భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు సంచల నం సృష్టించింది. ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. భారత్ తరఫున నేహా (11వ ని.లో), సోనిక (28వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్‌కు జాన్సెన్ ఇబ్బి (40వ ని.లో) ఏకైక గోల్ అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నెదర్లాండ్స్ జట్టు సభ్యులెవరూ ప్రొ లీగ్‌లో ఆడేందుకు ఇక్కడకు రాలేదు. నేడు రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment