- కస్టమ్స్, ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ రాజేంద్రన్
గాంధీభవన్ లైబ్రరీని అధ్యయన కేంద్రగా మార్చాలి
Published Fri, Nov 11 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
కాకినాడ కల్చరల్ :
గాంధీజీ జీవిత చరిత్రను వివరించే గ్రంథాలతో గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పరిశోధకులకు ఉపయోగపడే అధ్యయన కేంద్రంగా తయారు చేయాలని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సి.రాజేంద్రన్ సూచించారు. స్థానిక గాంధీభవన్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. గాంధీజీ రచనలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహాత్ముని జననం నుంచి మరణం వరకు ఏర్పాటు చేసిన చిత్రాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి నూలు దండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గాంధీభవన్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, కార్యదర్శి డీవీఎన్ శర్మ, అల్లూరి సురేంద్ర, వాసా సత్యనారాయణ, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement