
న్యూయార్క్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానం అమెరికాలో అత్యవసరంగా కిందకు దిగింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని శనివారం న్యూయార్క్‌లో అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రతినిధులు బృందం అమెరికా పర్యటన ముగించుకుని పాకిస్తాన్‌కు తిరిగి వెళుతుండగా విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకోవడంతో న్యూయార్క్‌కు మళ్లించినట్టు జీయో టీవీ వెల్లడించింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది.
సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. విమానాన్ని బాగు చేసేంత వరకు ఇమ్రాన్ ఖాన్ ఆయన బృందం న్యూయార్క్‌లోనే బస చేయనుంది. ఇమ్రాన్ ఖాన్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (చదవండి: కశ్మీర్‌పై పాక్ ప్రధాని ఇమ్రాన్ బెదిరింపులు)
Comments
Please login to add a commentAdd a comment