
జమ్మికుంటలో బొద్దింకల బిర్యానీ?
పంచాయతీ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు
జమ్మికుంట(హుజూరాబాద్) :
పట్టణంలోని శ్రీ వినాయక బార్ అండ్ రెస్టారెంట్‌లో ఇద్దరు బిర్యానీ తినేందుకు వెళ్లగా అందులో రెండు బొద్దింకలు వచ్చాయి. బిర్యాని వండే క్రమంలో సరిగా చూడకపోవడంతో అందులో బొద్దింకలు పడ్డాయని బాధితులు ఆరోపించారు.
దీనిపై బార్ యజమానిని నిలదీసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో రెండు బొద్దింకలు వచ్చాయని నగర పంచాయతీ కమిషనర్ చింత శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు.