గ్రంథాలయ సెస్‌ వసూలుకు చర్యలు | action plan for library ses | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ సెస్‌ వసూలుకు చర్యలు

Published Wed, Sep 28 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

జిల్లాలో 2015–16లో పంచాయతీల ద్వారా 8 శాతం గ్రంథాలయ సెస్సును ఆన్‌లైన్‌లో గ్రంథాలయ శాఖ ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, 2011 నుంచి పంచాయతీల ద్వారా సెస్‌ త్వరితగతిన వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జయ్యవరపు శ్రీరామమూర్తి సూచించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): జిల్లాలో 2015–16లో పంచాయతీల ద్వారా 8 శాతం గ్రంథాలయ సెస్సును ఆన్‌లైన్‌లో గ్రంథాలయ శాఖ ఖాతాకు  జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, 2011 నుంచి పంచాయతీల ద్వారా సెస్‌ త్వరితగతిన వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జయ్యవరపు శ్రీరామమూర్తి సూచించారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ శ్రీరామమూర్తి బుధవారం సభ్యులతో సమీక్షించారు. గొల్లలకోడేరు, వేలూర్పు గ్రంథాలయ భవనాల నిర్మాణానికి చేరో రూ.26 లక్షలు, భీమవరం శాఖా గ్రంథాలయం మరమ్మతులకు రూ.6 లక్షలు, ఎలక్ట్రికల్‌ వాటర్‌ మోటారు తదితర మరమ్మతులకు రూ.6 లక్షలు, జంగారెడ్డిగూడెం గ్రంథాలయ మరమ్మతులకు రూ.5 లక్షలు, జిల్లా కేంద్ర గ్రంథాలయ పై అంతస్తులోని భవనం మరమ్మతులు, ఆధునికీకరణ పనులు నిమిత్తం రూ.6.50 లక్షలు, ఆచంట గ్రంథాలయం ఆధునికీకరణకు సభ్యులు తీర్మానించారన్నారు. కానిస్టేబుళ్లు, ఎస్సై, గ్రామ కార్యదర్శులు, గ్రూప్‌ వన్, టూ పోస్టులకు ఉచితంగా ఏలూరు శాఖా గ్రంథాలయంలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఇస్తామన్నారు. డీఈవో డి.మధుసూదనరావు, సమాచార శాఖ అడిషినల్‌ డైరెక్టర్‌ వి.భాస్కరనరసింహం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్వి సీహెచ్‌ మదారు, గ్రంథాలయ సంస్థ సభ్యులు బండి సుజాత, కొడవలి వెంకటరమణ, లైబ్రేరియన్‌ కె.రామ్మోహనరావు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement