ఎటు చూసినా ఆకాశమే!
వీక్షణం
బస్ ఎక్కినప్పుడు విండో సీటులో కూర్చోడానికే ఇష్టపడతారు ఎవరైనా. బస్సు ముందుకు పోతుంటే, వెనక్కి వెళ్లిపోతున్న దృశ్యాలను చూడటంలో ఉండే మజానే వేరు. అదే విమానంలో అలా చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా!
విమానాల్లో కూడా విండో సీట్లు ఉంటాయి, అక్కడా మజా ఉంటుంది. కానీ స్పైక్ ఎస్-512 విమానంలో కలిగే మజా మామూలుది కాదు. ఎందుకంటే ఈ ఫ్లయిట్‌లో చిన్న చిన్న కిటికీలు కాదు ఉండేది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ మొత్తం అద్దాలే ఉంటాయి. దాంతో ఎటు చూసినా ఆకాశమే కనిపిస్తుంది. విమానంలో ఉన్నామా, ఆకాశంలో విహరిస్తున్నామా అన్నట్టు గొప్ప అనుభూతి కలుగుతుంది.
న్యూయార్‌క నుంచి లండన్ వెళ్లేందుకుగాను ఓ ప్రముఖ సంస్థ దాదాపు ఎనభై వేల మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ విమానాన్ని తయారు చేస్తోంది. టికెట్టు రేటు కూడా ఆ రేంజ్‌లోనే ఉండవచ్చు. అయితే ఇందులో ఒకేసారి ఎక్కువమంది ప్రయాణించడానికి వీలుండదు. పట్టుకు పద్దెనిమిది మందికి మాత్రమే చాన్‌స. ఆ చాన్‌స కూడా అప్పుడే దొరకదు. 2018 వరకూ వేచి ఉండాల్సిందే!