
వయసు పైబడి, ఎండిపోయిన చెట్టు కనిపిస్తే ఏం చేస్తారు? కలప కోసమో, వంట చెరకు కోసమో నరికేస్తారు. ఎలాగో చనిపోయింది కాబట్టి ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. కానీ అమెరికాలోని బోయిస్ ప్రాంతానికి ఆర్టిస్ట్ కమ్ లైబ్రేరియన్ అయిన షరాలీ ఆర్మిటేజ్ సృజనాత్మకంగా ఆలోచించింది. అప్పటికే కొమ్మలన్నీ నేలరాలి, మోడుగా మిగిలిన 110 ఏళ్ల కిందటి చెట్టును ఓ అందమైన లైబ్రరీగా మార్చేసింది. దానికి ‘లిటిల్ ఫ్రీ లైబ్రరీ’ అని పేరు పెట్టింది. నిజానికి ఈ పేరుతోనే ఓ ఎన్జీవో ఉంది. దీనికి 88 దేశాల్లో లైబ్రరీ షేరింగ్ నెట్‌వర్క్ ఉంది. ఎవరికి ఏ బుక్ కావాలన్నా తీసుకోవడం, చదివిన వెంటనే తిరిగి ఇచ్చేయడం ఈ నెట్‌వర్క్ ద్వారా జరుగుతుంది. ఈ సర్వీస్ అంతా ఫ్రీనే. ఇప్పుడా నెట్‌వర్క్‌లోనే ఈ చెట్టు లైబ్రరీని చేర్చింది షరాలీ. చెట్టు కాండానికి ఓ డోర్ పెట్టింది. లోపల అరలు ఏర్పాటు చేసి బుక్స్‌ను అందులో ఉంచింది. ఈ చెట్టు లైబ్రరీ ఫొటోను గతేడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే లక్ష మందికిపైగా షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment