‘బొద్దింక’తో ప్రొటీన్ ఫుడ్! | Protein food with 'Cockroach'! | Sakshi
Sakshi News home page

బొద్దింకను తినడమా?

Published Wed, Jul 27 2016 2:40 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

‘బొద్దింక’తో ప్రొటీన్ ఫుడ్!

‘బొద్దింక’తో ప్రొటీన్ ఫుడ్!

బెంగళూరు : బొద్దింక ద్వారా ఆహారమా.. ఆ మాట వింటేనే ఏదోలా ఉంది కదూ..! వాటిని చూస్తేనే కొంతమంది భయపడతారు. అలాంటిది వాటిని తినడమా..? కానీ బొద్దింకలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు పరిశోధకులు. బొద్దింకల కడుపులో మనకెంతో మేలు చేసే ప్రొటీన్లు ఉన్నాయని బెంగళూరులోని ఇన్‌స్టెమ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఆ చిన్న బొద్దింకలోని ఒక్కో ప్రొటీన్ స్ఫటికాల్లో పాలలో ఉన్న శక్తి కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్త సంచారీ బెనర్జీ పేర్కొంటున్నారు.

అంతేకాదు ఈ స్ఫటికాల్లో ప్రొటీన్లతోపాటు కొంతమేర కొవ్వులు, చక్కెరలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ‘ప్రొటీన్లలో దాదాపు మనకు అవసరమైన అన్ని అమైనోయాసిడ్స్ ఉంటాయని తెలిసిందే. ఎలాగూ ఈ స్ఫటికాల జన్యుక్రమం మొత్తాన్ని తెలుసుకున్నాం కాబట్టి దాని ఆధారంగా సూపర్ ఆహారాన్ని ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల ద్వారా పెద్ద ఎత్తున తయారు చేయొచ్చు’ అని సంచారీ వివరంచారు. పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement