మన దగ్గర వచ్చే కొన్ని సినిమాలు, సీరియల్స్‌లోని సన్నివేశాలు చూస్తే ఓవరాక్షన్‌కే.. ఓవరాక్షన్ నేర్పించే సత్తా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఏ సీరియల్, ఏ సినిమా అనే టాపిక్ వద్దు. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ హిందీ సిరీయల్‌కు సంబంధించిన సీన్ చూస్తే.. మీకు కడుపులో తిప్పుతుంది. యాక్ థూ ఇదేం దరిద్రం అని తిట్టుకోకమానరు. ఆ ఓవర్‌యాక్షన్ సీన్ వివరాలు..
(చదవండి: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్)
కొన్నేళ్ల క్రితం హిందీలో టెలికాస్ట్ అయిన ‘దిల్ సే ది దువా సౌభాగ్యవతి భవా’ సీరియల్‌లోని సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిలో హీరో-హీరోయిన్ల ఫస్ట్ నైట్ సన్నివేశం వస్తుంది. హీరో ప్రేమగా హీరోయిన్‌ను దగ్గరకు తీసుకునే సమయంలో ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆమె ఒంటి మీదకు బొద్దింక ఎక్కుతుంది. దాన్ని చూసి హీరోయిన్ తన మీద పాము పడ్డట్లు ఫీలై భయంతో అల్లంత దూరం పారిపోతుంది.
(చదవండి: ఆ హీరో తల్లి నన్ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది: రేఖ)
ఇక మన హీరో గారు ఆ బొద్దింకను దొరకబుచ్చుకుని.. తన భార్యను భయపెట్టినందకు ప్రతీకారంగా.. దాన్ని చంపాలనుకుంటాడు. కానీ హీరోయిన్ వారించడంతో ఆగిపోతాడు. ఆ సమయంలో అతడికి ఓ తింగరి ఆలోచన వస్తుంది. బొద్దింక మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం భార్య తన కోసం తెచ్చిన పాలల్లో దాన్ని వేసి.. శుభ్రంగా తాగి.. తృప్తిగా బ్రేవ్‌మంటాడు.
(చదవండి: భారీ రెమ్యునరేషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. రిప్లై ఇచ్చిన కరీనా)
ఈ సన్నివేశం చూసి అటు హీరోయిన్‌కి ఇటు వీడియో చూస్తున్న మనకు ఒకేసారి కళ్లు తిరగడంతో పాటు వాంతులు కూడా అవుతాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు సీరియల్ దర్శకుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి.. ఇలాంటి సన్నివేశాలు ఇంకో రెండు మూడు చూస్తే మా జీవితం మీద మాకే విరక్తి కలుగుతుంది.. యాక్ థూ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment