
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం క్రాష్ అయ్యి కెమెరాకు చిక్కింది. ఈ ఘటన న్యయార్క్‌లోని లాస్ ఏంజింల్స్‌లోని శాంటా మోనికా బీచ్‌లో చోటు చేసుకుంది. ఆ విమానం మోనికా విమానాశ్రయం నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ఎయర్ పోర్టఖి కొద్ది దూరంలో ఉండటంతో.. బీచ్‌లోని ఇసుక మీద తలకిందులుగా ల్యాండ్ అయ్యింది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి పైలెట్ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే విమానం పసిఫిక్ పాలిసేడ్స్ సమీపంలో ఇంజన్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్ శాంటా మోనికా ఎయిర్‌పోర్ట్‌కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బీచ్‌లో ల్యాండ్ చేయడమనేది మీ స్వంత అవగాహనతో చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పైలెట్‌కి బీచ్ తీరంలోవిమానాన్ని ల్యాండ్ చేయడం కష్టమై ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ అనుహ్య ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment