గూడ్స డిజైనింగ్‌లో శిక్షణ పొందు తోంది. సౌకర్యవంతమైన జీవితం, సరదాలు, షికార్లు... ఏ కొదువా లేదామెకి. అయితే ఏమయ్యిందో ఏమో... ఉన్నట్టుండి అన్నీ కట్టిపెట్టేసింది. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం మానేసింది. బయట తిరగడం ఆపేసింది. ఉన్నట్టుండి ఓరోజు మాయమైపోయింది కూడా! ఎక్కడికెళ్లిందోనని ఆరా తీస్తే... ఓ కొండ మీద కూర్చుని ధ్యానం చేసుకుంటోంది. గుండుతో, బౌద్ధ సన్యాస వస్త్రాలతో ఉన్న ఆమెను చూసి అవాక్కయ్యి ఏమిటిదంతా అంటే... ‘నాకు మనిషి పుట్టుక, మనుగడ, మరణాల లోతుల్ని తెలుసుకో వాలని ఉంది, ఈ ప్రపంచమంతా అసహజంగా, అవాస్తవంగా అనిపిస్తోంది, నన్ను వదిలేయండి’ అందట! ఎంత చెప్పినా వినకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు మౌనంగా ఉండి పోయారు. దాంతో పూర్తిగా బౌద్ధ సన్యాసిలా మారిపోయి, ధ్యానం చేసుకుంటూ గడిపేస్తోంది! -
సరదా హద్దు దాటింది!
వీక్షణం వయసులో ఉన్న అమ్మాయిలు ప్రేమలో పడటం మామూలే. బాయ్ ఫ్రెండ్‌తో సరదాగా షికార్లు చేయాలని సరదా పడటమూ మామూలే. అయితే ఈ సరదా చైనాలో పెద్ద అనర్థమే తెచ్చిపెడుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రుల్ని బెంబేలెత్తిస్తోంది! గత కొద్ది కాలంగా చైనా అమ్మాయిల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. జీవితంలో బాగా స్థిరపడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని వారు అనుకుంటు న్నారట. ప్రేమ, పెళ్లి వంటి వాటికి సమయం కేటాయించలేక పోతున్నారట. అలాంటి వారికోసం కొత్త రకం సంస్థలు వెలిశాయి. అవేం చేస్తున్నాయో తెలుసా? పార్టీలకు, పిక్నిక్లకు వెళ్లడానికి బాయ్ఫ్రెండ్సని అద్దెకిస్తున్నాయి. గంటకింత, రోజుకింత అంటూ వసూలు చేస్తున్నాయి. దాంతో అమ్మాయిలు రుసుము చెల్లించి బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. ఆ సమయం కాస్తా గడిచాక తమ చదువు, వృత్తులలో మునిగిపోతున్నారట! దాంతో ఆడపిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారట! మరి ప్రభుత్వం ఇలాంటి సంస్థల మీద ఏ యాక్షన్ తీసుకుంటుందో చూడాలి! -
ఎటు చూసినా ఆకాశమే!
వీక్షణం బస్ ఎక్కినప్పుడు విండో సీటులో కూర్చోడానికే ఇష్టపడతారు ఎవరైనా. బస్సు ముందుకు పోతుంటే, వెనక్కి వెళ్లిపోతున్న దృశ్యాలను చూడటంలో ఉండే మజానే వేరు. అదే విమానంలో అలా చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా! విమానాల్లో కూడా విండో సీట్లు ఉంటాయి, అక్కడా మజా ఉంటుంది. కానీ స్పైక్ ఎస్-512 విమానంలో కలిగే మజా మామూలుది కాదు. ఎందుకంటే ఈ ఫ్లయిట్లో చిన్న చిన్న కిటికీలు కాదు ఉండేది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ మొత్తం అద్దాలే ఉంటాయి. దాంతో ఎటు చూసినా ఆకాశమే కనిపిస్తుంది. విమానంలో ఉన్నామా, ఆకాశంలో విహరిస్తున్నామా అన్నట్టు గొప్ప అనుభూతి కలుగుతుంది. న్యూయార్క నుంచి లండన్ వెళ్లేందుకుగాను ఓ ప్రముఖ సంస్థ దాదాపు ఎనభై వేల మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ విమానాన్ని తయారు చేస్తోంది. టికెట్టు రేటు కూడా ఆ రేంజ్‌లోనే ఉండవచ్చు. అయితే ఇందులో ఒకేసారి ఎక్కువమంది ప్రయాణించడానికి వీలుండదు. పట్టుకు పద్దెనిమిది మందికి మాత్రమే చాన్స. ఆ చాన్స కూడా అప్పుడే దొరకదు. 2018 వరకూ వేచి ఉండాల్సిందే! -
జీవితమంతా కటకటాల్లో...
వీక్షణం ఈ కుక్క బోనులో ఉందని అనుకుంటున్నారా? కాదు... జైల్లో ఉంది. ఓ చిన్న పిల్లాడిని కరిచి, దారుణంగా గాయపర్చి నందుకుగాను దానికి యావజ్జీవిత ఖైదును విధించింది అమెరికన్ కోర్టు. యావజ్జీవిత శిక్ష అంటే మనలాగా పద్నాలుగేళ్లు కాదు... జీవితమంతా జైల్లోనే ఉండాలి. ఈ ఖైదీ కుక్క పేరు మిక్కీ. నిజానికిది ఎప్పుడూ కుదురుగానే ఉండేది. కానీ హఠాత్తుగా ఏమయ్యిందో ఏమో... ఓ చిన్నపిల్లాడిని కరిచేసింది. మిక్కీ యజమానురాలు బేబీ సిట్టింగ్ చేస్తుంది. ఆమె దగ్గరకు వచ్చే పిల్లల్లో నాలుగేళ్ల కెవిన్ విన్సెంట్ ఒకడు. ఓ రోజు ఎప్పటిలానే కెవిన్ని తీసుకొచ్చి క్రష్‌లో వదిలి వెళ్లారు తల్లిదండ్రులు. ఆరోజు మిక్కీకి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు గానీ... కెవిన్ని ఇష్టమొచ్చినట్టు కరిచేసింది. కంటికి, దవడకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కెవిన్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి... కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ‘నో కిల్లింగ్ షెల్టర్’లో జీవితాంతం బందీగా ఉంచమని తీర్పునివ్వడంతో కటకటాల వెనక్కి వెళ్లిపోయింది మిక్కీ. కేసు మొదలైన తరువాత మిక్కీని వదిలేయమంటూ జంతు సంరక్షకులు కొందరు గొడవ చేశారు. నోరు లేని ప్రాణి తెలియక చేసిన తప్పుకు మరణశిక్ష వేయవద్దంటూ కోర్టును అభ్యర్థించారు. దాంతో న్యాయమూర్తి మిక్కీని జీవితమంతా జైల్లో ఉండమన్నారు. లేదంటే మరణశిక్ష వేసేవారట. అదీ సంగతి! -
జ్ఞాపకాన్ని వెతుకుతోంది!
వీక్షణం తల్లికి బిడ్డే ప్రపంచం. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి తనతోటే జీవితాన్ని ఊహించుకుంటుంది. తనని ఎలా పెంచాలి అని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఆ బిడ్డ చనిపోతే పరిస్థితి ఏమిటి? ఆ వేదన ఎలా ఉంటుందో క్యాటీ మెక్గ్రెగర్కి బాగా తెలుసు. బ్రిటన్‌కి చెందిన క్యాటీ పిల్లల కోసం కలలు కంది. గర్భవతి అయిన నాటి నుండీ పుట్టబోయే బిడ్డను తలచుకుంటూనే కాలం గడిపింది. అయితే ఊహించని ఓ సంఘటన క్యాటీ మనసులో తుఫాను సృష్టించింది. నెలలు నిండకుండానే ఆడపిల్లను ప్రసవించింది క్యాటీ. దాంతో బిడ్డను కొన్నిరోజుల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచారు. కోలుకోవడంతో ఇంటికి పంపించారు. పాపకు ఇసబెల్ అని పేరు పెట్టి మురిపెంగా పెంచసాగింది క్యాటీ. కానీ దురదృష్టం... సరిగ్గా ఇరవై రెండు వారాల తర్వాత పాపకు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. పుట్టుకతోనే సమస్యలు ఉన్న ఆ చిన్నారి... ఇక జీవించే శక్తి లేక మరణించింది. క్యాటీ తల్లడిల్లిపోయింది. కూతురి కోసం ఏకధాటిగా ఏడ్చింది. తన చిట్టితల్లి కోసం తాను అల్లిన ఎర్రటోపీని చేతితో పట్టుకునే తిరిగేది. ఎక్కడికెళ్లినా దాన్ని బ్యాగులో పెట్టుకు తీసుకెళ్లేది. ఆ రోజూ అలానే వెళ్లింది. రోడ్డు దాటు తుండగా ఓ ఆగంతకుడు వచ్చి క్యాటీ హ్యాండ్‌బ్యాగ్ లాక్కుని పారిపోయాడు. అతడిని పట్టుకోవాలని ప్రయత్నించి విఫల మైంది క్యాటీ. పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. కనిపించిన వాళ్లందరినీ అడిగింది. కానీ బ్యాగ్ దొరకలేదు. ల్యాప్‌టాప్, ఫోన్, నగదు ఉన్న ఆ బ్యాగ్ ఇక దొరకదు, మర్చి పొమ్మన్నారంతా. కానీ క్యాటీ వెతుకుతోంది వాటి కోసం కాదు. అందులో ఉన్న తన బుజ్జితల్లి ఎర్ర టోపీ కోసం. అన్నీ తీసుకున్నా ఫరవాలేదు, తన కూతురి జ్ఞాపకంగా మిగిలిన ఆ టోపీని మాత్రం ఇచ్చెయ్యమంటూ ఇటీవలే ఫేస్బుల్లో రిక్వెస్ట్ పోస్ట్ చేసింది క్యాటీ. దాన్ని చదివి చాలామంది కదిలిపోయారు. వాళ్లంతా ఆ టోపీని వెతుకుతామని ఆమెకు మాటిచ్చారు. కచ్చితంగా ఎవరో ఒకరు తన కూతురి జ్ఞాపకాన్ని తనకి తెచ్చిస్తారని ఆశగా ఎదురుచూస్తోంది క్యాటీ! -
ఆర్చీని చంపేస్తారా?
వీక్షణం కామిక్ పుస్తకాలు, కార్టూన్ షోల పేర్లు చెబితే పిల్లలే కాదు... పెద్దలు కూడా ఎగిరి గంతేస్తారు. ఒత్తిడి పెరిగిపోతున్న జీవితాల్లో రిలాక్సేషన్ కోసం ఉపయోగపడే మందులవి. అందుకే అందరూ వాటిని ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... వాటికి వీరాభిమానులు అవుతున్నారు. ఎంతగా అంటే... ఓ కామిక్ క్యారెక్టర్ని చంపేస్తున్నామని పబ్లిషర్ చెప్పగానే, వద్దు అని గొడవ చేసేంత! ఆర్చీ ఆండ్రూస్... కామిక్ ప్రపంచంలో మార్మోగే పేరిది. దాదాపు డెబ్భై ఏళ్లుగా ఈ క్యారెక్టర్ అందరినీ ఉర్రూతలూగిస్తోంది. తన సాహసాలతో, అద్భుత విన్యాసాలతో, మంచితనంతో, హాస్యంతో పలు రకాలుగా ఆకట్టుకుంటూ వచ్చిన ఆర్చీ త్వరలో చచ్చిపోబోతున్నాడు. ఈ విషయం గురించి ఇటీవలే ఆర్చీ కామిక్స్ పబ్లిషర్, సీఈవో జాన్ గోల్డ్‌వాటర్ ప్రకటించారు. అంతే... తక్షణం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అది తమకు ఎంతో ఇష్టమైన పాత్ర అని, ఆర్చీని చంపడానికి వీల్లేదని ఫోన్లు, ఉత్తరాలు, మెయిళ్లు వస్తుండటంతో షాక్ తిన్నాడు గోల్డ్‌వాటర్. ఏడు దశాబ్దాలుగా పుస్తకాలు, యానిమేషన్లు, టీవీ షోలు, సినిమాల రూపంలో ఆర్చీ అందరినీ అలరిస్తున్నాడు. ఇక ఇప్పటికైనా అతడి కథకి ముగింపు చెబితే మంచిదనుకున్నాడు గోల్డ్‌వాటర్. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న ‘లైఫ్ విత్ ఆర్చీ’ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ని సిద్ధం చేశాడు. కానీ అభిమానుల ఒత్తిడి ఇంతగా ఉన్నప్పుడు ఆయన ఆ పని చేయగలడా అన్నదే సందేహం. చూద్దాం... ఆర్చీ ఆండ్రూస్ ఆయువు పెరుగుతుందో లేదో! -
ఏళ్లు గడిచినా... వీళ్లింతే!
వీక్షణం కాలం మారేకొద్దీ మనుషులు మారుతూ ఉంటారు. వారి వేషభాషలు, అలవాట్లు, అభిరుచులు... అన్నీ మారతాయి. కానీ ‘రాకబిల్లీ కమ్యూనిటీ’కి చెందినవారిలో మాత్రం ఏ మార్పూ కనిపించదు. ఎందుకంటే... వారు మార్పును ఇష్టపడరు. గతంలో జీవించడమే వారికిష్టం! అమెరికాలో ‘రాకబిల్లీ కమ్యూనిటీ’ అనే ఒక సమూహం ఉంది. వీరంతా 1950ల నాటి వస్త్రధారణలో కనిపిస్తారు. వారి హెయిర్ స్టయిల్స్ కూడా నాటి కాలంలో మాదిరిగానే ఉంటాయి. అది మాత్రమేనా... వారి ఇళ్లలో ఉండే వస్తువులు, వాడే కార్లు కూడా పాత కాలం నాటివే ఉంటాయి. వంట సామాన్ల దగ్గర్నుంచి ఫర్నిచర్ వరకూ అన్నీ అరవై, డెబ్భై దశాబ్దాల క్రితానికి మనల్ని లాక్కుపోతాయి. ఇదంతా ఏంటి అంటే... ‘ఇది మా కమ్యూనిటీ ప్రత్యేకత’ అంటారు వారంతా. ‘గతంలో బతకడంలో ఓ సంతోషం ఉంటుంది. నాటి రోజులు మంచివి. అందుకే ఆ రోజుల నుంచి బయటపడటం మాకు ఇష్టం లేదు’ అని కూడా చెబుతుంటారు. కాలంతో వచ్చే మార్పులు నచ్చనివారు, నాటి సంస్కృతీ సంప్రదాయాల మీద మక్కువ ఎక్కువగా ఉన్నవారు కొందరు కలిసి ‘రాకబిల్లీ కమ్యూనిటీ’గా ఏర్పడ్డారు. అలాగని వీళ్లు నిరక్షరాస్యులేమీ కాదు. అందరూ చదువుకున్నవాళ్లు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు. అయినా కూడా వాళ్లు ఇలానే ఉంటారు, ఇలానే బతుకుతారు. చాలా యేళ్లుగా ఉన్న ఈ కమ్యూనిటీ గురించి జెన్నిఫర్ గ్రీన్బర్గ్ అనే ఫొటోగ్రాఫర్ ద్వారా వెలికి వచ్చింది. పరుగులు తీస్తోన్న ఆధునికత మధ్య పాత తరానికి ప్రతినిధులుగా ఉన్న వీరిని చూస్తే ఆశ్చర్యం వేయడం లేదూ! -
నాడు నిరుపేద... నేడు కోటీశ్వరుడు!
హంగేరీకి చెందిన లాస్లో ఆండ్రాషెక్ (55) ఒకప్పుడు బాగా బతికాడు. కానీ ముప్ఫయ్యేళ్లు వచ్చేసరికి మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పులు చేశాడు. చివరకు నిలువ నీడ లేకుండా పోయి నిరుపేదగా మిగిలాడు. తల్లికి కూడా వయసైపోయి, అతడిని పోషించలేని పరిస్థితుల్లో ఉండటంతో... బంధువులు జాలిపడి ఆ తల్లీకొడుకులకు తిండిపెట్టేవారు. కానీ కొన్నాళ్లకు వాళ్లు కూడా విసిగిపోయారు. లాస్లోని బయటకు గెంటేయమని చెప్పారు. దాంతో తాను ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాడో అర్థమైంది లాస్లోకి. కానీ ఎంత ప్రయత్నించినా మద్యానికి దూరం కాలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అంతలో అతడికి సామాజిక కార్యకర్త అనికోతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత పదేళ్ల పాటు శ్రమించి అతడిని మామూలు మనిషిని చేసింది అనికో. చిన్నాచితకా పనులు చేసుకుంటూ, భార్యతో సంతోషంగా బతుకుతోన్న లాస్లో మొన్నామధ్య అనుకోకుండా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ కాస్తా తగలడంతో ఒక్కసారిగా దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మన కరెన్సీ లెక్కలో వచ్చిపడ్డాయి. ఉక్కిరి బిక్కిరైపోయాడు లాస్లో. ఏదో సరదాగా కొన్నాను తప్ప, తగులుతుందనుకోలేదు అంటూ సంబరపడుతున్నాడు. అలాగని అతడు ఆ డబ్బును విలాసంగా ఖర్చు చేయాలనుకోవడం లేదు. ‘ఓర్పుతో నన్ను మామూలు మనిషిని చేసిన అనికోని ఏ లోటూ లేకుండా చూసుకుంటాను, మిగిలినదంతా పేదల కోసం ఖర్చుపెడతాను’ అంటున్నాడు. అదేంటి, ఏమీ దాచుకోవా అని అడిగితే... ‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఇతరుల కోసం బతకడమే జీవితం అని నా భార్యని చూసి తెలుసుకున్నాను, నేనూ అలాగే బతుకుతాను’ అంటున్నాడు నవ్వుతూ. హ్యాట్సాఫ్ లాస్లో!