ప్రపంచం చాలా విశాలమైనది. ఇక్కడ కనిపించే వింతలకు, విశేషాలకు కొదవేలేదు. అలాగే ఇక్కడ రకరకాల జీవజాతులున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ఆహార అభిరుచులు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. కొందరు శాకాహారులుగా జీవనం సాగిస్తుండగా, మరికొందరికి మాసం లేనిదే ముద్దదిగదు. కొన్ని దేశాల్లో పాములను ఇష్టంగా తింటారు. మరికొన్ని దేశాల్లో పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటారు.
చేపలు, కోళ్ల పెంపకం గురించి మనకు తెలిసిందే. ఇదేవిధంగా కొన్ని దేశాల్లో పాములు, పురుగుల పెంపకం కొనసాగుతుంటుంది. తేనెటీగల పెంపకం మాదిరిగానే చైనాలో భారీ ఎత్తున బొద్దింకల పెంపకం సాగుతుంటుంది. ఇది వినగానే మనకు వింతగా అనిపించవచ్చు. కానీ ఇక్కడి ప్రజలలో చాలామంది బొద్దింకల స్నాక్స్ తినేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. పిల్లల చేత కూడా బొద్దింకల స్నాక్స్ తినిపిస్తారు. బొద్దికలు, ఇతర కీటకాలలో ప్రొటీన్ అధిక మోతాదులో ఉండటాన్ని గుర్తించిన చైనావాసులు వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.
చైనాలోని షిచాంగ్ పట్టణంలో భారీ స్థాయిలో బొద్దింకల పెంపకం సాగుతోంది. ఈ వీటి పెంపకం కోసం కలపతో ప్రత్యేకమైన బోర్డులను తయారుచేస్తారు. వీటిలో ప్రత్యేకమైన పద్ధతులలో బొద్దింకలను పెంచుతారు. ప్రస్తుతం చైనాలో వేల సంఖ్యలో బొద్దింకల ఫార్మ్‌లున్నాయి. వీటి నిర్వాహకులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!
Comments
Please login to add a commentAdd a comment