
జయనగర(కర్ణాటక): ఇందిరా క్యాంటీన్‌లో అందించే అల్పాహారంలో బొద్దింక ప్రత్యక్షమైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. అయితే చనిపోయిన బొద్దింకను గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వేసినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈనెల 20న మాలగాళలో ఉన్న ఇందిరాక్యాంటీన్‌లో ఓ వ్యక్తి అల్పాహారం కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆహారపదార్థంలో బొద్దింక కనిపించింది. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన హేమంత్‌కుమార్ అనేవ్యక్తి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌చేశాడు. స్పందించిన పాలికె అధికారులు ఆ క్యాంటీన్‌లోని సీసీకెమెరాలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు అల్పాహారంలో ఉద్దేశపూర్వకంగా బొద్దింక వదిలినట్లు గుర్తించారు. హేమంత్‌కుమార్‌తో పాటు అల్పాహారానికి వచ్చిన నలుగురిపై పాలికె అధికారులు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కాగా షేప్‌టాక్ అనే సంస్థ ఇందిరా క్యాంటీన్‌కు ఆహారాన్ని సరపరా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment