గ్రంథాలయం ఏర్పాటుకు నిధులిస్తాం | Library Arrangement Funds Granted | Sakshi
Sakshi News home page

గ్రంథాలయం ఏర్పాటుకు నిధులిస్తాం

Published Fri, Dec 27 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

Library Arrangement Funds Granted

 రణస్థలం రూరల్, న్యూస్‌లైన్: పైడిభీమవరం పంచాయతీలో గ్రంథాలయం ఏర్పాటుకు శ్యాంక్రగ్ పిస్టన్స్ ఉద్యోగుల సం ఘం ముందుకొచ్చింది. గ్రామంలో గురువారం సాక్షి జనసభ జరిగింది. ఇందులో బావిశెట్టి మధుసూదనరావుతో పాటు మరి కొంతమంది యువకులు గ్రామంలో గ్రంథాల యం లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయూరు. దీనిపై స్థానిక శ్యాంక్రగ్ పిస్టన్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పందించారు. పంచాయతీ తరఫున స్థలం మంజూరు చేస్తే గ్రంథాలయం ఏర్పాటుకు నిధులు సమకూరుస్తామని సంఘ ప్రతినిధి కె.కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ మేరకు లేఖను సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్‌కు అందించారు. గ్రంథాలయంతోపాటు నిరుద్యోగ యువకులకు శిక్షణకేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పిప్పళ్ల వెంకటరమణతో పాటు ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement