vaikuntha ekadasi
-
తిరుమల: ముగిసిన వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. గురువారం నుంచి యథావిధిగా శ్రీవారి కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. టైమ్ స్లాట్ టికెట్లు పొందిన వారికి కేటాయించిన నిర్ణీత సమయంలో త్వరితగతిన దర్శనం లభిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 58,184 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 16,122 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.20 కోట్లు వేశారు. శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించుకున్నారు. కాగా, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం తిరుమల నడక మార్గంలో శాశ్వతంగా షెడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈవో ఏవీ ధర్మారెడ్డితో మాట్లాడదలచుకున్న భక్తులు 0877–2263261 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. -
ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు
-
కనుల పండువగా వైకుంఠ ఏకాదశి
ఆలయాల్లో భక్తులు కోలాహలం నిర్మల్(మామడ) : వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మండలంలోని పొన్కల్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ గంగాధర్, భక్తులు హరీశ్‌కుమార్, గంగారెడ్డి, భూమేశ్వర్, హన్మంత్‌రావులు పాల్గొన్నారు. దిలావర్పూర్ : స్థానిక రామాలయంతో పాటు అత్యంత ప్రాచీన ప్రాశస్త్యంగల మండలంలోని కదిలి పరిసర అటవీప్రాంతంలోని పాపహేశ్వరాలయంలో, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీలక్షీ్మనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక సర్పంచ్ నంద అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధనె నర్సయ్య, వీడీసీ నాయకులు ధనె రవి, గుణవంత్‌రావు, ఉమాశంకర్, ఎస్ఎంసీ చైర్మన్ నందముత్యం, సప్పలరవి, కదిలిలో మాజీ చైర్మన్ నార్వాడి సంభాజీరావుపాటిల్, నాయకులు యన్ .భుజంగ్‌రావు, భూమేశ్, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. -
మోహన్ బాబు ఆవేదన..
-
ధ్వజస్తంభానికి మొక్కుకునే అవకాశమూ లేదా?
టీటీడీపై మండిపడ్డ సినీ నటుడు మోహన్‌బాబు సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధ్వజస్తంభానికి నమస్కరించుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సినీ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బతీస్తుందన్నారు. అతి ముఖ్యుల పేరుతో కొందరికి మాత్రమే ధ్వజస్తంభాన్ని తాకే అవకాశం ఇవ్వటం సరికాదని మండిపడ్డారు. ఏకాదశి రోజున ధ్వజస్తంభం చేతులతో సృశించి ఆథ్యాత్మిక అనుభూతిని పొందుతారని అలాంటి వాటిని దూరం చేయటం ధార్మిక సంస్థకు తగదన్నారు. టీటీడీలో ఒక్కోఅధికారి ఒక్కో నిబంధన అమలు చేయటం సరికాదని అన్నారు. టీటీడీ డబ్బున్నవాళ్లకి దగ్గరవుతూ, సామాన్యులకు దూరమవుతోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు తిరుమలలో సరికావన్నారు. -
ముక్కోటికి భద్రాద్రి ముస్తాబు
నేడు తెప్పోత్సవం– రేపు ఉత్తరద్వార దర్శనం భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయం ముక్కోటికి ముస్తాబవుతోంది. ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవం, సోమవారం తెల్లవారుజామున జరిగే ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సుమారు 50 వేల మంది వస్తారనే అంచనాలతో జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం అవుతుంది. సోమవారం వేకువజామున 3 గంటలకు ఉత్తరద్వారంలో స్వామివారిని వేంచేయింపజేస్తారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గోదావరి స్నానఘట్టాల రేవు, మిథిలాస్టేడియం ప్రాంగణాల్లో టెంట్లు ఏర్పాటు చేశారు. రెండు లక్షల లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో రమేష్‌బాబు తెలిపారు. దేవస్థానం తూర్పు మెట్ల వైపు ఉన్న ప్రత్యేక కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలను అందించేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాన్ని ఉచితంగానే తిలకించవచ్చు. అయితే, ఉత్తర ద్వార దర్శనానికి మాత్రం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేశారు. రూ.1000, 500, 250 విలువైన టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకోకుండా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నేతృత్వంలో భద్రాచలం డీఎస్పీ అశోక్‌కుమార్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తిరుమలలో రెండు రోజులు సిఫార్సు లేఖలు రద్దు
వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆది, సోమ వారాలలో రెండు రోజుల పాటు దివ్యదర్శనం, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు నిండారు. మిగిలిన భక్తులను టీటీడీ సిబ్బంది మాడ వీధుల్లోకి పంపుతున్నారు. ఇప్పటికే దాదాపు లక్షమంది వరకు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వేకువ జామున 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రత్యేక అలంకరణ, కైంకర్యాలు జరిగిన తర్వాత దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 2 గంటలకు వీఐపీ దర్శనం, 4 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దివ్య దర్శనం కోసం వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు స్వామివారిని స్వర్ణరథంపై ఊరేగిస్తారు. ద్వాదశినాడు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సౌకర్యాలను ఈవో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
-
కనులారా వైకుంఠ దర్శనం
సర్వదర్శనంలో కిక్కిరిసిన భక్తులు వీఐపీ టికెట్లు రద్దు.. సామాన్యులకే దర్శనం టీటీడీ ఈవోకు సీఎం చంద్రబాబు అభినందన తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు వైభవంగా సాగాయి. మంగళవారం కూడా భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) ప్రదక్షిణతో ఆనందపరవశులయ్యారు. అంచనాలకు మించి జనం వచ్చినా అందరికీ దర్శనం, ఉత్తర ద్వార ప్రవేశం కల్పించడంలో టీటీడీ అధికారులు సఫలీకృతులయ్యారు. రికార్డుస్థాయిలో 1.63 లక్షల మందికి ముక్కోటి దర్శనం ఏకాదశి రోజు సోమవారం 88,000 మందికి ముక్కోటి దర్శనం కల్పించింది. ద్వాదశి రోజైన మంగళవారం వేకువజాము నుంచి సర్వదర్శనం ప్రారంభించారు. అప్పటి నుంచి అర్ధరాత్రి వరకు సుమారు 75 వేల మందికి దర్శనం కల్పించారు. అంటే రికార్డుస్థాయిలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో దాదాపుగా 1.63 లక్షల మందికి భక్తులకు ముక్కోటి దర్శనం కల్పించారు. ద్వాదశిలోనూ వీఐపీ టికెట్లు రద్దు వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ టికెట్లను భారీగా కోత విధించారు. మొత్తం 2,800 టికెట్ల భక్తులకు రెండు గంటల్లోపే వీఐపీ దర్శనం ముగించారు. అనంతరం నిర్విరామంగా దర్శనం కల్పించారు. ద్వాదశిలో రోజు మంగళవారం కూడా వీఐపీ టికెట్లు రద్దుచేశారు. ప్రోటోకాల్ పరిధిలో వచ్చేవారికి కూడా ఎలాంటి టికెట్లు ఇవ్వలేదు. దీనివల్ల సామాన్య భక్తులు మరింత హాయిగా, త్వరగా స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల క్యూల్లో భక్తుల మధ్య కొంత తోపులాటలు కనిపించాయి. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులకు క్యూల్లో అన్నప్రసాదాలు, వే డిపాలు, కాఫీ, టీ అందజేయడంలో టీటీడీ నిత్యాన్నప్రసాద విభాగం సఫలీకృతమైంది. 10,800 మందికి రూ.300 టికెట్ల భక్తులకు దర్శనం ద్వాదశి దర్శనంకోసం రూ.300 టికెట్ల ను రిజర్వు చేసుకున్న 10,800 మంది భక్తులకు మంగళవారం సంతృప్తికరమైన దర్శనం లభించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారికి కేటాయించిన సమయాల్లో గంటకు 2500 మంది చొప్పున దర్శనానికి అనుమతించారు. టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం ఏకాదశితోపాటు ద్వాదశిలోనూ టీటీడీ ఉద్యోగులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. వీరికి ఇక్కడి టీబీసీ-73 ప్రవేశ మార్గం నుండి భక్తులను అనుమతించారు. వారితోపాటు పోలీసులు, వారి కుటుంబ సభ్యులను దర్శనానికి అనుమతించారు. టీటీడీ ఈవో, జేఈవో స్వీయ పర్యవేక్షణ టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు సోమ, మంగళవారాల్లో అన్ని క్యూల ను స్వయంగా పర్యవేక్షించారు. ఉద యం నుండి రాత్రి వరకు పలుమార్లు ఆలయంలోనూ, క్యూల్లోనూ కలియది రుగుతూ సామాన్య భక్తులకు దర్శనం కల్పించే చర్యలు వేగవంతం చేశారు. టీటీడీకి సీఎం చంద్రబాబు అభినందనలు ఏకాదశి, ద్వాదశిలో సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం, మౌలిక సదుపాయాలు కల్పిండటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ప్రత్యేకంగా అభినందించారు. ఈమేరకు ఈవో దొండపాటి సాంబశివరావుతో మాట్లాడారు. వారికి సహకరించిన జేఈవో కేఎస్శ్రీనివాసరాజు బృందానికి సీఎం అభినందనలు తెలిపారు. -
వైభవంగా ముక్కోటి ఏకాదశి
ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు తిరుమలలో 90,000 మందికి దర్శనం సాక్షి, నెట్వర్క్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తజన సాగరమైంది. గతంలోకంటే ఈసారి సామాన్య భక్తులకు దర్శన కష్టాలు తగ్గాయి. వీఐపీ టికెట్ల కేటాయింపుల్లో భారీగా కోత పడింది. రోజంతా నిరీక్షించిన భక్తులు వైకుంఠ ద్వార దర్శనం తర్వాత ఆనందపరవశులయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం వేకువజామున ఒంటి గంట నుంచి భక్తులను క్యూలోకి తీసుకున్నారు. భక్తులకు ఆహార సమస్యల్లేకుండా అన్ని రకాల అన్నప్రసాదాలు, మంచినీరు, కాఫీ, టీ, వేడిపాలు అందజేశారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలనుంచి సామాన్య భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి వరకు సుమారు 90 వేల మందికి దర్శనం కల్పించారు. టీటీడీ ఈవోగా దొండపాటి సాంబశివరావు బాధ్యతలు చేపట్టాక వీఐపీ సేవ లకు భారీగా కోతపడింది. రెండేళ్ల ముందు వరకు 10 వేలు దాటే వీఐపీ టికెట్లు గతేడాది 2,474 ఇవ్వగా, ఈసారి 2,800 లోపే ఇచ్చారు. సామాన్య భక్తులకు ఇబ్బందిలేకుండా ఆ టికెట్లు పొందిన ప్రముఖులకు అర్ధరాత్రి తర్వాత శ్రీవారి దర్శనం ప్రారంభించి 3.30 గంటలకే పూర్తిచేశారు. ఆ తర్వాత సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వర్ణరథంపై సర్వాంతర్యామి దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సోమవారం స్వర్ణరథోత్సవం(రథరంగ డోలోత్సవం) వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వర్ణకాంతుల స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తకోటికి దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి 11వరకు స్వర్ణ రథోత్సవం ఊరేగింపు అశేష భక్తజనం గోవిందనామ స్మరణల మధ్య వేడుకగా సాగింది. స్వర్ణ రథోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు కుటుంబం, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ముగ్గురికి తీవ్రగాయాలు స్వర్ణ రథానికి మెట్లుగా వాడే ఇనుప కమ్మీ స్టాండుపై భక్తులు ఎక్కడంతో అది పక్కకు ఒరిగిపోవడంతో ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో టీటీడీ ఫొటోగ్రాఫర్‌తోపాటు మరో ఇద్దరు పత్రికా ఫొటోగ్రాఫర్లకు గాయాలయ్యాయి. సహజ శిలామూర్తికి క్షీరాభిషేకం తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని సహజ శిలామూర్తికి సోమవారం భక్తులు క్షీరాభిషేకం, పూజలు చేశారు. 30 అడుగుల గజపుష్ప, తులసి మాలతో అలంకరించారు. శిరస్సుపై కిరీటం, ముఖం పైభాగంలోని నుదురు, కను రెప్పలు, కళ్లు, ముక్కు, నోరు, కంఠం, కంఠాభరణం, హృదయ లక్ష్మితో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఈ శిలామూర్తిని తొలిసారిగా 2012, జనవరి 4న వైకుంఠ ఏకాదశి రోజున సాక్షి దినపత్రిక తమ పాఠకులకు పరిచయం చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్త బృందాలు ఐదేళ్లుగా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కల్యాణ వెంకన ్నకు బంగారు కిరీటాలు చంద్రగిరి: చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం మూడు బంగారు కిరీటాలు కానుకగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త 1.7 కిలోల బరువున్న ఈ మూడు బంగారు కిరీటాలను అందజేశారు. టీటీడీ జేఈవో పోలా భాస్కర్ ఈ కిరీటాలను దాతల నుంచి స్వీకరించారు. వీటి విలువ సుమారు రూ.52.27 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన మల్లన్న శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. దాదాపు 70వేలకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. గర్భాలయ ఉత్తర ద్వారంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులను రావణవాహనంపై గ్రామోత్సవం చేపట్టారు. శ్రీవారి సేవలో న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలె, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, రంజన్ గోగయ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ స్వతంత్రకుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్రావు తిరుమలేశుని దర్శించుకున్నారు. రాములవారి మేడ నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారిని, అనంతరం వకుళమాతను దర్శిం చుకుని, వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేశారు. హుండీలో కానుకలు సమర్పించారు. న్యాయమూర్తులకు ఆలయ అధికారులు ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
ముక్కోటి కాంతులు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం నగరంలోని ఆలయాలు రంగు రంగుల పూలు... విద్యుత్తు దీపాల అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాల్లోని వైష్ణవ దేవాలయాల వద్ద ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. -
వైకుంఠద్వార దర్శనాలు ఓ రికార్డు: టీటీడీ ఈవో సాంబశివరావు
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భ క్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. తిరుమలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఎన్నడూ లేనివిధంగా ఏకాదశి దర్శనంలో వీఐపీ టికెట్లను 2,474కు పరిమితం చేసి, గంటన్నరలోపే వారికి దర్శనం పూర్తి చేశామన్నారు. తర్వాత 78,003 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. ద్వాదశి రోజు 85,077 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. టీటీడీ చరిత్రలో ఇది రికార్డని తెలిపారు. -
‘వైకుంఠ’ దర్శనం.. దివ్యానుభూతి
తిరుమలలో ఉత్తర ద్వారపవేశంతో భక్తజనం ఆనందం సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) సందర్భంగా ఉత్తర ద్వారంలో దర్శించుకుని భక్తులు దివ్యానుభూతిని పొందారు. వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల సంవత్సరాది గురువారమే రావడంతో డిసెంబర్ 31 నాటికే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3.05 గంటల నుంచీ సామాన్య భక్తులను అనుమతించడంతో దాదాపు రెండు లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు రావడంతో రద్దీ పెరిగి దర్శనం కోసం క్యూలైన్లో తోపులాటలు చోటుచేసుకున్నాయి. భక్తులు ఇక్కట్లు పడ్డారు. కాగా, వీఐపీ లకు కేటాయించే టికెట్లలో ఈ ఏడాది 70 శాతం కోత విధించి 2,474 టికెట్లే ఇచ్చారు. 1.20 గంట ల నుంచి వీఐపీలకు దర్శనం ప్రారంభించి 3 గంటలకు పూర్తి చేశారు. 3.05 గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు. గురువారం సాయంత్రం టీటీడీ ఉద్యోగులను ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించారు. తమనూ అనుమతించాలని పోలీసు కుటుంబాలు కోరినా అనుమతించకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీవారి సేవలో జడ్జిలు, ప్రముఖులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ.రమ ణ, జస్టిస్ రంజన్ గొగై, ఆంధ్ర, తెలంగాణ ఉవ్ముడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, కేరళ, ఢిల్లీ, వుద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ మీనాకువూరి, జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ సంజయ్ కిశోర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్రావు, గౌహతి తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి కె.శ్రీధర్‌రావు, నెదర్లాండ్‌లోని అంతర్జాతీయ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దళ్వార్ బండారి.. వేంకటేశ్వర స్వామి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. స్వర్ణ రథంపై సర్వాంతర్యామి తిరుమలలో గురువారం స్వర్ణ రథోత్సవం (రథరంగ డోలోత్సవం) కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తలోకానికి తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. -
నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
నేటి నుంచి అధ్యయనోత్సవాలు ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు 31న తెప్పోత్సవం 1న ఉత్తర ద్వార దర్శనం నేటి నుంచి నిత్య కల్యాణాలు రద్దు భద్రాచలం టౌన్ : భద్రాద్రి రామాలయం లో అధ్యయనోత్సవాలు నేడు ప్రారంభమవుతాయి. స్వామి వారు నేటి నుంచి ఈ నె ల 30వ తేదీ వరకు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 31న పవిత్ర గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవాన్ని, జనవరి 1న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావచ్చని దేవస్థానం అ ధికారులు అంచనా వేసి, తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా ఉత్తర ద్వారానికి ఎ దురుగా కల్యాణ మండపం ప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలు, సురభి సంస్థ వారి నాటకాల నిర్వహణకు ప్రత్యేకంగా వే దిక రూపొందిస్తున్నారు. ఉత్సవాలు ము గిసేంత వరకు ఈ వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ అధ్యయనోత్సవాల కోసం భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రామాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులను ఆహ్వానిస్తూ అభయాంజ నేయ స్వామి పార్క్, దమ్మక్క విగ్రహం, పంచాయతీ కార్యాలయం వద్ద, ఆలయం సమీపంలో స్వాగత ద్వారాలు ఏర్పాటవుతున్నాయి. నేటి నుంచి అధ్యయనోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా సోమవారం నుంచి జనవరి 11వ తేది వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. పగల్‌పత్తు ఉత్సవాలలో భాగంగా స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాపత్తు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పల్లకిపై సేవలను స్వామి వారు రాత్రి వేళల్లో అందుకుంటారు. విలాసోత్సవాలు జనవరి 12 నుంచి స్వామి వారికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విలాసోత్సవాలు ఉంటాయి. 12న శ్రీరామదాసు మండపంలో రెవెన్యూ వారు, 13న నసింహదాస మండపంలో పంచాయతీ వారు, 14న వశిష్ట మండపంలో దేవస్థానం సిబ్బంది ఈ విలాసోత్సవాలు ఉంటాయి. జనవరి 11న కూడారై పాశుర ఉత్సవం, 14న గోదా కల్యాణం, 15న మంకర సంక్రాంతి ఉత్సవం, 17న విశ్వరూప సేవలు ఉంటాయి. నేటి నుంచి నిత్య కల్యాణాలు రద్దు అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి జనవరి 1వ తేదీ వరకు స్వా మి వారికి నిత్య కల్యాణాలు ఉండవని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. పగ ల్పత్తు ఉత్సవాలు 22న మత్స్యావతారం 23న కూర్మావతారం 24న వ రాహావతారం 25న నరసింహావతారం 26న వామనావతారం 27నపరశురామావతారం 28న శ్రీరామావతారం 29న బలరామావతారం 30న శ్రీ కృష్ణావతారం రాపత్తు ఉత్సవాలు 01న శ్రీ రామ రక్షామండపం (డీఎస్పీ కార్యాలయం) 02న శ్రీ హరిదాసు మండపం (అంబా సత్రం) 03న శ్రీ గోకుల మండపం (శ్రీ కష్ణ దేవాలయం) 04న శ్రీరామ దూత మండపం (అభయాంజనేయ స్వామి మండపం) 05న శ్రీ గోవింద రాజ మండపం (తాత గుడి) 06న వన విహార మండపం (వేస్ట్ ల్యాండ్) 07న పునర్వసు మండపం 08న విశ్రాంత మండపం (దొంగలదోపు ఉత్సవం) కల్కి అవతారం (శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద) 09న వన విహార మండపం (వేస్ట్ ల్యాండ్) 10న నమ్మాళ్వార్ల పరమపదోత్సవం (ఆలయంలో) 11న అధ్యయనోత్సవాల సమాప్తి (దసరా మండపం) -
‘వైకుంఠ’ దర్శనం కోసం టీటీడీ పై ఒత్తిడి
భారీసంఖ్యలో ప్రజాప్రతినిధులు, ప్రముఖుల రాకపై టీటీడీకి సందేశం అన్నిటిలోనూ కత్తెరవేయాలని భావిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు బస, దర్శన ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ వీఐపీల కోసం 4 వేల గదులు బ్లాక్ చేయాలని నిర్ణయం తిరుమల: 2015 కొత్త సంవత్సరం ప్రారంభం, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఒకే రోజు రానున్నాయి. అతిముఖ్యమైన ఆ రోజు న తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడి నుంచి ప్రముఖుల వరకు ఎదురు చూస్తున్నారు. దీనివల్ల ఏకాదశి దర్శనం కోసం టీటీడీపై ఒత్తిడి రె ట్టింపు స్థాయిలో ఉంది. పరిమిత సంఖ్యలోనే వీఐపీ దర్శనాలు అమలు చేసి, ఎక్కువ సమ యం సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వైకుంఠ దర్శనానికి పోటెత్తనున్న వీఐపీలు వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ఈసారి మాత్రం కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి జనవరి 1వ తేదీన రావడం వల్ల స్వామిని దర్శించుకుని, ఉత్తర ద్వారంలో ప్రదక్షిణ చేసేందుకు భక్తులు మరింత పోటెత్తే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో భాగం గా ఇప్పటికే వేల సంఖ్యలో లేఖలు, ఫ్యాక్స్ ఉత్తర్వులు, సెల్‌ఫోన్ ఆదేశాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, మరో 20 మంది ఎంపీలు, 150 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 మంది న్యాయవిభాగం నుంచి వైకుంఠ దర్శనం కోసం టీటీడీకి సమాచారం అందింది. వీఐపీలతోపాటు వారి బంధుగణాలు కూడా వేల సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వీఐపీ దర్శనాల్లో భారీగా కోత ఈసారి కొత్త సంవత్సరం, ఏకాదశి ఒకే రోజు రావటం వల్ల సామాన్య భక్తులు అంచనాలకు మించి వచ్చే అవకాశం ఉన్నందున వీఐపీ దర్శనాల్లో భారీగా కోత వేయాలని టీటీడీ కొత్త ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక వీఐపీతోపాటు ముగ్గురికి మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అమల్లో కూడా అదే విధానం పాటించాలని సంకల్పించారు. ఎంత ఒత్తిడి చేసినా అదనపు టికెట్లు, గదులు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇందుకోసం విధి విధానాలు రూపొందించారు. హోదాను బట్టి బస, దర్శనం తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శనం కల్పించేందుకు టీటీడీ సన్నద్ధమయింది. దర్శనానికి వచ్చే వీఐపీల జాబితా సిద్ధం చేసేందుకు జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారుల బృందం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. మొదటి జాబితాలో రాజ్యాంగ పరిధిలో హోదా కలిగిన వారు, రెండో జాబితాలో ఎంపీ, ఎంఎల్ఏ, ఎంఎల్ఏసీలు, మూడో జాబితాలో అధికారులు, ఇతరులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్టేట్ ఆఫీసర్ వీ.దేవేంద్రరెడ్డి, డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఓఎస్డీ దామోదరం సుమారు 50 మంది సిబ్బందితో కలసి గదులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఈనెల 31వ తేదీన సుమారు 4 వేల గదులను బ్లాక్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.