
మంగళగిరి(ఏపీ): అంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించాలని నిర్ణయించింది. అనేక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య , సేవా, విద్యా , గ్రంథాలయ సంస్థల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు కార్యాలయంలో ఆయనను కలసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రంధాలయాల డిజిటలైజషన్, ఆధునీకరణ, గ్రంధాల పఠనం పై మరింత అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం, అధ్యయనం చేయనున్నామని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.