- తిరుమలలో ఉత్తర ద్వారపవేశంతో భక్తజనం ఆనందం
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) సందర్భంగా ఉత్తర ద్వారంలో దర్శించుకుని భక్తులు దివ్యానుభూతిని పొందారు. వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల సంవత్సరాది గురువారమే రావడంతో డిసెంబర్ 31 నాటికే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3.05 గంటల నుంచీ సామాన్య భక్తులను అనుమతించడంతో దాదాపు రెండు లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు.
రికార్డు స్థాయిలో భక్తులు రావడంతో రద్దీ పెరిగి దర్శనం కోసం క్యూలైన్లో తోపులాటలు చోటుచేసుకున్నాయి. భక్తులు ఇక్కట్లు పడ్డారు. కాగా, వీఐపీ లకు కేటాయించే టికెట్లలో ఈ ఏడాది 70 శాతం కోత విధించి 2,474 టికెట్లే ఇచ్చారు. 1.20 గంట ల నుంచి వీఐపీలకు దర్శనం ప్రారంభించి 3 గంటలకు పూర్తి చేశారు. 3.05 గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. గురువారం సాయంత్రం టీటీడీ ఉద్యోగులను ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించారు. తమనూ అనుమతించాలని పోలీసు కుటుంబాలు కోరినా అనుమతించకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
శ్రీవారి సేవలో జడ్జిలు, ప్రముఖులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ.రమ ణ, జస్టిస్ రంజన్ గొగై, ఆంధ్ర, తెలంగాణ ఉవ్ముడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, కేరళ, ఢిల్లీ, వుద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ మీనాకువూరి, జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ సంజయ్ కిశోర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు, గౌహతి తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి కె.శ్రీధర్‌రావు, నెదర్లాండ్‌లోని అంతర్జాతీయ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దళ్వార్ బండారి.. వేంకటేశ్వర స్వామి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
స్వర్ణ రథంపై సర్వాంతర్యామి
తిరుమలలో గురువారం స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తలోకానికి తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని కల్పించారు.